ETV Bharat / bharat

జవాన్ల సాయంతో ఫలించిన నిరీక్షణ- 21ఏళ్ల తర్వాత తెరుచుకున్న రాముడి గుడి - Ram Temple Opened After 21 Years - RAM TEMPLE OPENED AFTER 21 YEARS

CRPF Opened Ram Temple After 21 Years : కొన్నేళ్లుగా మూతపడ్డ రామమందిరం తలుపులను తెరిచారు సీఆర్​పీఎఫ్​ సిబ్బంది. గ్రామస్థుల అభ్యర్థనతో దాదాపు 21 ఏళ్ల తర్వాత గుడిని తెరిచి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది.

Naxal Attack Ram Temple Opened By CRPF After 21 Years In Chattisgarh Sukma District

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 2:51 PM IST

CRPF Opened Ram Temple After 21 Years : కొన్ని సంవత్సరాల క్రితం నక్సల్స్​ మూయించిన ఓ రామాలయాన్ని తిరిగి తెరిచింది సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​- సీఆర్​పీఎఫ్​. గ్రామ ప్రజల కోరిక మేరకు దాదాపు 21 ఏళ్ల తర్వాత ఈ ఆలయం తలుపులను తిరిగి తెరిచారు. సంప్రోక్షణ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించి పూజలు జరిపించారు. అనంతరం గుడిని గ్రామస్థులకు అప్పగించారు. ఈ అరుదైన ఘటన ఛత్తీస్‌గఢ్​ సుక్మా జిల్లాలోని కెరళపెండా గ్రామంలో జరిగింది.

Naxal Attack Ram Temple Opened By CRPF After 21 Years In Chattisgarh Sukma District
ఆలయ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో సీఆర్​పీఎఫ్​ జవాన్.

21 ఏళ్ల తర్వాత తెరుచుకున్న గుడి
నక్సల్స్​ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఛత్తీస్​గఢ్ ఒకటి. ఇక్కడి సుక్మా జిల్లాలోని లఖాపాల్​​, కేరళపెండా గ్రామాల సమీపంలో 1970లో బిహారీ మహారాజు ఓ రామాలయాన్ని నిర్మించారు. అయితే గుడిలో ఎలాంటి పూజలు చేయకూడదని 2003లో నక్సల్స్​ ఈ ఆలయాన్ని మూసివేశారు. దీంతో వారు బెదిరింపుల కారణంగా అప్పటి నుంచి ఇప్పటివరకూ(21ఏళ్లు) ఏ ఒక్కరూ రాముడి గుడి తలుపులను తెరిచేందుకు సాహసించలేదు.

ఇదిలాఉంటే సీఆర్​పీఎఫ్​ 74వ బెటాలియన్​ కోసం ఓ శిబిరాన్ని(లఖాపాల్​ క్యాంప్​) కేరళపెండా గ్రామానికి సమీపంలో గతేడాది మార్చిలో ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలో తమ గ్రామంలో ఉన్న పురాతనమైన రామాలయం గురించిన వాస్తవాలను సీఆర్​పీఎఫ్​ సిబ్బందికి తెలియజేశారు గ్రామస్థులు. ఇది తెలుసుకున్న రక్షణ దళం అధికారులు ఎలాగైనా ఆలయాన్ని తిరిగి తెరిపించి ఎప్పటిలాగే పూజలు జరుపుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇలాగైనా మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ గ్రామప్రజలు జనజీవన స్రవంతిలో కలుస్తారని భావించారు. ఆ మేరకు తాజాగా తాళం వేసి ఉన్న మందిరం తలుపులను తెరిచి ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు. అనంతరం సదరు గ్రామ ప్రజల సాయంతో సంప్రదాయబద్ధంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత గుడిని బాధిత గ్రామ పెద్దలకు అప్పగించారు.

21 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రామాలయం ఇదే.

అయితే ఆలయ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సమకూర్చేందుకు గ్రామస్థులు అప్పట్లో సుమారు 80 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించారని సీఆర్​పీఎఫ్​ 74వ బెటాలియన్ కమాండెంట్ హిమాన్షు పాండే తెలిపారు. ఆ సమయంలో సరైన రహదారి, రవాణా సౌకర్యాలు కూడా లేని ఈ ప్రాంతానికి పదుల కిలో మీటర్లు నడిచి ఆలయ నిర్మాణంలో భాగమైన గ్రామస్థులను మెచ్చుకున్నారు. కాగా, ఇదంతా ఆ శ్రీరాముడిపై భక్తితోనే చేశామని చెబుతున్నారు కేరళపెండా గ్రామప్రజలు.

గుడిని అసలెందుకు ముసేశారు?
ఆలయాన్ని నిర్మించిన తర్వాత గ్రామస్థుల్లో చాలామంది వరకు మాంసం, మద్యానికి దూరంగా ఉన్నారట. గ్రామంలోని ప్రజలందరూ తమ మత విశ్వాసాలు, అలవాట్ల కారణంగా హింసకు ఆమడ దూరంలో ఉండేవారట. దీంతో గ్రామం నుంచి తమకు కావాల్సిన సహాయసహకారాలను పొందలేకపోయేవారు నక్సల్స్​. ఇలా ప్రజల మద్దతు కరువవ్వడం వల్ల ఆగ్రహం తెచ్చుకున్న నక్సలైట్లు 2003లో గ్రామంలోని రాముడి గుడికి తాళం వేశారు. పూజలు చేయడాన్ని నిషేధించారు.

ఆలయం నిర్మించిన కొత్తలో గ్రామంలో పెద్ద ఎత్తున జాతరను కూడా నిర్వహించేవారటు ప్రజలు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు. కానీ, నక్సల్స్ బెడద కారణంగా చివరకు ఆ జాతరకు కూడా బ్రేక్​ పడిందని చెబుతున్నారు ఇక్కడి ప్రజలు. ఇక రెండు దశాబ్దాలుగా మూతపడ్డ తమ గుడిని సీఆర్​పీఎఫ్​​ అధికారుల చొరవ చూపి తెరిపించడం వల్ల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కేరళపెండా గ్రామస్థులు.

ఎన్నికల్లో నా కుమారుడు ఓడిపోవాలి- కాంగ్రెస్ నా మతం: ఏకే ఆంటోనీ - AK Antony Son In Lok Sabha Polls

ఎన్నికల బరిలో ఒకే పేరుతో వేర్వేరు అభ్యర్థులు- పార్టీల అసలు వ్యూహమిదే! - Same Name Candidates In Bengaluru

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.