ETV Bharat / bharat

హాథ్రస్ తొక్కిసలాటలో సత్సంగ్ నిర్వాహకులే బాధ్యులు- కుట్రకోణం లేదని చెప్పలేం : సిట్ నివేదిక - Hathras Stampede

Hathras Stampede SIT Report : హాథ్రస్​ తొక్కిసలాట ఘటనకు నిర్వాహకులే బాధ్యులని సిట్ తేల్చింది. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర కోణం దాగిలేదని చెప్పలేమని పేర్కొంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. తొక్కిసలాట ఘటనపై ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి సిట్ నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో యూపీ సర్కార్ ఎస్​డీఎం, సర్కిల్ ఆఫీసర్​తో సహా మరో నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది.

Hathras Stampede SIT Report
Hathras Stampede SIT Report (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 3:53 PM IST

Updated : Jul 9, 2024, 4:01 PM IST

Hathras Stampede SIT Report : ఉత్తర్​ప్రదేశ్ హాథ్రస్​ తొక్కిసలాటకు నిర్వాహకులే బాధ్యులని సిట్​ నివేదిక తేల్చింది. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర కోణం దాగిలేదనే విషయాన్ని తోసిపుచ్చలేమని సిట్ తెలిపింది. ఈ మేరకు యూపీ సర్కార్​కు హాథ్రస్​ తొక్కిసలాట ఘటనపై నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన స్థానిక ఎస్​డీఎం, సర్కిల్ ఆఫీసర్ సహా మరో నలుగురు అధికారులను యూపీ సర్కార్ సస్పెండ్ చేసింది. అలాగే సిట్ తన నివేదికలో స్థానిక అధికార యంత్రాంగం వైఫల్యాలను వెల్లడించింది. ప్రత్యక్ష సాక్షులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా తొక్కిసలాటకు హాథ్రస్​ తొక్కిసలాటకు సత్సంగ్ నిర్వాహకులే బాధ్యులని పేర్కొంది. వారు సత్సంగ్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయలేదని తెలిపింది.

అధికారుల వైఫల్యం వల్లే
"స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగం సత్సంగ్ నిర్వహణను సీరియస్​గా తీసుకోలేదు. సీనియర్ అధికారులకు సరైన సమాచారం అందించడంలో వారు విఫలమయ్యారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు అవసరం. సత్సంగ్ నిర్వహకులు, పోలీసులు, స్థానిక అధికారుల వైఫల్యం వల్ల తొక్కిసలాట జరిగింది. స్థానిక ఎస్​డీఎం, సర్కిల్ ఆఫీసర్, తహసీల్దార్, ఇన్‌స్పెక్టర్, అవుట్‌ పోస్టు ఇన్‌ఛార్జ్‌ లు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. ఎస్​డీఎం సికందర్ రావు వేదికను పరిశీలించకుండానే సత్సంగ్​కు అనుమతి ఇచ్చారు. వాస్తవాలను దాచిపెట్టి కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్వాహకులు అనుమతి తీసుకున్నారు. నిర్వాహకులు ఎక్కువ మంది భక్తులను సత్సంగ్​కు ఆహ్వానించారు. కానీ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయలేదు. ఆశ్రమం ఆర్గనైజింగ్ కమిటీ పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. కార్యక్రమ వేదికను తనిఖీ చేయకుండా స్థానిక పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. భోలే బాబా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండానే జనసమూహాన్ని సత్సంగ్​లో కలిశారు. భారీగా జనం వచ్చినా ఎటువంటి బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. తొక్కిసలాట సమయంలో సత్సంగ్ నిర్వహక కమిటీ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు. " అని సిట్ నివేదికలో పేర్కొంది.

హాథ్రస్​ తొక్కిసలాట జరిగిన వెంటనే అడిషినల్ డీజీపీ అనుపమ్ కులశ్రేష్ఠ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. జులై 2,3,5 తేదీల్లో సిట్ బృందం ఘటనాస్థలికి పరిశీలించింది. ఈ దర్యాప్తులో పోలీసులు, అధికారులు, ప్రత్యక్ష సాక్షులు సహా 125 మంది వాంగ్మూలాలను తీసుకుంది సిట్. అంతేకాకుండా ఘటనకు సంబంధించి ప్రచురించిన వార్తల కాపీలు, ఆన్-సైట్ వీడియోగ్రఫీ, ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌ లను పరిశీలించింది.

పిల్ లిస్టింగ్ చేసిన సుప్రీంకోర్టు
హాథ్రస్​ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ దాఖలైన పిల్​ను లిస్టింగ్ చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. తొక్కిసలాట ఘటనపై న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తాను జులై 8నే పిల్​పై లిస్టింగ్​కు ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే విచారణ చేపడతామని తెలిపారు.

ఉగ్రదాడిలో ముందు డ్రైవరే టార్గెట్- తప్పక ప్రతీకారం తీర్చుకుంటామన్న కేంద్రం! - Kathua Terror Attack

రష్యా సైనికులు వేసుకునే బూట్లు మనవే- ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? - Russian Army Shoes

Last Updated : Jul 9, 2024, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.