ETV Bharat / bharat

వీల్​ఛైర్​లో 20 ఏళ్లుగా ప్రజాసేవ- అభాగ్యుల కోసం ఆశ్రమం- పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం - హరియాణా గుర్​వేందర్ సింగ్​ పద్మశ్రీ

Gurvinder Singh Padma Shree Award : వీల్​చైర్​కే పరిమితమై ఓ వ్యక్తి దాదాపు 20 ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్నారు. ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అందులో పేదలకు, రోగులకు చిన్న పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్శశ్రీ అవార్డును ప్రకటించింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gurvinder Singh Padma Shree Award
Gurvinder Singh Padma Shree Award
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 1:18 PM IST

Updated : Jan 27, 2024, 5:01 PM IST

వీల్​ఛైర్​లో 20 ఏళ్లుగా ప్రజాసేవ

Gurvinder Singh Padma Shree Award : వీల్​ఛైర్​కే పరిమితమైన ఓ వ్యక్తి దాదాపుగా రెండు దశాబ్దాలుగా ప్రజా సేవకు అంకితమయ్యారు. ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి వందలాది మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆయన సమాజ సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్శశ్రీ అవార్డును ప్రకటించింది. ఆయనే హరియాణాలోని సిర్సా జిల్లాకు చెందిన గుర్​వేందర్ సింగ్.

Gurvinder Singh Padma Shree Award
ఆశ్రమంలో ఉన్న వారి కోసం రోటీలు చేస్తున్న సింగ్

2012లో సిర్సా జిల్లాలో భాయ్ కన్హయా లాల్​ పేరుతో ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు గుర్​వేందర్ సింగ్. అందులో నిరుపేదలకు, వికలాంగులకు, రోగులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 400 మంది వరకు ఉన్నారు. వారికి బెడ్, కూలర్, టీవీలతో పాటు చిన్న పిల్లలు ఆడుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే తాను ఈ విధంగా సామాజిక సేవ చేయటం మాత్రం 2005 నుంచే మొదలు పెట్టినట్లు గుర్​వేందర్ సింగ్ చెప్పారు.

Gurvinder Singh Padma Shree Award
చిన్న పిల్లలను పలకరిస్తున్న గుర్​వేందర్ సింగ్

"2005 జనవరి 1 నుంచి సివిల్ ఆస్పత్రిలో రోగులకు పాలు పంపిణీ చేయటం ప్రారంభించాను. ఇంకా అలా సేవ చేస్తున్నానే ఉన్నాను. 1997 జూన్​ 7న నాకు ప్రమాదం జరిగింది. అప్పుడు నన్ను డీఎంసీ ఆస్పత్రిలో చేర్చారు. అదే సమయంలో ఓ ఎన్​జీఓ కొంత మంది రోగులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేయటం చూశాను. అప్పుడే నేను కూడా సేవ చేయలని నిర్ణయించున్నాను. ఆ ప్రేరణతోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాను."
--గుర్​వేందర్ సింగ్, సామాజిక కార్యకర్త

ఉచిత అంబులెన్స్ సేవలు
చిన్న పిల్లల కోసం బాల్​ గోపాల్ ధామ్​ పేరుతో చైల్డ్ కేర్​ ఇన్​స్టిట్యూట్​ని స్థాపించారు గుర్​వేందర్ సింగ్. అలానే ఉచిత అంబులెన్స్ సేవలను కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 6 వేల మందికిపైగా ప్రమాద బాధితులకు, గర్భణీలకు ఉచిత అంబులెన్స్ సేవలను అందించారు. సేవ చేయడానికి ఆశ్రమం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, మనసులో ఆ ఆలోచన ఉంటే సేవ చేయడానికి అనేక మార్గాలున్నాయని గుర్​వేందర్​ సింగ్ అంటున్నారు.

Gurvinder Singh Padma Shree Award
గుర్​వేందర్​ సింగ్ వద్ద ఆశ్రయం పొందుతున్న వారు
Gurvinder Singh Padma Shree Award
ఉచిత సేవల కోసం అంబులెన్స్

వెంకయ్యనాయుడు, చిరంజీవి సహా ఐదుగురికి పద్మవిభూషణ్ పురస్కారం

స్కూల్ కోసం భూమిని దానం చేసి, అందులోనే వంట మనిషిగా వృద్ధురాలు- ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక

Last Updated : Jan 27, 2024, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.