ETV Bharat / bharat

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు - పెరగనున్న మహిళలు - తగ్గనున్న యువత - INDIA POPULATION 2036 - INDIA POPULATION 2036

CSO Report On India Census 2036 : భారత దేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది. కేంద్ర గణాంకాలశాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసిన ‘ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2023’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

CSO Report On India Census 2036
CSO Report On India Census 2036 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 6:58 AM IST

CSO Report On India Census 2036 : భారత దేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనుంది. అందులో మహిళల నిష్పత్తి కొంత పెరగనుంది. కేంద్ర గణాంకాలశాఖ ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం 'ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2023' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5% మహిళలతో 121.1 కోట్లున్న దేశ జనాభా 2036 నాటికి 48.8% మహిళలతో 152.2 కోట్లకు చేరనుందని పేర్కొంది. ఇదే సమయంలో 15 ఏళ్లలోపు వయసున్నవారి సంఖ్య కొంతమేర తగ్గనుందని తెలిపింది. సంతాన సాఫల్యం తగ్గిపోవడమే అందుకు ప్రధాన కారణంగా చెప్పింది. ఇదే సమయంలో 60 ఏళ్లుపైబడిన వారి సంఖ్య భారీగా పెరగనున్నట్లు వెల్లడించింది. దీంతో 2036 నాటికి జనాభా పిరమిడ్‌లో అనూహ్య మార్పులు రానున్నాయని నివేదికలో పేర్కొంది. ఆ పిరమిడ్‌లో ప్రాథమిక భాగం తగ్గిపోయి, మధ్య స్థాయి భాగం విస్తృతం కానుందని తెలిపింది.

నివేదికలో పేర్కొన్న కీలక అంశాలు

  • 2036 నాటికి పని చేసే వయసున్న జనాభా పెరుగుతుంది. 2011లో 15-59 ఏళ్ల వయసున్న జనాభా 60.7 శాతం కాగా, 2036 నాటికి అది 64.9శాతానికి చేరనుంది.
  • 2011తో పోలిస్తే 2036 నాటికి జనాభాలో మహిళల నిష్పత్తి పెరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందికి 943 మంది మహిళలు ఉండగా, అది 2036 నాటికి 952కు పెరుగనుంది. ఇది లింగ సమానత్వానికి సానుకూల సంకేతం.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 37.7 కోట్ల ఉండగా, 2036 నాటికి 59.4 కోట్లకు చేరనుంది. అదే సమయంలో గ్రామీణ జనాభా 83.3 కోట్ల నుంచి 92.7 కోట్లకు పెరగనుంది.
  • 2011 లెక్కల ప్రకారం 10-14 ఏళ్ల వయసున్నవారు అత్యధికంగా 10.8 శాతం ఉండగా, 2036 నాటికి 35-39 ఏళ్ల వయసువారి సంఖ్య అత్యధికం (8.3 శాతం) కానుంది. 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 0.5% నుంచి 1.5 శాతానికి పెరగనుంది.

2050 నాటికి దేశంలో వృద్ధుల జనాభా డబుల్!

2060 నాటికి భారత జనాభా 170 కోట్లు- 63.3 కోట్లకు పడిపోనున్న చైనా! - un report on population

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.