ETV Bharat / bharat

ఎన్నికల్లో 'స్ట్రాటజిస్టుల' ట్రెండ్- పార్టీల గెలుపే టార్గెట్- నేతలు కీలుబొమ్మలుగా వ్యూహకర్తల చదరంగం! - Lok Sabha Elections 2024

Elections Poll Strategist India : ఎన్నికల వ్యూహం అదో కొరకరాని కొయ్య. పెద్దపెద్ద విశ్లేషకులుగా చెప్పుకునే వారికి కూడా అంతుచిక్కని లెక్క. ప్రజల నాడిని అర్థం చేసుకోవడం అధునాతన సైన్సుకు సైతం అర్థంకాని ఆర్ట్.పోల్‌ మేనేజ్‌మెంట్‌లో చక్రం తిప్పిన పార్టీదే ప్రభుత్వం. నాయకుడికే పదవి. ఒకప్పుడు నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి పల్స్‌ పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు కాలం మారింది. సోషల్‌ మీడియా ప్రపంచాన్ని శాసిస్తున్న వేళ అంతర్జాలం వేదికగా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ప్రజల ఆలోచనల్ని మార్చేసే మాంత్రికులు రాజకీయ తెరపైకి వచ్చేశారు. తమను ఎంచుకున్న పార్టీని, నేతను గెలిపించేందుకు ప్రజల నాడి పసిగట్టడం సహా వారిని పూర్తిగా తమ దారికి తెచ్చుకునే విదూషకుల కాలం ప్రస్తుతం నడుస్తోంది.

Elections Poll Strategist India
Elections Poll Strategist India
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 10:24 AM IST

Updated : Apr 18, 2024, 10:36 AM IST

Elections Poll Strategist India : రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలు కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు ప్రాచుర్యంలోకి రాకముందు ఆయా పార్టీల అగ్రనేతలు రాష్ట్ర, దేశవ్యాప్త పర్యటనలు చేపట్టి ఓటర్ల నాడిని పసిగట్టేవారు. ప్రాంతాలవారీగా వ్యూహాలు రచించుకొని ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలు సహా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హామీలిచ్చేవారు. గతంలో ఎల్​కే అడ్వాణీ వంటి నేతలు దేశవ్యాప్త యాత్రలు చేపడితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదట వైెఎస్​ రాజశేఖర్ రేడ్డి, తర్వాత చంద్రబాబు పాదయాత్రల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి ఎన్నికల్లో విజయాలను అందుకున్నారు.

కార్యర్తలకు దిశానిర్దేశం
2014నాటి సార్వత్రిక ఎన్నికల సమయానికి సామాజిక మాధ్యమాల ప్రభావం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్తలు కూడా రంగ ప్రవేశం చేశారు. తమను నియమించుకున్న పార్టీల గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలకు పదును పెట్టి వాటిని పక్కాగా అమలు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నిర్దేశించుకున్న ప్రాంతాల్లో ప్రజల పల్స్‌ పట్టేందుకు సర్వేలు చేయడం, వారి సమస్యలు తెలుసుకోవడం, ఎన్నికల్లో ప్రభావితం చేసే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతం చేస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో సలహాలు, సూచనలు ఇవ్వడం, అవసరమైతే ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిలించేందుకు ఎత్తుగడలు వేయడం వ్యూహకర్తల కార్యకలాపాలుగా మారాయి. నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలవారీగా ఓటర్ల సమాచారాన్ని సేకరించి పార్టీలకు అందించడం, ప్రచారానికి అవసరమైన కంటెంట్‌ను రూపొందించడం, వాటిని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు,కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. చదరంగం క్రీడాకారుల మాదిరిగా రాజకీయ నేతలను పావులుగా ముందుకు నడిపిస్తూ తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. గెలుపు లెక్కలను పక్కాగా వేస్తూ పార్టీలు, అభ్యర్థుల గెలుపులో తెరవెనుక పాత్ర గట్టిగా పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం విరివిగా వాడుకుంటున్నారు.

పలు పార్టీల కోసం ప్రశాంత్ కిశోర్
2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌ వంటి వ్యూహకర్తలు రాజకీయ వ్యూహ క్షేత్రంలోకి దూసుకొచ్చారు. 2014లో బీజేపీకి వ్యూహరక్తగా వ్యవహరించిన పీకే, నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి కావడం వెనుక అనేక వ్యూహాలు రచించి, సఫలీకృతమయ్యారు. చాయ్‌ పే చర్చ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉద్యమం చేపట్టడం సహా మోదీ అభివృద్ధి సాధకుడు అనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 సీట్లు గెలిచి కొన్నేళ్లుగా నడిచిన సంకీర్ణ ప్రభుత్వాల పరంపరకు తెరదించింది. 2013లో సిటిజన్స్‌ ఫర్‌ అకౌంటబుల్ గవర్నెన్స్‌ పేరుతో ఓ సంస్థను నెలకొల్పిన పీకే తర్వాత దానిని ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్ కమిటీ-I-PACగా మార్చారు. తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా, బిహార్‌లో జేడీయూ, బంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీల కోసం పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత I-PAC నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ తప్పుకున్నప్పటికీ ఆ సంస్థ పలు పార్టీల కోసం పని చేస్తూనే ఉంది.

