ETV Bharat / bharat

పోలీసుల పహారాలో గ్యాంగ్‌స్టర్ల వివాహం- మెటల్‌ డిటెక్టర్లు, డ్రోన్లతో సెక్యూరిటీ- పెళ్లి కోసం 6గంటల పెరోల్ - gangster sandeep wedding

Gangster Sandeep Wedding : వారిద్దరూ కరుడుగట్టిన నేరాలు చేసిన గ్యాంగ్‌స్టర్లు. పెళ్లి చేసుకోవాలని భావించిన వారిద్దరికీ పోలీసులే కల్యాణ మండపాన్ని సిద్ధం చేశారు. భద్రతకు ఏ మాత్రం లోటు లేకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లను రంగంలోకి దించారు. తామే అతిథులుగా వివాహాన్ని జరిపించారు. ఆ కథ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gangster Sandeep Wedding
Gangster Sandeep Wedding
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 10:32 PM IST

Gangster Sandeep Wedding : కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్యాంగ్‌స్టర్ల జంట వివాహం చేసుకుంది. హరియాణాకు చెందిన సందీప్‌ అలియాస్‌ కాలా జథేడీ, రాజస్థాన్‌కు చెందిన అనురాధా చౌధరి అలియాస్‌ మేడమ్‌ మింజ్‌ పెళ్లి, దిల్లీలోని ద్వారకా సెక్టార్‌-3లో ఉన్న సంతోష్‌ గార్డెన్‌లో జరిగింది. ఇందుకోసం ఆ పరిసర ప్రాంతమంతా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వేడుక దృశ్యాలు తాజాగా వైరల్ అవుతున్నాయి.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు- 250 మంది పోలీసుల పహారా
సందీప్‌ గతంలో ఓసారి హరియాణా పోలీసుల నుంచి తప్పించుకోవడమే కాకుండా బలగాలపై దాడి చేయించాడు. దీంతో మరోసారి అటువంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. హోటల్‌ ప్రవేశమార్గాల్లో మెటల్‌ డిటెక్టర్లు మొదలు, లోనికి వచ్చే వారికి బార్‌కోడ్‌ బ్యాండ్లు, వాహనాలకు ప్రవేశ పాసులు మంజూరు వంటి చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అక్కడి కార్యకలాపాలను పర్యవేక్షించారు. 250 మందికి పైగా దిల్లీ పోలీసుల పహారా మధ్య వారి పెళ్లి జరిగింది. సందీప్‌ అలియాస్‌ కాలా జథేడీ తరఫు న్యాయవాది 51 వేల రూపాయలు చెల్లించి కళ్యాణ మండపాన్ని బుక్‌ చేయించారు.

పెళ్లి కోసం 6గంటల పెరోల్
అనురాధ అలియాస్‌ మేడమ్ మింజ్ అలియాస్ రివాల్వర్‌ రాణి, సందీప్‌ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారిద్దరూ పలు కేసుల్లో నిందితులు. సందీప్‌ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కు అత్యంత సన్నిహితుడు. అతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి డజనుకు పైగా కేసులున్నాయి. అనురాధ సైతం గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్‌ సింగ్ వద్ద పని చేసింది. మనీ లాండరింగ్, కిడ్నాప్‌, బెదిరింపులు వంటి పలు కేసుల్ని ఎదుర్కొంటోంది. 2020లో పరారైన వీరు పోలీసుల్ని తప్పించుకొని పలు రాష్ట్రాలకు మకాం మార్చారు. చివరకు 2021 జులైలో పోలీసులకు చిక్కారు. కొంతకాలం తర్వాత ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. ఈ పెళ్లి కోసం కోర్టు అతడికి ఆరు గంటలపాటు పెరోల్‌ను మంజూరు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.