ETV Bharat / bharat

ఇకపై తల్లిదండ్రుల వద్దే పిల్లలకు సీట్లు- విమాన ప్రయాణికులకు DGCA గుడ్​ న్యూస్​ - seat allotment in flight for child - SEAT ALLOTMENT IN FLIGHT FOR CHILD

Seat Allotment In Flight For Child : 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి వద్ద సీటును కేటాయించాలని ఎయిర్ లైన్ కంపెనీలకు ఆదేశించింది డీజీసీఏ. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.

seat allotment in flight for child
seat allotment in flight for child
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 2:34 PM IST

Updated : Apr 23, 2024, 2:54 PM IST

Seat Allotment In Flight For Child : విమానయాన సంస్థలకు భారత పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటును కేటాయించాలని ఎయిర్ లైన్ కంపెనీలకు ఆదేశించింది. పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో విమానాల్లో ప్రయాణించే సందర్భాల్లో చాలాసార్లు తమ పెద్ద వాళ్లకు దూరంగా కూర్చోవాల్సి వస్తోంది. దీనిపై డీజీసీఏకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన డీజీసీఏ, తల్లిదండ్రుల్లో ఇద్దరిలో కనీసం ఎవరో ఒకరి వద్ద కూర్చునే అవకాశం లభిస్తే, వారి ప్రయాణం సజావుగా జరుగుతుందని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. పిల్లలకు పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరి పక్కన సీటును కేటాయిస్తే ఆ విషయాన్ని తప్పకుండా ప్రయాణ రికార్డులలో నమోదు చేయాలని సూచించింది.

ప్రిఫరెన్స్​ సీటింగ్
దీంతో పాటు మరికొన్ని నిబంధనలను డీజీసీఏ సవరించింది. దీనిలోని నిబంధనలలోనే ప్రిఫరెన్షియల్ సీటింగ్ గురించి ప్రస్తావన ఉంది. ప్రయారిటీ ప్రకారం విమాన టికెట్ల కేటాయింపును ఈ నిబంధన తెలియజేస్తుంది. విమానం బయలుదేరే సమయం వరకు చెకిన్ కోసం ఏ సీటునూ ఎంచుకోని ప్రయాణికులకు ఆటోమెటిక్‌గా సీటును కేటాయించే నిబంధన కూడా సవరించిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్‌‌లో ఉంది. దీని ద్వారా జీరో బ్యాగేజీ ఛార్జీలు, భోజనం, స్నాక్/ డ్రింక్ ఛార్జీలు, సంగీత వాయిద్యాల క్యారేజ్ కోసం ఛార్జీలను పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చారు.

పైలట్లు పెర్‌ఫ్యూమ్‌లు వాడొద్దు : డీజీసీఏ
విమానయాన సిబ్బంది సువాసనలు వెదజల్లే పెర్‌ఫ్యూమ్‌లు, మౌత్‌వాష్‌లు వాడొద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గతేడాది డిసెంబర్​లో ఓ డ్రాఫ్ట్​ను విడుదల చేసింది. విమాన సర్వీసుల్లో పనిచేసే సిబ్బందికి తరచూ బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. పెర్‌ఫ్యూమ్‌లు, మౌత్‌వాష్‌లలో అధిక ఆల్కహాల్ శాతం ఉండటం వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని డీజీసీఏ భావించింది.

భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థలన్నీ బ్రీత్‌ ఎనలైజింగ్‌ను తప్పనిసరి చేశాయి. విమాన సర్వీసుల్లో పాల్గొనే పైలట్లు, సిబ్బందికి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆల్కహాల్‌ టెస్టు చేస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో మాత్రమే కొన్ని రోజులు ఈ తరహా పరీక్షలను నిలిపివేశారు.

విమానం డోర్​ ఊడిన ఘటన- DGCA అలర్ట్- ఎమర్జెన్సీ డోర్​లు తనిఖీ చేయాలని ఆదేశాలు!

ఎయిర్​ ఇండియాకు DGCA షాక్​.. రూ.30 లక్షలు ఫైన్​, పైలట్ లైసెన్స్ సస్పెండ్

Last Updated : Apr 23, 2024, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.