ETV Bharat / bharat

ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారా? - అయితే ఈ ఆహారాలు అస్సలు పెట్టకండి!

Best Foods to Feed Dog : ఈ రోజుల్లో చాలా మంది డాగ్స్​ను పెంచుకుంటున్నారు. అయితే వాటి ఆహారం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటూ ఏది పడితే అది పెడుతుంటారు. ఫలితంగా అవి కొద్ది రోజులకే అనారోగ్యానికి గురవుతుంటాయి. అలాకాకుండా ఉండాలంటే కుక్కలకు ఏ ఆహారాలు మంచివో? ఏవి చెడ్డవో? తెలుసుకోవాలనుకుంటున్నారు నిపుణులు.

Dog
Foods
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 4:06 PM IST

Healthy Foods to Feed Dog : పెట్స్ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ డాగ్స్​ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. వాటిని తమ సొంత పిల్లల్లాగా సాకుతుంటారు. అయితే ఇంట్లో డాగ్స్(Dogs) పెంచుకునే వారు ముఖ్యంగా వాటికి పెట్టే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తాము తినే వాటినే కుక్కలకు ఆహారంగా పెడుతుంటారు. అయితే మన ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని ఫుడ్స్ వాటికి హాని కలిగించొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి ఇంట్లో కుక్కను పెంచుకునే వారు వాటికి ఏ ఆహారం మంచిది? ఏది చెడ్డది? అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కుక్కలకు పెట్టాల్సిన బెస్డ్ ఫుడ్స్ :

యాపిల్స్ : ఇది మీ కుక్కల ఆరోగ్యానికి మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అవి అందులోని విత్తనాలు తప్ప మిగతావన్నీ తినగలవు. కాబట్టి మీరు వాటికి యాపిల్స్ అందించే ముందు ముక్కలను కట్ చేసి విత్తనాలు తీసి అందించండి.

చికెన్ : మీ డాగ్​ డైట్​లో తగినన్ని ఎమైనో యాసిడ్స్, ప్రొటీన్స్ ఉండేలా చూసుకోండి. అందుకోసం మీరు మసాలా లేకుండా బోన్​ లెస్ చికెన్ ఉడికించి వాటికి అందించండి. ఫలితంగా అవి ఆరోగ్యంగా, యాక్టివ్​గా ఉంటాయి.

సాల్మన్​ చేప : మీరు మీ కుక్కకు అందించాల్సిన మరో బెస్ట్ ఫుడ్ ఐటమ్ సాల్మన్ చేప. ఇందులో ఉండే ఒమేగా -3 కొవ్వులు డాగ్ ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా సహాయపడతాయి. ఇది మీ కుక్క స్కిన్, కోట్​ని హెల్దీగా ఉంచుతుంది కూడా. కాబట్టి మీ డాగ్​ డైట్​లో ఒమేగా-3 ఉండేలా చూసుకోండి.

ఓట్ మీల్ : ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మీ డాగ్ డైట్​లో చేర్చడం ద్వారా దాని జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే దీనిని కుక్కకు అందించే ముందు చల్లార్చి ఇవ్వండి.

పెరుగు : కుక్కలకు తగినంత కాల్షియం లభించాలంటే వాటి డైట్​లో పెరుగు ఉండేలా చూసుకోవాలి. అయితే అన్ని కుక్కలు పెరుగు తినడానికి ఇష్టపడవు. దానిని గమనించాలి.

గుడ్లు : కుక్కలకు పెట్టాల్సిన మరో హెల్దీ ఫుడ్.. ఉడికించిన గుడ్లు. వీటిని అందించడం ద్వారా వాటికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా అందులో ఉండే కాల్షియం, అమైనో ఆమ్లాలు మీ డాగ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.

ఇవేకాకుండా క్యారెట్లు, బఠానీలు, గుమ్మడికాయ, ఆకుపచ్చ బీన్స్, పాలకూర, కొబ్బరి వంటివి మీ డాగ్ డైట్​లో ఉండేలా చూసుకోండి. వీటిల్లో ఉండే విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మీ కుక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.

మీ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!

కుక్క ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలు :

ద్రాక్ష : డాగ్​కు ద్రాక్ష, ఎండు ద్రాక్ష అందించడం హానికరం. ఎందుకంటే అవి మూత్రపిండాల వైఫల్యానికి దారితీసే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

చాక్లెట్ : ఇది కూడా కుక్కలకు విషపూరితమైన ఆహారం. ఎందుకంటే చాక్లెట్‌లో థియోబ్రోమిన్ ఉంటుంది. అది కుక్కల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇవి తింటే డాగ్​​లో వాంతులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పేయే అవకాశం కూడా ఉంటుంది.

ఉల్లిపాయలు, వెల్లుల్లి : మీ కుక్క ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి ఉండకుండా చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇవి కుక్కలలో ఎర్ర రక్త కణాలను చంపుతాయి. అలాగే వాటిలో రక్తహీనతకు కారణమవుతాయి.

అవకాడో ఫ్రూట్ : దీనిని కుక్కలకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇందులో పెర్సిన్ అనే ఒక రకమైన కొవ్వు ఉంటుంది. అది కుక్కలు తినడం ద్వారా విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

ఉప్పు, తీపి పదార్థాలు : ఇవి రెండూ కుక్క ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి వీటిని మీ డాగ్​ డైట్​లో ఉండకుండా చూసుకోండి. అదే విధంగా, టీ-కాఫీ, నిమ్మరసం అలాగే మద్య పానీయాలకు కుక్కను దూరంగా ఉంచండి. ఇవే కాకుండా జాజికాయ, పుట్టగొడుగులు వంటివి కూడా డాగ్ హెల్త్​కి మంచివి కావు. కాబట్టి మీరు కుక్కను సాకుతున్నట్లయితే ఈ ఆహారాలను దృష్టిలో ఉంచుకుని వాటి డైట్ సిద్ధం చేయమని సలహా ఇస్తున్నారు నిపుణులు.

మీరు పెట్‌ లవర్సా.. అయితే ఇది చూడాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.