Maharashtra Jharkhand Elections 2024 : మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు ఒకే విడతల్లో, ఝార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించారు. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికలు
మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే విడతలో పొలింగ్ నిర్వహిస్తున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలో మొత్తం 9.63 కోట్ల ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. వారి కోసం 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 20.93లక్షల మంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు సీఈసీ తెలిపారు.
- నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 22
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 29
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 30
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 4
- పోలింగ్ తేదీ: నవంబర్ 20
- ఎన్నికల ఫలితాల తేదీ: నవంబర్ 23
Maharashtra to vote in a single phase on 20th November. Counting of votes on 23rd November.#MaharashtraElection2024 pic.twitter.com/U48nySwK41
— ANI (@ANI) October 15, 2024
ఝార్ఖండ్ ఎన్నికలు షెడ్యూల్
ఝార్ఖండ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని సీఈసీ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2.69 కోట్ల ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. వారి కోసం 29,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 11.84 లక్షల మంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు సీఈసీ చెప్పారు.
తొలి దశ:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 18
- నామినేషన్ల దాఖలుకు తుది గడువు: అక్టోబర్ 25
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 28
- నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 30
- పోలింగ్ తేదీ: నవంబర్ 13
రెండో దశ:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22
- నామినేషన్ల దాఖలుకు తుది గడువు: అక్టోబర్ 22
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 30
- నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 1
- పోలింగ్ తేదీ: నవంబర్ 20
- ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 23
Jharkhand to vote in two phases - on 13th November and 20th November. Counting of votes on 23rd November.#JharkhandElection2024 pic.twitter.com/JlCJRgHLD2
— ANI (@ANI) October 15, 2024
ఉపఎన్నికల వివరాలు
దేశంలోని 47 అసెంబ్లీ స్థానాలకు, కేరళలోని వయనాడ్(రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ) పార్లమెంట్ నియోజకవర్గానికి నవంబర్ 13న పోలింగ్ నిర్వహించనున్నారు.
- నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 18
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 25
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 15
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 30
- పోలింగ్ తేదీ: నవంబర్ 13
ఉత్తరాఖండ్‌లోని ఒక అసెంబ్లీ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.
- నోటిఫికేషన్ విడుదల తేదీ : అక్టోబర్ 22
- నామినేషన్ల స్వీకరణకు తుది గడువు: అక్టోబర్ 29
- నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 30
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 4
- పోలింగ్ తేదీ: నవంబర్ 20
- ఫలితాల తేదీ : నవంబర్ 23
Bye Elections to 47 Assembly Constituencies & 1 Parliamentary Constituency (Wayanad) in Kerala on 13th Nov
— ANI (@ANI) October 15, 2024
Bye Polls to 1 Assembly Constituency in Uttarakhand on 20th Nov
Bye Elections to 1 Parliamentary Constituency (Nanded) in Maharashtra on 20th Nov
Counting on 23rd Nov pic.twitter.com/NCxkneYL4X
మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 26తో ముగియనుంది. ఝార్ఖండ్ శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీ పార్టీలతో కూడిన మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఝార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వం ఉండగా, ఈ పార్టీ విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది.