Dogs Name Printed on Wedding Card : విశ్వాసానికి మారుపేరు శునకాలు అని చెబుతుంటారు. అలాంటి వాటిని చాలా మంది తమ కుటుంబంలోని సభ్యులుగా చూస్తారు. వాటికి మనుషులకు చేసే సపర్యలు చేస్తుంటారు. మరి ఇంటి సభ్యులని మాటల్లో చెబితే సరిపోదు, చేతల్లో చేసి చూపించాలి అని అనుకున్నాడు ఓ యువకుడు. తన వివాహానికి అతిథులను ఆహ్వానించేందుకు ముద్రించిన పెళ్లి పత్రికపై, నాలుగు పెంపుడు శునకాల పేర్లను ముద్రించాడు మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోని ఓ యువకుడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
సాగర్ జిల్లాలోని రాణిపుర నివాసి యశ్వంత్ రైక్వార్. సుమారు ఐదేళ్ల క్రితం యశ్వంత్ తన స్నేహితుడిని డ్రాప్ చేయడానికి వెళ్లాడు. అనంతరం తిరిగి వస్తుండగా అతడి స్కూటర్ టైర్ కింద ఓ కుక్క పిల్ల పడింది. అయితే అదృష్టవశాత్తు ఆ దానికి ఏం కాలేదు. దీంతో ఆ కుక్కను యశ్వంత్ తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకున్నాడు. క్రమంగా శునకాలపై యశ్వంత్‌కు ఇష్టం ఏర్పడింది. అలా మరో మూడు కుక్కలను ఇంటికి తీసుకువచ్చి పెంచుకుంటున్నాడు.
భౌ-భౌ పార్టీ!
ఇదిలా ఉండగా యశ్వంత్‌కు ఉత్తర్‌ప్రదేశ్ మెహ్రానీకి చెందిన చంచల్ రైక్వార్తో వివాహం నిశ్చయమైంది. అనంతరం తన పెళ్లి ఏర్పాట్లలో యశ్వంత్ నిమగ్నమయ్యాడు. వివాహ ఆహ్వాన పత్రికలు సిద్ధం చేయిస్తున్న తరుణంలో, యశ్వంత్‌కు ఓ ఆలోచన వచ్చింది. తాను అమితంగా ప్రేమిస్తూ, కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న శునకాల పేర్లు కూడా ఆహ్వాన పత్రికలో చేర్చాలనుకున్నాడు. అనుకున్నట్లే పెళ్లి కార్డులో 'భౌ భౌ' పార్టీ పేరుతో నాలుగు కుక్కలు రాకీ, జోజో, కాలు, లాలూ పేర్లు ప్రింట్ చేయించాడు.
ఏప్రిల్ 21న యశ్వంత్ వివాహం జరిగింది. అయితే పెళ్లికి సంబంధించి హల్దీ వేడుక, సంగీత్, పెళ్లి ఊరేగింపు లాంటి ప్రతి కార్యక్రమంలో ఈ శునకాలను భాగం చేశాడు యశ్వంత్. వాటిని పెళ్లికి వచ్చిన అతిథుల మాదిరిగానే స్వాగతించాడు. అంతేకాకుండా ఊరేగింపునకు బయలుదేరే సమయంలో కుక్కలకు పసుపు కూడా ఇచ్చారు. కుక్కలపై యశ్వంత్‌కు ఉన్న ప్రేమ చూసి వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్యనీయాంశమైంది.
VVPATలు ఎలా పని చేస్తాయి? ధర ఎంత? తొలిసారి ఎప్పుడు వినియోగించారు? - VVPAT Working Model
ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డ్ ఎగ్జామ్స్- సెమిస్టర్స్ కాదు! - CBSE Board Exam Rules