ETV Bharat / bharat

IIT అడ్మిషన్ న్యూ రూల్స్‌ - ఇకపై SC, STలకు అడ్మిషన్‌ ఫీజులో రాయితీ - కటాఫ్ మార్కుల్లో రిలాక్సేషన్‌

ఐఐటీల్లో ఎస్​సీ, ఎస్​టీలకు ఫీజులో 50 శాతం మినహాయింపు - ట్యూషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు- ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు సాధించిన ఎస్​సీ, ఎస్​టీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

Madra IIT
Madra IIT (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 7:18 PM IST

IIT Fee Concession : దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీ) అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించడానికి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులు లాంటి రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజులో రాయితీతో పాటు కట్‌-ఆఫ్ మార్కుల్లో సడలింపులు(కటాఫ్ మార్కులు తగ్గింపు) ఇవ్వాలని నిర్ణయించింది.

"జేఈఈ అడ్మిషన్లు విషయంలో, ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులకు దరఖాస్తు దశ నుంచి ఫీజు రాయితీలు, ఫీజు మినహాయింపులు ఉంటాయి. అంటే ఈ కేటగిరీ అభ్యర్థులు పరీక్ష ఫీజులో సగం చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు పొందడానికి వీలుగా కటాఫ్ మార్కుల్లో సడలింపులు ఇస్తాము."
- వి.కామకోటి, ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌

వారికి ప్రత్యేక శిక్షణ
"ఐఐటీలు అందించే నాణ్యమైన విద్య ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ప్రయోజనం పొందాలి. ఇందుకోసం(జేఈఈ) ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు సాధించిన ఎస్​సీ, ఎస్​టీ విద్యార్థులకు 'ప్రిపరేటరీ కోర్స్‌' ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తాం. ఈ ప్రిపరేటరీ కోర్స్ పూర్తయిన తరువాత వారు నేరుగా ఐఐటీల్లో చేరేందుకు వీలు కల్పిస్తాం" అని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌ వి.కామకోటి చెప్పారు.

'ఈ ఏడాది నుంచి జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2024 బృందం దేశవ్యాప్తంగా సిటిజన్ సర్వీస్‌ సెంటర్లను ప్రారంభించింది. వీటి ద్వారా ఛాయిస్‌లను ఎంపిక చేసుకునే విషయంలో, ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించే విషయంలో యువతకు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల యువతీయువకులకు సాయం చేస్తారు. అలాగే ఇకపై అభ్యర్థులకు వచ్చే సందేహాలను తీర్చడానికి బహుళ భాషల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశాం. అంతేకాదు చివరి నిమిషంలో సాంకేతిక లోపాల వల్ల ఫీజులు చెల్లించలేకపోయిన అభ్యర్థుల కోసం, ఈ సంవత్సరం నుంచి గడవు తేదీ ముగిసిన తరువాత, 'రీకన్సిలియేషన్‌ డే' ప్రవేశపెట్టాం. దీని వల్ల ఆఖరి నిమిషంలో ఫీజు చెల్లించలేనివారు, మళ్లీ రుసుము చెల్లించడానికి వీలు ఏర్పడుతుంది' అని కామకోటి తెలిపారు.

50% రుసుము చెల్లిస్తే చాలు!
"ఐఐటీల్లో చేరే విషయంలో అభ్యర్థులు నిజంగా ఆసక్తి కలిగి ఉన్నారా? లేదా? అనేది నిర్ధరించుకునేందుకు 'యాక్సెప్టెన్స్‌ ఫీజు' చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ విద్యార్థులు పూర్తి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులు మాత్రం యాక్సెప్టెన్సీ ఫీజులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ఈ యాక్సెప్టెన్సీ ఫీజు ఉండేది కాదు. దీని వల్ల చాలా మంది అడ్మిషన్‌ సమయంలో వచ్చేవారు. కానీ తరువాత వాళ్లు తరగతులకు హాజరయ్యేవారు కాదు. దీని వల్ల చాలా సీట్లు ఖాళీగా ఉండిపోయేవి. అదే సమయంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు సీటు రాక ఇబ్బందిపడేవారు" అని కామకోటి తెలిపారు.

వారి సీట్లు వారికే!
'ఐఐటీ సీట్ల కేటాయింపు ప్రక్రియలో ఎస్​సీ, ఎస్​టీలకు రిజర్వ్ చేసిన సీట్లు వారికి మాత్రమే కేటాయిస్తారు. ఒక వేళ వారికి కేటాయించిన సీట్లు ఖాళీగా ఉండిపోతే, ఆ సీట్లను ఇతర కేటగిరీ అభ్యర్థులకు కేటాయించడం జరగదని' కామకోటి స్పష్టం చేశారు.

విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం రూ.1 లక్ష కంటే తక్కువగా ఉంటే, కేటగిరీతో సంబంధం లేకుండా మొత్తం ట్యూషన్ ఫీజు మినహాయింపు ఇస్తామని ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ వి.కామకోటి తెలిపారు. దేశంలోని మొత్తం 23 ఐఐటీల్లోనూ ఇది అమలు అవుతుందని పేర్కొన్నారు. ఇక ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగులకు అయితే వారి తల్లిదండ్రుల ఆదాయంతో సంబంధం లేకుండా ట్యూషన్ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం కలిగి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు ట్యూషన్‌ ఫీజులో మూడింట, రెండు వంతుల వరకు మినహాయింపు ఉంటుందని కామకోటి చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.