ETV Bharat / bharat

అలర్ట్ : గ్యాస్​ సిలిండర్​ గురించి ఈ విషయాలు తెలుసా? - ప్రమాదం ఎప్పుడైనా ముంచుకు రావొచ్చు! - gas cylinder safety tips in telugu - GAS CYLINDER SAFETY TIPS IN TELUGU

Gas Cylinder: గ్యాస్ స్టౌ మీద వంట చేయడం అందరికీ వచ్చు. కానీ.. గ్యాస్ సిలిండర్​​ వినియోగం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. వంట చేసేటప్పుడు గ్యాస్​ సిలిండర్​ విషయంలో ఏ విషయాలు గుర్తించుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Gas Cylinder Safety  Tips
Gas Cylinder Safety Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 2, 2024, 8:33 AM IST

Gas Cylinder Safety Tips: వంటగ్యాస్ మనకు చేస్తున్న మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్యాస్​ లేదంటే ప్రపంచమే స్తంభించిపోతుందంటే అతిశయోక్తి కాదు. మనుషులకు అంతగా ఉపయోగపడుతున్న గ్యాస్ సిలిండర్.. తేడా వస్తే ప్రాణాలు తీసేస్తుంది. అందుకే.. దీనిని వాడేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలని, ఎలా వాడాలో తెలిసి ఉండాలని నిపుణులు అంటున్నారు. మరి.. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు: సిలిండర్​ను పూర్తిగా సేఫ్​ అండ్​ సెక్యూర్​ అనుకున్న ఏజెన్సీ దగ్గర మాత్రమే తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అలాగే సిలిండర్ డెలివరీ అయినప్పుడు కంపెనీ సీల్, సిలిండర్ సరిగ్గా సీల్ చేశారో లేదోనని గుర్తుంచుకోవాలి. సీల్ చిరిగిపోతే దానిని వాడొద్దని సలహా ఇస్తున్నారు. అలాగే సిలిండర్​ బరువు కూడా చెక్​ చేసుకోవాలి. సిలిండర్ డేట్‌ని చూడాలి. A అంటే జనవరి నుంచి మార్చి వరకూ, B అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకూ , C జులై నుంచి సెప్టెంబర్ వరకూ, D అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ అని అర్థం. ఉదాహరణకు D-24 అని ఉంటే ఆ సిలిండర్​ 2024 ఏడాదిలో డిసెంబర్​ వరకు వినియోగించవచ్చు అని అర్థం. ఈ డేట్ ఎక్స్‌పైర్ అయితే ఆ సిలిండర్ వాడొద్దని సలహా ఇస్తున్నారు.

మరకలు పడి గ్యాస్​ స్టవ్ జిడ్డుగా మారిందా? - ఈ టిప్స్​తో కొత్తదానిలా తళతళా మెరిసిపోద్ది! - Gas Stove Top Cleaning Tips

సిలిండర్ నిల్వ చేసేటప్పుడు: సిలిండర్‌ని ఎప్పుడు కూడా పడుకోబెట్టొద్దని.. నిలబెట్టి ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే సిలిండర్‌ను వేడి, తేమ లేదా సూర్యరశ్మి నుంచి దూరంగా ఉంచాలని చెబుతున్నారు. సిలిండర్‌ను పిల్లలకు అందుబాటులో ఉంచవద్దు. సంవత్సరానికి ఓ సారి రెగ్యులేటర్, గ్యాస్​ పైప్​ను మార్చాలి. ఇవి కేవలం ISI సర్టిఫైడ్‌వి మాత్రమే వాడాలి.

సిలిండర్ ఉపయోగించేటప్పుడు: సిలిండర్ రెగ్యులేటర్‌ను సరిగ్గా అమర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వాల్వ్‌ను తెరవడానికి ముందు గ్యాస్ లీక్ లేదా వాసన వస్తుందో రావడంలేదో తనిఖీ చేయాలి.

వంట చేసేటప్పుడు: గ్యాస్‌ స్టౌ మీద వంట చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు అంటున్నారు. మంచి వెంటిలేషన్ ఉండాలని.. తలుపు, కిటికీలు తెరిచి ఉంచాలని.. మండే పదార్థాలు సిలిండర్​ దగ్గర ఉంచొద్దని చెబుతున్నారు. అలాగే సిలిండర్ వాడనప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేయాలని సూచిస్తున్నారు.

గ్యాస్​ లీక్​ అయినప్పుడు: గ్యాస్​ లీక్​ అయినట్లు వాసన వస్తే రెగ్యులేటర్ బర్నర్స్ నాబ్స్ మూసివేయాలని సలహా ఇస్తున్నారు. వెంటిలేషన్ కోసం తలుపులు, కిటికీలు ఓపెన్​ చేయాలని.. లైట్స్ స్విచ్ఛాఫ్​ చేయాలని సూచిస్తున్నారు.

మీ కిచెన్​లో పొగ ఎక్కువగా వస్తుందా? - ఈ టిప్స్ పాటించారంటే ఆ సమస్య ఉండదు - పైగా గ్యాస్ ఆదా! - Kitchen Pollution Reduce Tips

గ్యాస్​ స్టవ్​ కు సింక్​ దూరంగానే ఉందా? అలా జరగాలంటే దానిమ్మ మొక్క పెంచితే చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.