ETV Bharat / bharat

నేరుగా ఇంటికే అయోధ్య 'హనుమాన్​' ప్రసాదం- మనీ ఆర్డర్ చేస్తే చాలు!

Hanuman Garhi Prasad Postal Order : అయోధ్యలో ఉన్న హనుమాన్​గఢీ ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్లకు చేరుతుంది. ఈ-మనీ ఆర్డర్​ ద్వారా ప్రసాదాన్ని ప్రజలకు చేరవేయనుంది భారత తపాలా శాఖ.

Hanuman Garhi Prasad Postal Order
Hanuman Garhi Prasad Postal Order
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 10:40 AM IST

Updated : Feb 28, 2024, 11:43 AM IST

Hanuman Garhi Prasad Postal Order : అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అయితే వారంతా బాలరాముడి దర్శించుకునే ముందు హనుమాన్​గఢీలో ఉన్న హను​మాన్ ఆలయాన్ని దర్శించుకుని వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న రద్దీ కారణంగా కొంత మంది భక్తులకు హనుమాన్​ దర్శించుకోవడం సాధ్యమవ్వడం లేదట.

ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్​ గఢీ ఆలయ ప్రసాదాన్ని పోస్టల్​ ద్వారా ఇంటికి పంపే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంట్లోనే ఉండి ఆర్డర్​ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. తపాలా శాఖ ప్రసాదాన్ని ప్రజలకు చేరవేసేందుకు శ్రీ హనుమాన్​గఢీ సంకట్​మోచన్ సేనా ట్రస్ట్​తో ఒప్పందం చేసుకుంది. ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్టాఫీస్​కు వెళ్లి 'డిప్యూటీ పోస్ట్​మాస్టర్ అయోధ్య ధామ్ -224123​' పేరు మీద ఈ-మనీ ఆర్డర్​ తీయాలి. ఇవి రూ.251, రూ.551 ధరల్లో అందుబాటులో ఉంటాయి. పేరు, ఇంటి చిరునామాను ఇచ్చి ఆర్డర్​ చేయాలి.

Hanuman Garhi Prasad Postal Order
అయోధ్య హనుమాన్ ప్రసాదం

స్పీడ్​ పోస్ట్ ద్వారా ఇంటికే
ఆర్డర్​ చేశాక స్పీడ్​ పోస్ట్​ ద్వారా ప్రసాదాన్ని ఇంటికే పంపిస్తామని ప్రయాగ్​రాజ్, వారణాసి జోన్ పోస్ట్ మాస్టర్ కృష్ణ కుమార్ యాదవ్​ తెలిపారు. 'రూ.251 మనీ అర్డర్​కు లడ్డూలు, హనుమాన్​ చిత్రం, మహావీర్ గంధం, అయోధ్య దర్శన పుస్తకం ఉంటాయి. అదే రూ.551కు, రూ.251కు అందించే వస్తువలతోపాటు తులసీ మాల, హనుమాన్​ యంత్రం ఉంటాయి. స్పీడ్​ పోస్ట్​ వివరాలు భక్తుల తమ మొబైల్​కు ఎస్​ఎంఎస్​ ద్వారా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశాం. ఈ-మనీ ఆర్డర్​లో మీ పూర్తి చిరునామా, పిన్​కోడ్​ ఫోన్​ నంబర్​ తప్పనిసరిగా ఇవ్వాలి' అని కృష్ణ కుమార్ యాదవ్ తెలిపారు.

ఇప్పటికే భారత తపాలా శాఖ సహకారంతో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఆహ్వాన పత్రికలను పంపిణీ చేశారు. అంతకు మందు భక్తులకు గంగాజలాన్ని, రక్షణ బంధన్​ పండుగ కోసం సోదరులకు రాఖీలను చేరవేయడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. వీటితో పాటు కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలకు సాయం చేయటానికి తపాలా శాఖ ముందుకు వచ్చింది.

గ్రాండ్​గా రోడ్డు పెళ్లి- విందులో బిర్యానీ, స్వీట్లు- అందుకోసమేనట!

నెల రోజుల్లో అయోధ్య రామయ్యకు రూ.25కోట్ల విరాళాలు- 60లక్షల మంది దర్శనం

Last Updated : Feb 28, 2024, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.