Bibek Debroy Passed Away : ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ (69) కన్నుమూశారు. ప్రధాని ఆర్థిక సలహామండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిబేక్ శుక్రవారం హఠాత్తుగా మరణించారు. దెబ్రాయ్ మృతికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ప్రముఖ ప్రజా మేధావిని దేశం కోల్పోయింది
"డాక్టర్ బిబేక్ దెబ్రాయ్ మరణంతో దేశం విధాన రూపకల్పన నుంచి గొప్ప గ్రంథాలను అనువదించడం వరకు విభిన్న రంగాలను సుసంపన్నం చేసిన ప్రముఖ ప్రజా మేధావిని కోల్పోయింది. సామాజిక, సాంస్కృతిక ఆర్థిక విషయాల్లో ఆయన అవగాహన అసాధారణమైనది. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు
In the demise of Dr. Bibek Debroy the country has lost an eminent public intellectual who enriched diverse fields, from policy making to translating our great scriptures. His understanding of India’s social, cultural and economic landscape was exceptional. For his extraordinary…
— President of India (@rashtrapatibhvn) November 1, 2024
ప్రజా విధానానికి ఆయన చేసిన కృషి అతీతం!
"డా.దెబ్రాయ్ నాకు చాలాకాలంగా తెలుసు. ఆర్థికశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత ఇలా ఎన్నో విభిన్నరంగాల్లో ఆయనకు ఎంతో ప్రావీణ్యం ఉంది. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషి అతీతం. ప్రాచీన గ్రంథాలపై పనిచేయడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. యువత కోసం వాటిని అందుబాటులోకి తెచ్చారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి" అని మోదీ పేర్కొన్నారు.
Dr. Bibek Debroy Ji was a towering scholar, well-versed in diverse domains like economics, history, culture, politics, spirituality and more. Through his works, he left an indelible mark on India’s intellectual landscape. Beyond his contributions to public policy, he enjoyed… pic.twitter.com/E3DETgajLr
— Narendra Modi (@narendramodi) November 1, 2024
భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో సేవ
దెబ్రాయ్ మృతికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విచారం వ్యక్తంచేశారు. చక్కటి సైద్ధాంతిక, అనుభావిక ఆర్థికవేత్త అయిన దేబ్రాయ్, భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో సేవ చేశారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.
దెబ్రాయ్ గతంలో కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత పుణెలోని గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్‌లో ఛాన్సలర్‌గా, దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత పలు ఇన్‌స్టిట్యూట్‌లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2019 వరకు దెబ్రాయ్ నీతి అయోగ్‌లో సభ్యుడిగా ఉన్నారు. పలు పుస్తకాలు, కథనాలు రచించడంతో పాటు పలు వార్తాసంస్థలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఆర్థికశాస్త్రంలో దెబ్రాయ్ చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.