ETV Bharat / bharat

డైరెక్టర్ నేషనల్ అవార్డులు సేఫ్- 'సారీ సార్' అంటూ లెటర్ రాసిన దొంగలు - national award thiefs

Director Manikandans Residence Robbed : నేషనల్ అవార్డ్ విన్నర్​, కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మణికందన్ జాతీయ పతాకాలు ఎత్తుకెళ్లిన దొంగలు వాటిని తిరిగి ఇచ్చేశారు. దాంతోపాటు ఓ క్షమాపణ లేఖను కూడా వదిలి వెళ్లారు.

Director Manikandans Residence Robbed
Director Manikandans Residence Robbed
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 12:47 PM IST

Director Manikandans Residence Robbed : ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణికందన్ ఇంట్లో కొందరు దుండగులు ఇటీవల చోరీకి పాల్పడి ఆయన జాతీయ అవార్డు పతకాలను ఎత్తుకెళ్లి పోయారు. ఈ ఘటన సంచలనంగా మారడం వల్ల, దొంగలు మణికందన్​ జాతీయ అవార్డుల పతకాలు తిరిగి ఇచ్చేశారు. ఒక పాలిథిన్ కవర్​లో కట్టి గోడకు తలిగించి వెళ్లారు. దాంతోపాటు ఓ క్షమాపణ లేఖను కూడా వదిలి వెళ్లారు. అందులో 'సారీ సర్- మమ్మల్ని క్షమించండి.' అని నోట్​ రాశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Director Manikandans Residence Robbed
క్షమాపణ లేఖ

ఇదీ జరిగింది
ఇటీవల డైరెక్టర్ మణికందన్ ఇంట్లో కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. మధురైలోని ఉసిలంపట్టిలోని ఈ ఘటన జరిగింది. డైరెక్టర్ నివాసానికున్న ఇంటి తాళాన్ని పగులగొట్టిన ఆ వ్యక్తులు, అక్కడ నుంచి సుమారు రూ.లక్ష నగదు, ఐదు సవర్ల విలువైన బంగారు నగలను చోరీ చేశారు. అంతే కాకుండా డైరెక్టర్ సాధించిన జాతీయ అవార్డులకు సంబంధించిన రజత పతకాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

Director Manikandans Residence Robbed
దొంగలు వదిలి వెళ్లిన క్షణాపణ లేఖ

వెడ్డింగ్​ ఫొటోగ్రాఫర్​గా పనిచేసి
ఇక డైరెక్టర్ మణికందన్ కెరీర్ విషయానికి వస్తే - తమిళనాడులోని మధురై జిల్లా, ఉసిలంపట్టిలో జన్మించిన ఆయన స్కూలింగ్ పూర్తి ​ చేసిన తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశారు. అయితే ఫొటోగ్రఫీపై ఉన్న ఆసక్తిని పెంచుకున్న మణికందన్ తొలుత వెడ్డింగ్​ ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇదికాకుండా స్కూల్​, కాలేజీ పిల్లలకు ఐడీ కార్డులు తయారు చేయడం లాంటి చిన్న ఉద్యోగాలు కూడా చేసేవారు. రాజీవ్ మేనన్​ నిర్వహించే ఫిలిం స్కూల్ అయిన మైండ్‌స్క్రీన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిజిటల్ ఫోటోగ్రఫీలో కోర్సును అభ్యసించడానికి డబ్బు కోసం ఆయన ఇవన్ని చేశారంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

షార్ట్​ ఫిల్మ్​తో ఎంట్రీ
మణికందన్​ పలు తమిళ చిత్రాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆ సమయంలో మణికందన్​ విండ్ (2010) అనే షార్ట్ ఫిల్మ్​ను తెరకెక్కించారు. ఇది విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దీంతో పాటు డైరెక్ట వెట్రిమారన్ దృష్టిని ఆకర్షించింది. ఆయన సహకారంతో 'కాకా ముట్టై' అనే సినిమాను మణికందన్ రూపొందించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా 62వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు పురస్కారాలను అందుకుంది. అంతే కాకుండా 13వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్‌లో ఉత్తమ ఫీచర్‌గా ప్రేక్షకుల అవార్డును గెలుచుకుంది. దీని తర్వాత ఆయన 2021లో కడైసీ వ్యవసాయి అనే సినిమాను తీశారు. ఇది కూడా క్రిటిక్స్​ కాంప్లిమెంట్స్​తో పాటు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్​గా నేషనల్ అవార్డును అందుకుంది.

'కొన్ని' శిబిరంలో 'మణికందన్​' సందడి

విజయ్ దేవరకొండపై పీవీ సింధు షాకింగ్ కామెంట్స్​ - అలా అనేసిందేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.