ETV Bharat / bharat

కొత్త ఎంపీల లైఫ్ ఛేంజ్! బంగ్లా, టోల్ ఫ్రీ ట్రావెల్ సహా ఎన్నో సౌకర్యాలు!! - New MPs Facilities

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 4:06 PM IST

Facilities To New MPs In India : 18వ లోక్‌సభలో 280మంది కొత్త ఎంపీలు అడుగుపెట్టారు. మరి దేశంలోని వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన వారికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాలేంటి? జీతమెంత? వంటి పలు విషయాల గురించి తెలుసుకుందాం.

Facilities To New MPs In India
Facilities To New MPs In India (ANI, Getty Images)

Facilities To New MPs In India : 18వ లోక్​సభలో మెజార్టీ శాతం కొత్త ఎంపీలే ఉన్నారు. పార్లమెంట్​లో ఈసారి 280 మంది తొలిసారి ఎంపీగా ఎన్నికైన సభ్యులు కాలు మోపారు. అంటే మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 52 శాతం మంది కొత్త వారే కావడం విశేషం. కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన వారిలో ఉత్తర్​ప్రదేశ్‌ నుంచి అత్యధికంగా 45 మంది ఎంపీలు ఉన్నారు. మహారాష్ట్ర నుంచి తర్వాత స్థానంలో 33 మంది ఉన్నారు. అయితే వారందరికీ కొన్ని ప్రత్యేక సదుపాయాలతోపాటు ఉచిత సౌకర్యాలను కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. జీతం, ప్రయాణ భత్యాలు, వైద్య సదుపాయాలు, బంగ్లా, ఫోన్ సౌకర్యం, పెన్షన్ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • 2022 మే 11 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఒక్కొక్క ఎంపీకి నెలకు జీతంగా రూ.లక్ష అందుతుంది. అదనంగా, సమావేశాల కోసం అలవెన్సుల కింద రోజుకు రూ.2000 ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.
  • పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు, ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది.
  • 15 రోజుల కంటే ఎక్కువ రోజులు పార్లమెంట్‌ సమావేశాలకు సెలవు పెట్టకుండా వచ్చిన వారు మాత్రమే ప్రయాణ రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు.
  • ఎంపీలకు ఫస్ట్ క్లాస్ రైల్వే కోచ్‌లలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది సర్కార్.
  • అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌ ఎంపీలకు స్టీమర్ సౌకర్యం కల్పిస్తుంది.
  • అయితే కుటుంబ సభ్యులతో ప్రయాణించే విషయంలో కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.
  • పార్లమెంట్ సమావేశాలకు వచ్చి వెళ్లేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది ప్రభుత్వం.
  • ప్రతి ఎంపీకి ఆఫీస్ అలవెన్స్ కింద రూ.20,000, స్టేషనరీకి రూ. 4,000, పోస్టల్ ఛార్జ్​ కోసం రూ.2000 ఇస్తుంది.
  • సిబ్బంది జీతం కోసం కూడా కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది.
  • ప్రతి పార్లమెంట్ సభ్యుడికి ఉచిత రెండు ఫాస్ట్ ట్యాగ్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒకటి దిల్లీలోని వాహనానికి, మరొకటి వారి సొంత నియోజకవర్గానికి చెందిన వాహనానికి కేటాయిస్తుంది.
  • పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రతి సభ్యుడికి నెల వారీ పెన్షన్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల ఈ మొత్తాన్ని రూ.22 వేలకు పెంచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.