Delhi School Blast : దిల్లీలోని సీఆర్పీఎఫ్ పాఠశాల బాంబు పేలుడు కలకలం సృష్టించిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్-ఎన్ఎస్జీ, నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏ ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. మరిన్ని ఆధారాల కోసం స్నిఫర్ డాగ్స్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించడానికి రోబోలను మోహరించింది ఎన్ఎస్జీ. ఇప్పటికే పాఠశాలను తనిఖీ చేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఘటనాస్థలిలో లభించిన వైట్ పౌడర్‌ను ప్రయోగశాలకు పంపించారు.
మరోవైపు, పేలుడు సంభవించినప్పుడు పాఠశాల సమీపంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి మొబైల్ నెట్వర్క్ డేటాను సేకరిస్తున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
VIDEO | Investigation is underway outside CRPF school in Prashant Vihar area in Delhi's Rohini after a blast was reported in the area earlier today.
— Press Trust of India (@PTI_News) October 20, 2024
A bomb squad and a police forensic team reached the spot immediately to investigate the source of the explosion that was reported… pic.twitter.com/2EBFCYyvTV
#WATCH | Rohini, Delhi: NIA team reaches the spot where a blast was heard outside CRPF School in Rohini's Prashant Vihar area early today morning. pic.twitter.com/MyP0WAfL5o
— ANI (@ANI) October 20, 2024
ఇదీ జరిగింది
రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ అనుమానాస్పద ఘటనలో పాఠశాల గోడ ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. పాఠశాల సమీపంలో పార్క్ చేసిన కార్లు, చుట్టపక్కల ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. దుకాణాల సైన్ బోర్డులు దెబ్బతిన్నాయి. స్థానికులు పేలుడు దృశ్యాలను ఫోన్లలో రికార్డు చేశారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించిందని వారు తెలిపారు.
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ బృందాలు, క్రైమ్, బాంబు డిస్పోజల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణులు పాఠశాల గోడ వద్ద తెల్లని పౌడర్ గుర్తించారు. దాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. దానితో పాటు పాఠశాల సమీపంలోని మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా దాడికి పాల్పడ్డారా లేదా భూగర్భ మురుగునీటి లైన్‌లోని వాయువు- పేలుడుకు కారణమైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు దీల్లీ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పేడులు నేపథ్యంలో దిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పండుగ సీజన్ కావడం వల్ల వివిధ మార్కెట్లల్లో పెట్రోలింగ్ చేయనున్నట్లు చెప్పారు.
#WATCH | Delhi: The FSL team collects samples from the spot where a blast was heard outside CRPF School in Rohini's Prashant Vihar area early in the morning. pic.twitter.com/PCr2g27l3Q
— ANI (@ANI) October 20, 2024
#WATCH | Rohini, Delhi: NDRF team reaches the spot where a blast was heard outside CRPF School in Rohini's Prashant Vihar area early today morning. pic.twitter.com/OvEc5M09bQ
— ANI (@ANI) October 20, 2024
'అండర్ వరల్డ్ ముంబయిలా దిల్లీ'
ఈ ఘటనతో దిల్లీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే విషయాన్ని బహిర్గతం అయ్యిందని, అందుకు కారణం బీజేపీనే అని రాష్ట్ర సీఎం ఆతిశీ విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంప్రభుత్వంపై ఉందని కానీ, బీజేపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ' మా ప్రభుత్వం చేస్తోన్న పనులకు ఆటంకం కలిగించడానికి కేంద్రం తన సమయాన్ని వినియోగిస్తోంది. ఒకప్పటి అండర్ వరల్డ్ ముంబయిలా ప్రస్తుతం దిల్లీ పరిస్థితి మారింది. బహిరంగంగానే తూటాలు పేలుతున్నాయి, గ్యాంగ్‌స్టార్స్ డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటిని నియంత్రించే సామర్థ్యం బీజేపీకి లేదు' అని ఎక్స్ వేదికగా ఆతిశీ విమర్శించారు.
रोहिणी स्थित एक स्कूल के बाहर Bomb Blast की घटना दिल्ली की चरमराती सुरक्षा व्यवस्था की पोल खोल रही है।
— Atishi (@AtishiAAP) October 20, 2024
दिल्ली में लॉ एंड ऑर्डर की जिम्मेदारी भाजपा की केंद्र सरकार के पास है। लेकिन भाजपा अपना ये काम छोड़कर सारा समय दिल्ली की चुनी हुई सरकार के कामों को रोकने में लगाती है।
यही…
సీఎం ఆతీశీ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆతిశీ తోలుబొమ్మ సీఎం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సమస్య పరిష్కారం గురించి ఆలోచించకుండా ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికింది.