ETV Bharat / bharat

అలర్ట్​- దేశవ్యాప్తంగా సోమవారం వైద్య సేవలు నిలిపివేత! - Doctors Strike In India

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 2:36 PM IST

Updated : Aug 11, 2024, 3:05 PM IST

Doctors Strike In India : దేశవ్యాప్తంగా వైద్యశాలల్లో సోమవారం కొన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఫోర్డా) ప్రకటించింది.

Doctors Strike In India
Doctors Strike In India (ANI)

Doctors Strike In India : బంగాల్​ కోల్‌కతాలోని ఆర్​జీ కార్‌ మెడికల్‌ కళాశాలలో జూనియర్‌ వైద్యురాలి దారుణ హత్యపై రెసిడెంట్‌ డాక్టర్లు తీవ్రంగా స్పందించారు. సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫోర్డా (ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌) తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖను పంపించింది. ఆర్​జీ కార్‌ మెడికల్‌ కళాశాల వైద్యులకు మద్దతుగా ఈ చర్యను చేపట్టినట్లు ప్రకటించింది.

24 గంటల డెడ్‌లైన్‌ కూడా!
అయితే, జూనియర్‌ వైద్యురాలి దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోర్డా కేంద్రాన్ని శనివారం డిమాండ్‌ చేసింది. అందుకు గాను 24 గంటల డెడ్‌లైన్‌ కూడా ఇచ్చింది. చర్యలు తీసుకోకుంటే ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. దౌర్జన్యాలకు గురైన తమ వారికి న్యాయం జరగాలని పేర్కొంది. ఈ విషయానికి రాజకీయ రంగు పులిమి ప్రతికూల కోణంలో చూడొద్దని అభ్యర్థించింది. అన్ని వర్గాలు వైద్యులకు మద్దతు ఇవ్వాలని కోరింది.

అసలేం జరిగిందంటే?
కోల్‌కతాలో ఓ జూనియర్‌ వైద్యురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు కూడా ప్రాథమిక శవపరీక్షలో నిర్ధరణ అయింది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్‌ వైద్యురాలు, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి సెమినార్‌ హాలులో అర్ధ నగ్న స్థితిలో శవమై కనిపించారు.

ఆమె మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు శవపరీక్షలో తేలింది. శరీరంపై వివిధ చోట్ల గాయాలు కూడా కనిపించాయి. ఆమెపై హత్యాచారం జరిగినట్లు శవ పరీక్ష ప్రాథమిక నివేదిక తేల్చింది. మరోవైపు, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇప్పటికే ఓ పౌర వాలంటీర్‌ను అరెస్టు చేశారు. హత్య జరిగిన స్థలంలో దొరికన ఓ బ్లూటూత్‌ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని హంతకుడిగా నిర్ధరించారు. అయితే ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఆస్పత్రిలో ఉద్యోగుల రక్షణపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది.

Last Updated : Aug 11, 2024, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.