ETV Bharat / bharat

కరివేపాకు త్వరగా వాడిపోతుందా? - ఇలా చేసి చూడండి - ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉంటుంది! - Curry Leaves Storage Tips - CURRY LEAVES STORAGE TIPS

Curry Leaves Storage Tips : వంటింట్లో విరివిగా ఉపయోగించే కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, అసలు ప్రాబ్లమ్ వచ్చేసరికి.. కరివేపాకు త్వరగా వాడిపోతుందని చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ పాటించి కరివేపాకు స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

How To Store Curry Leaves
Curry Leaves Storage Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 10:26 AM IST

How To Store Curry Leaves: మనం డైలీ చేసుకునే వివిధ వంటకాల్లో తప్పనిసరిగా ఉండే వాటిల్లో ఒకటి.. కరివేపాకు. ఇది వంటలకు కమ్మని రుచి, వాసనను అందించి అదనపు టేస్ట్​ను తీసుకొస్తుంది. మనకు విరివిగా దొరికే ఈ ఆకులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే కరివేపాకులో.. ఫైబర్, పిండి పదార్థాలు, విటమిన్ ఎ, బి, సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, భాస్వరం, కాల్షియం వంటి శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా పుష్కలం. ఫలితంగా దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

అయితే, అసలు సమస్య వచ్చేసరికి.. కరివేపాకును మార్కెట్​ నుంచి తెచ్చినప్పుడు ఫ్రెష్​గానే ఉంటుంది. కానీ, నెక్ట్ డే వచ్చేసరికి అది కాస్త వాడిపోయినట్లు కనిపిస్తుంది. దాంతో చాలా మంది కరివేపాకు(Curry Leaves) వాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోసం కొన్ని ఈజీ టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే మీరు మార్కెట్​ నుంచి తెచ్చుకున్న కరివేపాకు వాడిపోకుండా.. చాలా రోజులు ఫ్రెష్​గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న కరివేపాకును శుభ్రంగా కడిగి జల్లెడలో వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆకుల మీద ఉన్న వాటర్ పోతుంది. ఆపై ఒక కాటన్ పొడి క్లాత్​ తీసుకొని ఆ ఆకులను దానిపై ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఆకులలో ఇంకేమైనా తేమ ఉంటే తొలగిపోయి పొడిగా మారతాయి.
  • ఇందుకోసం 2 నుంచి 3 గంటల సమయం పట్టవచ్చు. ఇలా కరివేపాకు ఆకులు పొడిగా మారాయనుకున్నాక.. ఒక గాలి చొరబడని డబ్బా తీసుకొని లోపల కొంత టిష్యూ పెట్టి ఆపై అందులో వాటిని వేసుకొని ఫ్రిజ్​లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కరివేపాకు త్వరగా వాడిపోకుండా, కుళ్లిపోకుండా ఉండి.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందంటున్నారు నిపుణులు.

కరివేపాకు తీసి పడేస్తున్నారా? - మీ ఆరోగ్యానికి ఎంత నష్టం చేసుకుంటున్నారో తెలుసా!

  • లేదంటే.. ఇలా చేసిన కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కరివేపాకును తేగానే కొమ్మల నుంచి ఆకులు వేరు చేసి వాటిని ఒక గాజు పాత్రలో వేసి రిఫ్రిజిరేటర్​లో స్టోర్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు కొన్ని ఆకులను తీసి కడిగి వంటలలో యూజ్ చేసుకోవాలి.
  • మరో చిట్కా ఏంటంటే.. మీరు మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చాక ముందుగా కొమ్మల నుంచి ఆకులను వేరు చేసుకోవాలి. ఆపై ఒక జిప్ లాక్ బ్యాగ్ తీసుకొని అందులో తేమను గ్రహించడానికి ఒక టిష్యూ వేసి ఆపై దానిలో వేరు చేసుకున్న కరివేపాకు ఆకులను స్టోర్ చేసుకోవాలి. అయితే, జిప్ లాక్ ఓపెన్ చేయడానికి అనుగుణంగా టిష్యూ వేసుకోవాలి. ఆపై కావాల్సినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు.
  • పైన చెప్పిన విధంగానే కాకుండా.. ఇలా స్టోర్ చేసుకున్న కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉంటుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. కరివేపాకులను శుభ్రంగా కడిగి 2 నుంచి 3 రోజులు సూర్యకాంతిలో ఉంచి, ఆపై వాటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత ఎయిర్​ టైట్​ కంటైనర్​లో పొడి వేసి.. ఆ డబ్బాను ఫ్రిజ్​లో ఉంచుకోవాలి. మీకు అవసరమైనప్పుడు ఆ పొడిని కూరల్లో వేసుకుంటే సరి.ఇది కనీసం 6 నెలల వరకు ఉంటుంది.

ముఖం తళతళ మెరిసిపోవాలా? కరివేపాకుతో ఈ ఫేస్​ప్యాక్​లు ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.