కాంగ్రెస్ గెలుపులో సునీల్ కీలకపాత్ర
గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం పని చేసిన ఆయన ఆ పార్టీ ఘన విజయం అందుకోవడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్‌ కోసం పనిచేసి విజయవంతమయ్యారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కోసం వ్యూహరచనలో ఉన్నారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర సైతం సునీల్ కనుగోలు వ్యూహంలో భాగమే. గతంలో ఆయన పలు రాష్ట్రాల్లో బీజేపీ కోసం కూడా పనిచేశారు. ఎన్నికల సర్వే సంస్థ చాణక్య నిర్వాహకుడు పార్థ ప్రతిమ్ దాస్‌ 2013లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అజయ్‌ సింగ్‌ అనే అభ్యర్థి గెలిచేందుకు వ్యూహాలు రచించి సఫలీకృతమయ్యారు. ఆయన బీజేపీ సిట్టింగ్‌ ఎంపీపై విజయం సాధించారు. తర్వాత చాణక్యను ఏర్పాటుచేసిన దాస్, 2018 ఎన్నికల్లోనూ అజయ్‌ సింగ్‌ గెలుపు కోసం పనిచేశారు.

గెలుపు కోసం వ్యూహకర్తలు తప్పనిసరి
చాలా రాష్ట్రాల్లో వ్యూహకర్తలను పెట్టుకున్న పార్టీలు విజయవంతమైన నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాల్లో నెగ్గాలంటే వారి అవసరం తప్పనిసరనే అభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహకర్తలకు వందల కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డాయి. సామాజిక మాధ్యమాల కారణంగా ప్రచారం కూడా కొత్త పుంతలు తొక్కుతున్నందున, వ్యూహకర్తలు లేకుండా ఏమీ చేయలేమనే నిర్ణయానికి నేతలు వచ్చేశారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి అవసరమైన కంటెంట్‌ అందించడంలో వ్యూహకర్తలు బాగా ఆరితేరిపోయారు.ఆ కంటెంట్‌ను సొంతంగా తయారు చేసుకోవడం తమ వల్ల కాదని పార్టీలు పోల్‌ మాంత్రికులను ఆశ్రయిస్తున్నాయి.

పార్టీల బట్టి వసూళ్లు
గతంలో ప్రజల్లో నుంచి వచ్చిన నేతలకు వ్యూహకర్తల అవసరం ఉండేది కాదు. అప్పట్లో గెలుపు, ఓటములు నాయకులపైనే అధారపడి ఉండేవి. ఓటమి ఎదురైతే నైతిక బాధ్యత వహించడం వంటి పరిణామాలు కనిపించేవి. కానీ ఇటీవల రాజకీయాలు వ్యాపారాలతో పెనవేసుకుపోవడం, ఎన్నికల్లో ధన ప్రవాహం భారీగా పెరగడం, బిలియనీర్లు రాజకీయాల్లోకి రావడం వంటి పరిస్థితులు వ్యూహకర్తల్ని తెరపైకి తెచ్చాయి. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు వ్యక్తిగతంగానూ పోల్‌ కన్సల్టెంట్‌లను నియమించుకుంటున్నారు. వ్యూహకర్తలుగా పనిచేసినందుకు పార్టీల నుంచి వసూలు చేసే ఛార్జీలు ఆయా పార్టీలు, నాయకులను బట్టి మారుతున్నాయని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు.

అయితే ఎన్నికల వ్యూహకర్తలు తమ వ్యూహాల్లో భాగంగా ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారాలకు సైతం ఏమాత్రం వెనుకాడడం లేదనేది బహిరంగ రహస్యం. కొత్త తరం రాజకీయాలకు ఇవన్నీ అవసరమనే అభిప్రాయాన్ని మెజార్టీ ప్రజల మెదళ్లలో చొప్పించేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిణామమనే ఆందోళన వ్యక్తమవుతోంది.

'టైమ్‌ 100' జాబితాలో అజయ్ బంగా, ఆలియాభట్‌, సత్య నాదెళ్ల- వరల్డ్ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్స్ వీరే! - TIME 100 Most Influential 2024

ఓటింగ్ టైంలో EVM పనిచేయకుంటే ఏం జరుగుతుంది? ఓటరు తప్పు బటన్‌ను నొక్కితే ఏం చేయాలంటే? - LOK SABHA ELECTION 2024

Last Updated : Apr 18, 2024, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.