Horoscope Today January 20th 2024 : జనవరి 20న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఎంత కష్టించి పనిచేసినా, ఆశించిన ఫలితాలు లభించవు. ప్రయాణాలు అనుకూలించవు. కానీ మీరు ప్రశాంతంగా ఉంటారు. సన్నిహితులతో చర్చలు జరుపుతారు. ఆరోగ్యం ఫర్వాలేదు.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారు సంతోషంగా ఉంటారు. కుటుంబంలో వేడుకలు జరుగుతాయి. వ్యాపారంలో మంచి డీల్స్ కుదుర్చుకుంటారు. వ్యాపారం మీద ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది లాభానే చేకూరుస్తుంది. వృత్తిపరంగా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటారు.
మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు స్నేహితుల నుంచి మంచి లబ్ధి పొందుతారు. సమీప భవిష్యత్లో సాయపడగలిగే వ్యక్తులతో స్నేహం చేస్తారు. ఊహించని విధంగా ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఇవాళ అవసరార్థం ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వం నుంచి కూడా లబ్ధి పొందుతారు.
కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఇంటి మరమ్మతులు, అలంకరణలు చేస్తారు. కానీ ఎమోషనల్గా ఉండకూడదు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆశావాద దృక్పథంలో ముందుకు వెళ్లాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. మీ హృదయం గాయపడవచ్చు. మీ పొదుపు కంటే, ఖర్చులు పెరిగిపోతాయి. వైవాహిక జీవితం మాత్రం మధురంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మీకు తోడుగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారు చాలా తీవ్రమైన ఆలోచనలు చేస్తారు. ప్రకృతివైపు ఆకర్షితులవుతారు. కానీ మాటలు అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం తరువాత ప్రయాణాలు మానుకోండి. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది.
తుల (Libra) : ఈ రోజు తుల రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏ పనులూ చేయకూడదు. లేకుంటే మీకే నష్టం వాటిల్లుతుంది. కష్టం వృథా అవుతుంది. వ్యాపారం విషయంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఆశాజనక ఫలితాలు లభించకపోవచ్చు.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారుచాలా మౌనంగా, ప్రశాంతంగా ఉండాలి. ఆత్మశోధన చేసుకోవాలి. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు వస్తాయి. కానీ ఖర్చులు పెరుగుతాయి. సాయంత్రం వేళ వినోద కార్యక్రమాల్లో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త వహించాలి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కానీ దీనికి కొంత సమయం పట్టవచ్చు. నిరాశకు లోనుకాకండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆస్తి వ్యవహారాలకు, భూతగాదాలకు దూరంగా ఉండాలి. మానసికంకగా ఇవాళ మీకు చికాకుగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. మొండిగా ప్రవర్తిస్తే మీకే నష్టం వాటిల్లుతుంది. పట్టువిడుపుల ధోరణి అవలంభించాలి.
కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారు కొత్త పనులు ప్రారంభిస్తే, కచ్చితంగా విజయవంతం అవుతాయి. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరి మాటలు, ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తాయి. ఆస్తి వ్యవహారాలకు ఇవాళ దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి చాలా బాగుంటుంది. లక్ష్య సాధన కోసం కష్టపడి పనిచేస్తారు. కానీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే గొడవలు, తగాయిదాలు తప్పవు. కొత్త పనులు మాత్రం ప్రారంభించకూడదు. ప్రయాణాలు వాయిదా వేయాలి.