ETV Bharat / bharat

సూపర్ ఐడియా : వాటర్ బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా దుర్వాసన పోవడం లేదా? - ఈ టిప్స్​తో స్మెల్​ పరార్​! - Water Bottles Cleaning Tips - WATER BOTTLES CLEANING TIPS

Water Bottles Cleaning Tips : ప్రస్తుతం చాలా మంది వాటర్​ బాటిల్స్​ వాడుతున్నారు. అయితే వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే లోపల బ్యాక్టీరియా పేరుకుపోయి బ్యాడ్​ స్మెల్​ వస్తుంటుంది. దీంతో ఎంత క్లీన్​ చేసినా ఆ స్మెల్​ పోదు. పైగా ఆ బాటిల్స్​లో వాటిర్​ తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి, వాటర్ బాటిల్స్​ను ఈ టిప్స్​తో ఈజీగా క్లీన్ చేసుకుంటే దుర్వాసన పోతుందని అంటున్నారు.

Easy Tips To Clean Water Bottles
Water Bottles Cleaning Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 11:56 AM IST

Easy Tips To Clean Water Bottles : ఒకప్పుడు కాలేజీకో, ఆఫీసుకో లేదంటే ఏవైనా ప్రయాణాలు చేసేటప్పుడో వాటర్ బాటిల్స్ వెంట తీసుకెళ్లేవారు. కానీ, నేటి రోజుల్లో మెజార్టీ పీపుల్ ఎక్కడికి వెళ్లినా వెంట వాటర్ బాటిల్ పట్టుకెళ్తున్నారు. అంతేకాదు.. ఇంట్లో ఉన్నా కూడా బాటిల్​తోనే వాటర్ తాగుతున్నారు. అయితే, వీటిని యూజ్ చేయడం వరకు ఓకే కానీ.. క్లీనింగ్​ విషయంలోనే మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఒకవేళ క్లీన్​ చేసినా పైపైన కడిగి చేతులు దులుపుకుంటారు. అయితే ఇలా క్లీన్​ చేయడం వల్ల వాటిలో బ్యాక్టీరియా పేరుకుపోయి దుర్వాసన వస్తుందని.. అంతేకాకుండా వివిధ అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే.. ఈ టిప్స్​ పాటిస్తూ వాటర్ బాటిల్స్(Water Bottles) క్లీన్ చేసుకుంటే బ్యాడ్​స్మెల్​ పోయి కొత్తవాటిలా ఉంటాయంటున్నారు.

డిష్ వాషింగ్ లిక్విడ్ : ముందుగా వాటర్ బాటిల్​లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోయాలి. ఆ తర్వాత అందులో కొన్ని చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ సోప్ వేయాలి. అనంతరం క్యాప్ పెట్టి బాగా షేక్ చేసి 2 నుంచి 4 నిమిషాలు పక్కన ఉంచాలి. ఆపై బ్రష్ సహాయంతో ​బాటిల్​ లోపల బాగా స్క్రబ్ చేసి కడుక్కోవాలి. అయితే, అందులోని రసాయనాలు ప్రభావం చూపకుండా చివర్లో కొద్దిగా ఉప్పు వేసి కడుక్కోవాలనే విషయం మర్చిపోవద్దంటున్నారు నిపుణులు. అలాగే బాటిల్ క్యాప్​నూ శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని కాసేపు ఆరబెట్టుకొని ఆపై యూజ్ చేయడం బెటర్ అంటున్నారు.

అయితే, రాగి వాటర్ బాటిల్స్​ను మాత్రం ఉప్పుతో కడగకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలా చేస్తే అది రసాయన చర్య జరిపి కాపర్‌ క్లోరైడ్‌ని ఏర్పరుస్తుందని చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి.. అందుకు బదులుగా వేడినీళ్లతో శుభ్రం చేయడం మంచిదంటున్నారు.

వాటర్​ బాటిల్ ఉపయోగిస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులే!

నిమ్మ, వేప మిశ్రమం : ఈ మిశ్రమం వాటర్‌ బాటిళ్లలో బ్యాడ్​ స్మెల్​ పోగొట్టి శుభ్రపర్చడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా బాటిల్​లో కాస్త వేప పొడి, నిమ్మరసం వేసి నిండా నీళ్లు పోసి అలానే ఓ రెండు మూడు గంటలు ఉంచాలి. ఆ తర్వాత ఫ్రెష్ వాటర్​తో శుభ్రం చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.

నిమ్మరసం : ఇది వాటర్ బాటిల్స్​లో చెడు వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు. ఇందుకోసం ముందుగా బాటిల్​లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకొని అందులో కాస్త నిమ్మరసం వేసుకొని బాగా షేక్ చేయాలి. ఆపై మంచినీళ్లతో రెండు మూడుసార్లు కడిగితే చాలు. జిడ్డుతో పాటు దుర్వాసనా ఈజీగా పోతుందంటున్నారు నిపుణులు. లేదంటే.. నిమ్మరసం ఫ్లేస్​లో వెనిగర్‌ వేసినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

2017లో "అప్లైడ్ మైక్రోబయాలజీ" అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నిమ్మరసం వాటర్​ బాటిల్స్​లో దుర్వాసనకు కారణమయ్యే శిలీంధ్రాల పెరుగుదలను నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని జియాంగ్నాన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ X. Wang పాల్గొన్నారు. నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వాటర్ బాటిల్స్​లో దుర్వాసనను పోగొట్టడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

వంటసోడా : వాటర్ బాటిల్స్​లో చెడు వాసన, జిడ్డు, క్రిములను తొలగించడంలో వంటసోడా చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం బాటిల్​లో ఓ చెంచా వంటసోడా వేసి నీళ్లు పోసి ఓ గంట ఉంచి ఆపై శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కాపర్​ బాటిల్​లో వాటర్ తాగుతున్నారా? - ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

వాటర్ బాటిల్ క్యాప్స్ డిఫరెంట్ కలర్స్​లో - దీని అర్థం ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.