Farmers Protest India 2024 : దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని రైతు సంఘ నాయకుడు సర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు. శంబు, కన్నౌరీ సరిహద్దుల్లో తాము చేస్తున్న ఆందోళనలు 13వరోజుకు చేరుకున్నాయని తెలిపారు. ఆదివారం ప్రపంచ వాణిజ్య సంస్థ-డబ్ల్యూటీఓ విషయంపై చర్చిస్తామని, సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
వ్యవసాయ రంగాన్ని డబ్ల్యూటీఓ నుంచి తీసేయాలని తాము ఇది వరకే డిమాండ్ చేశామని సర్వాన్ సింగ్ పంధేర్ తెలిపారు. సోమవారం (ఫిబ్రవరి 26) తర్వాత కార్యాచరణను పంధేర్ ప్రకటించారు. సోమవారం డబ్ల్యూటీఓ, కార్పొరేట్ సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 20 అడుగుల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 27న కిసాన్ మజ్దూర్ మోర్చా, ఎస్కేఎమ్ సంస్థలు దేశవ్యాప్తంగా తమ రైతు నాయకులతో సమావేశం నిర్వహిస్తామని, ఆ తర్వాత రోజు చర్చలు జరపుతాయని వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 29న చలో దిల్లీపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.
'మా డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమం ఆగదు'
ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని రైతుల నేత సర్వన్‌సింగ్ పంధేర్ తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి తామేమీ కలవరం చెందడం లేదని, అది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆందోళన కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదిస్తే ఉద్యమంపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రోహ్‌తక్‌లో గాయపడిన పంజాబ్ రైతును తమకు అప్పగించాలని హరియాణా ప్రభుత్వాన్ని కోరిన మీదట శనివారం ఆయన్ని చండీగఢ్‌లోని పీజీఐఎంఆర్ ఆసుపత్రికి తరించినట్లు పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్‌సింగ్ తెలిపారు. మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్‌ఎంఎస్‌లపై విధించిన నిషేధాన్ని మొత్తం ఏడు జిల్లాలకు వర్తింపజేస్తున్నారు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ సహా వివిధ అంశాలపై ఉద్యమిస్తున్న రైతులు ఫిబ్రవరి 13న దిల్లీ చలో పేరిట బయల్దేరారు. వారిని భద్రత బలగాలు అడ్డగించాయి. దీంతో అక్కడి ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. కేంద్రంతో చర్చలు జరిగినా సఫలం కాలేదు. దీంతో పంజాబ్-హరియాణా సరిహద్దు వద్దే రైతులు మకాం వేశారు.
-
VIDEO | Farmers’ protest: Tea being prepared at Shambhu border.
— Press Trust of India (@PTI_News) February 25, 2024
The farmers' ‘Delhi Chalo’ march is currently on hold till February 29. pic.twitter.com/BMIEcYKXyM
కేంద్రంతో చర్చలకు రైతులు 'నో'- శుక్రవారం 'బ్లాక్ డే'గా పాటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి
'దిల్లీ చలో'కు రెండు రోజులు బ్రేక్- బుల్లెట్ తగిలి ఓ యువరైతు మృతి- యుద్ధ భూమిలా సరిహద్దు!