ETV Bharat / bharat

ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - ఏడాదికి రూ.5000- ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1 లక్ష సాయం - RS10 LAKH INSURANCE AUTO DRIVERS

ఆటో డ్రైవర్లపై అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం - రూ.10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ - ఏడాది రూ.5000 యూనిఫాం అలవెన్స్ - ఆడపిళ్లల పెళ్లిళ్లకు రూ.1 లక్ష ఆర్థిక సాయం

Rs 10 lakh insurance for auto drivers
Rs 10 lakh insurance for auto drivers (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2024, 5:26 PM IST

Rs 10 lakh insurance for auto drivers : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆటో డ్రైవర్లపై ఆమ్​ ఆద్మీ పార్టీ-ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు. దిల్లీ ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల వరకు లైఫ్​ ఇన్సూరెన్స్​ ప్రకటించారు. దీంతో పాటు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్ల కూతుళ్ల పెళ్లిళ్లకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆటోవాలాలకు యూనిఫాం అలవెన్స్​ కింద ఏడాదికి రెండు సార్లు రూ.2,500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్ల పిల్లలకు ఉచిత కోచింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం కోండ్లి నియోజకవర్గంలోని ఓ ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులతో కేజ్రీవాల్ మధ్యాహ్న బోజనం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం హామీలు ప్రకటించారు.

ఈ సందర్భంగా 'పూచో' యాప్​ను ప్రారంభించారు అరవింద్ కేజ్రీవాల్. రిజిస్టర్డ్​ ఆటో డ్రైవర్ల మొబైల్​ నంబర్స్​తో ఓ డేటాబేస్​ను దిల్లీ​ ఇంటిగ్రేడెట్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్​ అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు డ్రైవర్​ నంబర్​కు కాల్​ చేసి రైడ్ బుక్​ చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా, దిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ స్థానాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్​తో హోరాహోరీగా పోరాడుతున్న ఆప్​, వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.