ETV Bharat / bharat

ఇకపై ఫ్లాట్‌ఫామ్‌ టికెట్స్, బ్యాటరీ కార్లకు నో GST!- కౌన్సిల్ మీటింగ్​లో మరిన్ని నిర్ణయాలు ఇవే!! - GST Council Meeting - GST COUNCIL MEETING

GST Council Meeting : ప్రయాణికులకు రైల్వేలు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థికమంత్రి శాఖ నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ పాలకమండలి సమావేశం తీర్మానించింది. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నామని నిర్మల తెలిపారు.

GST Council Meeting
GST Council Meeting (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 8:04 PM IST

Updated : Jun 22, 2024, 8:41 PM IST

GST Council Meeting : కేంద్ర ఆర్థికమంత్రి శాఖ నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ పాలకమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రయాణికులకు రైల్వేలు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని తీర్మానించింది. అందులో రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ టికెట్లు, ప్రయాణికులు బసచేసే గదులు, విశ్రాంతి గదులు, లగేజీ సేవలు, బ్యాటరీ ద్వారా నడిచే కార్ల సేవలు ఉన్నాయి. విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ.20000 వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలకమండలి సిఫార్సు చేసింది.

మరిన్ని నిర్ణయాలు!

  • అన్ని రకాల సోలార్‌ కుక్కర్‌లపై 12 శాతం జీఎస్టీ.
  • రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫారం టికెట్లు, వెయిటింగ్‌ రూమ్‌, క్లాక్‌ రూమ్‌, బ్యాటరీ కారు సేవలపై జీఎస్టీ తొలగింపు.
  • స్టీల్‌, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసే పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ.
  • అన్ని కార్టన్‌ బాక్సులపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు. తద్వారా యాపిల్‌, ఇతర పండ్ల వ్యాపారులకు మేలు.
  • స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు.

మరోవైపు, పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ట్రాలు ఐక్యం కావాలని సూచించారు. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తర్వాత దిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు.

"జీఎస్టీ గత సమావేశం అక్టోబర్‌లో జరిగింది. అజెండా విషయాలపై మరోసారి సమావేశం అవుతాం. ఎన్నికల కోడ్‌ కారణంగా చాలా రోజులుగా జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ జరగలేదు. జీఎస్టీ మండలిలో అనేక విషయాలు చర్చించాం. ఆగస్టు చివరి వారం మళ్లీ సమావేశం అవుతాం. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం. జీఎస్టీ సెక్షన్‌ 73 కింద డిమాండ్‌ నోటీసులు ఇచ్చాం. వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టేవారికి మినహాయింపులు ఇస్తాం. జీఎస్టీపై ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచాం. చిన్న వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలున్నాయి. జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతిపాదించింది. జీఎస్టీ కట్టేందుకు చివరితేదీ గడువు పొడిగించాం. ఈ నిర్ణయాలతో వర్తకులు, ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరుతుంది. ఇన్‌పుట్ క్రెడిట్‌ ట్యాక్స్‌ విషయంలో మార్పులు చేయాలని నిర్ణయించాం. అక్రమాలు జరగకుండా ఆధార్‌ అథెంటిఫికేషన్‌ తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నాం" అని ఆర్థిక మంత్రి తెలిపారు.

కేంద్రం చెల్లిస్తుందని నిర్మల హామీ
మరోవైపు, రాష్ట్రాలు అభివృద్ధిని కొనసాగించడానికి పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహార బకాయిలను సమయానికి కేంద్రం చెల్లిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. రాష్ట్రాల ఆర్థికమంత్రులతో ఆమె బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించారు. సూచించిన సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 50 ఏళ్లు వడ్డీలేని రుణాలు అందించే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Last Updated : Jun 22, 2024, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.