ETV Bharat / bharat

రెస్టారెంట్ స్టైల్​లో క్రిస్పీ కార్న్ - నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - Restaurant Style Crispy Corn Recipe

Crispy Corn Recipe : సాయంత్రం స్కూల్‌ నుంచి పిల్లలు ఇంటికి రాగానే మమ్మీ ఆకలేస్తోందని అంటారు. అలాంటప్పుడు పిల్లలకు సూపర్ స్నాక్ చేసిపెడితే ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. లేదంటే ఇంట్లో గొడవే! మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేస్తున్నారా? అయితే.. ఒక్కసారి ఈ క్రిస్పీ కార్న్ రెసిపీ ట్రై చేయండి.

Crispy Corn
Crispy Corn Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 3:52 PM IST

How To Make Crispy Corn Recipe At Home : తాజా మొక్కజొన్న గింజలను చాలా మంది ఉడికించుకుని తింటుంటారు. మరికొంత మంది గారెలు చేసుకుంటుంటారు. అయితే.. కార్న్‌తో ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈసారి రెస్టారెంట్‌ స్టైల్‌ క్రిస్పీ కార్న్‌ రెసిపీని ట్రై చేయండి. దీన్ని మీ పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా అందించారంటే.. నిమిషాల్లో ప్లేట్‌ ఖాళీ అయిపోవడం పక్కా! అంత బాగుంటుంది దీని టేస్ట్‌. ఈ రెసిపీని చాలా సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

క్రిస్పీ కార్న్​కు కావాల్సిన పదార్థాలు :

  • లీటర్ - వాటర్
  • 150 గ్రాములు - ఫ్రెష్ స్వీట్ కార్న్ గింజలు
  • 3 టేబుల్ స్పూన్లు - కార్న్ ఫ్లోర్
  • అరచెంచా - మిరియాల పొడి
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - కార్న్ ఫ్రైకి కావాల్సినంత
  • గార్లిక్‌, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు - కొద్దిగా
  • అరచెంచా- మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, వైట్ పెప్పర్ పొడి, సాల్ట్
  • రెండు చెంచాల - స్ప్రింగ్ ఆనియన్స్

ఛాయ్​ చేసినంత సులువుగా అద్దిరిపోయే "పనీర్ ఖీర్" - ఇలా ప్రిపేర్ చేసుకోండి

క్రిస్పీ కార్న్ తయారీ విధానం :

  • రెస్టారెంట్ స్టైల్​ క్రిస్పీ కార్న్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి.. ముందుగా తాజా స్వీట్ కార్న్ ఎంచుకొని వాటి గింజలను పూర్తిగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి.
  • కార్న్ ఎండితే టేస్టీగా ఉండదు. ఫ్రెష్ స్వీట్ కార్న్ గింజలయితే చక్కగా వేగి కరకరలాడుతాయి.
  • ఇప్పుడు స్టౌ మీద ఒక బౌల్ పెట్టి లీటర్ వాటర్ పోసుకోవాలి. అందులో గిల్లి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలను వేసి హై ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా 80% ఉడికించుకోవాలి.
  • అంటే.. మరీ మెత్తగా ఉడకకుండా కాస్త పలుకుగా ఉండేట్లు చూసుకోవాలి. ఒక గింజ నోట్లో వేసుకుని చూస్తే తెలిసిపోతుంది.
  • అలా ఉడికించుకున్నాక వెంటనే ఆ బౌల్​లోని వాటర్ వంపేసి.. అందులో చన్నీళ్లు పోసుకోవాలి. ఇలా చేయడం ద్వారా గింజలు మరింత మెత్తగా మారవు.
  • వాటిని చల్లారనిచ్చి ఆపై నీటి నుంచి గింజలు వడకట్టి మరో బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అరచెంచా బ్లాక్ పెప్పర్ పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అవన్నీ కార్న్​కి పట్టేలా బాగా కలుపుకోవాలి.
  • తర్వాత అందులో కాస్త వాటర్ వేసుకుని మరోసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు ఎక్కువైతే కార్న్ కరకరలాడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద ప్యాన్ పెట్టుకొని కార్న్ వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న కార్న్ వేసి మీడియం ఫ్లేమ్ మంట మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
  • అయితే.. కార్న్ నూనెలో వేయించుకునేటప్పుడు ఒక్కోసారి పేలతాయి. కాబట్టి ఆ టైమ్​లో కడాయి మీద స్ట్రైనర్ లేదా మూత పెట్టుకుంటే నూనె చిందకుండా ఉంటుంది.
  • అలా కార్న్ క్రిస్పీగా మారే వరకు వేయించుకున్నాక ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత స్టౌపై మరో పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక కొద్దిగా అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసుకొని అవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • ఇప్పుడు వేయించి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ అందులో వేసి హై ఫ్లేమ్ మీద కాసేపు టాస్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అరచెంచా బ్లాక్ పెప్పర్ పొడి, చిల్లీ ఫ్లేక్స్, వైట్ పెప్పర్ పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి.
  • చివరగా దింపే ముందు రెండు చెంచాల స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసుకొని కాసేపు టాస్ చేసుకుని దించుకుంటే చాలు. నోరూరించే.. క్రిస్పీ క్రిస్పీగా ఉండే కార్న్ రెడీ!

5 నిమిషాల్లో అద్దిరిపోయే మిరియాల చారు - సీజనల్​ జ్వరాలకు సూపర్ రెమిడీ!

స్ట్రీట్​ ఫుడ్​ టేస్ట్ ఇంట్లో! - ఉల్లి పకోడీలు ఇలా చేసుకుంటే అద్దిరిపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.