ETV Bharat / bharat

పొట్టలో 37 కాయిన్స్, 39 మ్యాగ్నెట్స్​- జింక్​ కోసం నాణెలు మింగిన వ్యక్తి! ఆపరేషన్​ చేసిన వైద్యులు షాక్​! - patient swallowed magnets

Delhi Man Swallows 39 Coins : కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు ఓ వ్యక్తి. ఎక్స్​రే తీసిన వైద్యులు పొట్టలో ఉన్న లోహాలను చూసి కంగుతిన్నారు. ఆపరేషన్​ చేసి చూస్తే పొట్టలో 39 నాణేలు, 37 అయస్కాంత ముక్కలు బయటపడ్డాయి. ఈ ఘటన దిల్లీలో జరిగింది. దీనికి బాధితుడు చెప్పిన కారణం చూస్తే షాక్​ అవ్వాల్సిందే.

Delhi Man Swallows 39 Coins
Delhi Man Swallows 39 Coins
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 6:02 PM IST

Delhi Man Swallows 39 Coins : ఎవరైనా ఆకలేస్తే అన్నమో, పండ్లో లేదంటే నచ్చిన ఆహారమో తింటారు. కానీ దిల్లీకి చెందిన 26 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం ఏకంగా నాణేలు, అయస్కాంత ముక్కలను తిన్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దిల్లీలో నిజంగా జరిగింది ఈ ఘటన. అయితే, శారీరక దారుఢ్యానికి జింక్​ అవసరమనే తాను ఇలా చేశానని చెబుతున్నాడు. ఇంతకీ ఎం జరిగిందంటే?

Delhi Man Swallows 39 Coins
డాక్టర్లు సర్జరీ చేసి రోగి పొట్టలో నుంచి తీసిన నాణేలు అయస్కాంతాలు

పేషెంట్ పొట్టలో 37 నాణేలు, 39 అయస్కాంతాలు
దిల్లీకి చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తి చాలా రోజులుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆ వ్యక్తిని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు అతడి కుటుంబ సభ్యులు. అతడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, పొట్టలో లోహలు ఉన్నాయని నిర్ధరించారు. దీంతో ల్యాప్రొస్కోపిక్ సర్జన్ తరుణ్ మిట్టల్ ఆధ్వర్యంలోని వైద్య బృందం రోగికి శస్త్రచికిత్స చేశారు. రోగి పొట్టలో రెండు, ఐదు రూపాయల విలువున్న 39 నాణేలు, వివిధ పరిమాణాల్లో ఉన్న 37 అయస్కాంతాలను గుర్తించారు. అయితే వాటిని శస్త్రచికిత్స చేసి తొలగించామని సర్జన్ తరుణ్ మిట్టల్ వివరించారు. '26 ఏళ్ల ఓ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. కుటుంబ సభ్యులు అతడి ఎక్స్​రేను వెంట తీసుకువచ్చారు. దానిని పరిశీలించగా పొట్టలో ప్రేగులకు అడ్డంగా అయస్కాంతాలు, నాణేలు ఉన్నట్లుగా గుర్తించాం. CT- స్కాన్​ చేసిన అనంతరం శస్త్రచికిత్స చేసి పేషేంట్ పొట్టలో ఉన్న నాణేలను బయటకు తీసాము. ఏడురోజుల పాటు ఆసుపత్రిలో చికిత్సను అందించి అతడిని డిశ్చార్జ్​ చేశాము' అని వైద్యులు తరుణ్ మిట్టల్ తెలిపారు.

Delhi Man Swallows 39 Coins
పేషెంట్​ పొట్టలో నాణేలు ఉన్నట్లు చూపిస్తున్న ఎక్స్​రే

'శరీరానికి జింక్​ అవసరమనే నాణేలు తిన్నాను'
మరోవైపు నాణేలు, అయస్కాంతాలు మింగడానికి రోగి చెప్పిన కారణం విన్న వైద్యులు షాక్ అయ్యారు. 'శరీరానికి జింక్ అవసరమని ఎక్కడో చదివాను. నాణేలలో జింక్​ ఉంటుందని, ఇది తన శరీరాన్ని ధృడంగా ఉంచుతుందని విన్నాను. అందుకోసమే నాణేలు మింగాను. ఆ నాణేలు శరీరం నుంచి బయటకు రాకుండా ఉండేందుకు అయస్కాంతాన్ని మింగాను' అని రోగి చెప్పారు. రోగి మానసిక వ్యాధితో ఇబ్బందిపడుతున్నారని, నాణేలు తినే అలవాటు కూడా ఉందని అతడి బంధువులు తెలిపారు.

ఐదేళ్లుగా యువకుడి కడుపులో కత్తి.. ట్యాబ్లెట్లు ఇచ్చి మేనేజ్​ చేసిన వైద్యుడు!

వ్యక్తి పొట్టలో ఇనుప ముక్కలు... పెన్ను, పెన్సిళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.