ETV Bharat / bharat

ఎన్నికల వేళ నగదు​, బంగారాన్ని ఎంత తీసుకెళ్లొచ్చు? పోలీసుల సీజ్ చేస్తే ఏం చేయాలి? - Election Code Of Conduct

Election Code Of Conduct Gold Cash Rules And Regulations : దేశంలో లోకసభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల పోలీసులు చెక్​ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా బంగారం, డబ్బులు ఇతర విలువైన వస్తువులను సీజ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి. ప్రయాణాల్లో ఎంత డబ్బు, బంగారాన్ని వెంట తీసుకెళ్లవచ్చు? సీజ్ తర్వాత ఏం జరుగుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు మీకోసం.

Election Code Of Conduct Gold Cash Rules And Regulations

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 8:29 AM IST

Election Code Of Conduct Gold Cash Rules And Regulations : లోక్​సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు చాలా విషయాలపై పరిమితులు ఉంటాయి. నగదుతోపాటు బంగారు, వెండి ఆభరణాలపై ఎన్నో రకాల ఆంక్షలను విధిస్తారు. మరి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎంత నగదు, నగలను మనతోపాటు తీసుకెళ్లొచ్చో ఇప్పుడు చూద్దాం.

ఎలక్షన్స్​ టైంలో ఒకరు ఎంత నగదు, బంగారం తీసుకెళ్లవచ్చు?
Rules To Carry Cash In Election : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సాధారణ పౌరులు ఎలాంటి పత్రాలు లేకుండా రూ.49వేలను తమవెంట తీసుకెళ్లవచ్చు. అయితే రూ.49వేలకు మించి నగదు తీసుకెళ్తే లెక్కలు చెప్పాలి. ఒకవేళ సరైన లెక్కలు చెప్పకపోతే ఆ మొత్తాన్ని సీజ్​ చేస్తారు. అదేవిధంగా రూ.50వేల విలువైన బంగారం లేదా ఏదైనా ఆభరణాన్ని ఎలాంటి డాక్యుమెంట్స్​ లేకుండా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

నగదు, బంగారం, బహుమతులకు ఎలాంటి పత్రాలు అవసరం?
ఎన్నికల సమయంలో రూ.49వేలకు మించి తీసుకెళ్లే సమయంలో పత్రాలు చూపించాల్సి ఉంటుంది. మీరు విత్‌డ్రా చేసిన బ్యాంక్​ లేదా ఏటీఎం స్లిప్‌ను మీ దగ్గర ఉంచుకోవాలి. అంతేకాకుండా డబ్బును ఎక్కడ ఖర్చుచేస్తారో అందుకు సంబంధించిన పత్రాలు మీ వెంట ఉండాలి. ఒక తులం లేదా రూ.50వేల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని తీసుకెళ్తుంటే దానికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు చూపించాలి.

రూ.10లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే?
ఎన్నికల కోడ్​ సమయంలో మీరు అత్యవసర పని కోసం రూ.10లక్షలు తీసుకుని ప్రయాణించవచ్చు. ఉదాహరణకు మీరు పెళ్లి కోసం లేక ఆస్పత్రి ఖర్చు కోసం రూ.10లక్షలు తీసుకెళ్తే, అందుకు సంబంధించిన పత్రాలను మీ వద్ద ఉంచుకోండి. హాస్పిటల్​ బిల్లు లేదా పెళ్లి కార్డు వంటివి చూపించాల్సి ఉంటుంది. వీటిని చూపించిన తర్వాత, చెక్​పోస్టు బృందాలు లేదా పోలీసులు మిమ్మల్ని పెద్ద మొత్తంలో డబ్బును తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.

నగదు లేదా నగలు స్వాధీనం చేసుకుంటే ఎలా?
EC Code Of Conduct Rules : సరైన పత్రాలు సమర్పించని సమయాల్లో డబ్బును లేదా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఎన్నికలు ముగిసిన అనంతరం తగిన ఆధారాలు అందించిన తర్వాతే ఆ సీజ్​ చేసిన వాటిని మీకు అందిస్తారు. అయితే రూ.10లక్షల కంటే ఎక్కువ నగదు ఉంటే ఐటీ శాఖ విచారణ చేపడుతుంది. విచారణ అనంతరం మీ డబ్బు తిరిగి ఇస్తుంది.

నగదు, బంగారం సీజ్ తర్వాత ఏం జరుగుతుంది?
ఎన్నికల సమయంలో డబ్బు, నగలు, ఖరీదైన బహుమతులు సీజ్ చేసిన తర్వాత ఎన్నికల సంఘం బృందం మొదట విచారణ చేస్తుంది. దీని తర్వాత ఆదాయపు పన్ను శాఖ విచారణ చేపడుతుంది. విచారణలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు లేదా బంగారం తీసుకెళ్తున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్​ నమోదు చేస్తారు. ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని కోర్టు గుర్తించినట్లయితే, డబ్బు, నగలను తిరిగి ఇచ్చేస్తారు.

విమానంలో ఎంత నగదు, బంగారం తీసుకెళ్లవచ్చు?
Rules To Carry Gold During Election Code : ఎన్నికల సంఘం సూచనల మేరకు రూ.10లక్షల నగదు, సుమారు కిలో బంగారం, వెండితో- విమానం, రైలు, బస్సుల్లో ప్రయాణించవచ్చు. సీఐఎస్‌ఎఫ్​ లేదా పోలీసు అధికారులు ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించే సమయంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదు లేదా కిలో కంటే ఎక్కువ విలువైన బంగారం దొరికితే వెంటనే ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందిస్తారు. రైల్వే స్టేషన్‌లో రూ.10లక్షల నగదు, కిలో బంగారం, వెండిని సీజ్​ చేస్తే జీఆర్‌పీ ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తుంది. దీని తర్వాత ఆదాయపు పన్ను శాఖ ధ్రువీకరణ చేస్తుంది. మీరు సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోతే, డబ్బు బంగారాన్ని జప్తు చేస్తారు.

నగదు, నగలు పట్టుబడితే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
తనిఖీ సమయంలో మీ నగదు లేదా బంగారం సీజ్ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందుకోసం మీ ఫిర్యాదులను తీసుకునేందుకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఈ కమిటీలో జిల్లా ఎన్నికల కార్యాలయం నోడల్ అధికారి, జిల్లా ట్రెజరీ అధికారి ఉంటారు. ఈ కమిటీ స్వాధీనం చేసుకున్న ప్రతి కేసును పరిశీలిస్తుంది. కానీ ఈ కమిటీ ఏ వ్యక్తిపైన లేదా అభ్యర్థిపైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదా ఫిర్యాదు చేయడం లాంటివి చేయదు. ఏదైనా నగదును స్వాధీనం చేసుకున్న వెంటనే ఎన్నికల కమిషన్​ ఎస్​ఓపీ ప్రకారం విచారణ జరిపి దానిని తిరిగి ఇచ్చేస్తుంది.

సమ్మర్​ ఎఫెక్ట్- కుక్కలకు షూ, కూలర్లు ఏర్పాటు- ఎక్కడో తెలుసా? - Police Dogs Wear Shoes In Karnataka

భార్య కాంగ్రెస్​ ఎమ్మెల్యే- ఇంటిని వీడిన భర్త- ఎన్నికల వేళ బీఎస్​పీ ఎంపీ అభ్యర్థి కీలక నిర్ణయం! - BALAGHAT FAMILY FIGHT OF POLITICS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.