ETV Bharat / bharat

గిరిజన యువకుడి అరుదైన ఘనత- అక్కడ నీట్​ క్వాలిఫై అయిన తొలి వ్యక్తిగా రికార్డ్​! - First Bonda Tribe To Crack NEET - FIRST BONDA TRIBE TO CRACK NEET

First Bonda Tribe To Crack NEET : కలలు అందరూ కంటారు. కానీ వాటిని కొందరు మాత్రమే నిజం చేసుకోగలుగుతారు. ఆ కోవకు చెందిన ఓ గిరిజన యువకుడు- సామాజిక, ఆర్థిక అడ్డంకులన్నీ దాటుకుని నీట్​ పరీక్ష క్వాలిఫై అయ్యాడు. తన తెగ నుంచి ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఆ యువకుడెవరు? అతడి విజయ గాథ ఏంటో చూద్దాం.

First Bonda Tribe To Crack NEET
First Bonda Tribe To Crack NEET (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 2:27 PM IST

Updated : Aug 30, 2024, 4:32 PM IST

గిరిజన యువకుడి అరుదైన ఘనత- అక్కడ నీట్​ క్వాలిఫై అయిన తొలి వ్యక్తిగా రికార్డ్​! (ETV Bharat)

First Bonda Tribe To Crack NEET : కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఒడిశా మల్కన్​గిరి​ జిల్లాకు చెందిన ఓ గిరిజన యువకుడు. సామాజిక, ఆర్థిక అడ్డంకులన్నీ దాటుకుని వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. స్థానికంగా ఉన్న బోండా గిరిజన తెగలో నీట్​కు​ అర్హత​ సాధించిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

పైన వీడియోలో కనిపిస్తున్న యువకుడి పేరు మంగళ ముడులి. ముడిలిపాద పంచాయతీలోని బాబ్​దెల్​ అనే మారుమూల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా రాష్ట్ర ఎస్​సీ, ఎస్​టీ డిపార్ట్​మెంట్​ నిర్వహిస్తున్న SSD ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం SSD సీనియర్​ సెకండరీ హైస్కూల్​లో ఇంటర్​ పూర్తి చేశాడు. అనంతరం ఇటీవల జరిగిన నీట్​ పరీక్షలో ఉత్తీర్ణుడై, బ్రహ్మపురలోని MKCG మెడికల్​ కాలేజీలో ప్రవేశం పొందాడు. తన తెగలో ఇతరులు ఊహించడానికైనా సాహసించలేనిదాన్ని ముడులి సాధించి చూపించాడు.

First Bonda Tribe To Crack NEET
చదువుకుంటున్న మంగళ ముడులి (ETV Bharat)

గ్రామస్థులు, ఉపాధ్యాయుల అండతో
ఈ గిరిజన యువకుడికి విజయం అంత సులువుగా రాలేదు. కనీస సౌకర్యాలు లేని కొండల ప్రాంతంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాడు. నీట్​కు ప్రిపేర్​ అవుతున్న సమయంలో మొబైల్​ నెట్​వర్క్​ లేక కొండలపైకి వెళ్లి చదువుకున్నాడు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు ముడిలికి అండగా నిలిచారు. ముఖ్యంగా డాక్టర్​ కావాలన్న ముడులి తపనను స్థానిక ప్రభుత్వ పాఠశాల సైన్స్​ టీచర్​ ఉత్కల్​ కేసరి గుర్తించారు. అతడిని బాలేశ్వర్​లోని నీట్ కోచింగ్​ సెంటర్​లో చేర్పించారు.

First Bonda Tribe To Crack NEET
మంగళ ముడులి (ETV Bharat)

'నా ప్రజలకు సేవ చేస్తా!'
తన ప్రాంతంలో సరైన వైద్య సౌకర్యాలు లేక వ్యాధుల బారిన వారిని చూశానని, దాంతో బాల్యంలోనే డాక్టర్​ కావాలనుకున్నానని ముడులి తెలిపాడు. తన కలను సాకారం చేసుకోవడానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇప్పటి నుంచి కష్టపడి చదివి తన కలను సాకారం చేసుకుంటానని ముడులి అన్నాడు. తమ ప్రాంతంలో ఓ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరిన ముడులి, భవిష్యత్తులో అక్కడే ఉండి తన ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.

First Bonda Tribe To Crack NEET
మంగళ ముడులి కుటుంబ సభ్యులు (ETV Bharat)

గిరిజనుడి విజయగాథ.. తినడానికి తిండి లేని స్థాయి నుంచి అమెరికాలో టాప్ సైంటిస్ట్​గా..

సకల సౌకర్యాల 'సైకిల్​ క్యాంపర్​'.. బీటెక్​ విద్యార్థి ఘనత

Last Updated : Aug 30, 2024, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.