ETV Bharat / bharat

బీజేపీకి ఓట్లు తగ్గడానికి కారణం ఆ పద్ధతులే- ఇప్పటికైనా మెరుగ్గా పాలించండి: సీపీఎం - Lok Sabha Results 2024 - LOK SABHA RESULTS 2024

CPM On Lok Sabha Results 2024 : మోదీ ప్రభుత్వం అవలంబించిన ఫాసిస్ట్‌ పద్ధతులే ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం తగ్గడానికి కారణమని సీపీఎం అభిప్రాయపడింది. ఈ ఎన్నికల్లో వామపక్షాలు స్వల్పంగా తమ ఉనికి మెరుగుపరుచుకున్నాయని తెలిపింది. కానీ కేరళలో ఎన్నికల పనితీరుపై పార్టీ నిరాశ వ్యక్తం చేసింది.

CPIM On Lok Sabha Results 2024
CPIM On Lok Sabha Results 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 5:16 PM IST

CPM On Lok Sabha Results 2024 : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని వామపక్ష పార్టీ సీపీఎం వ్యాఖ్యానించింది. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించడంలో కమలం పార్టీ పూర్తిగా విఫలమైందని, దీనికి మోదీ ప్రభుత్వం అవలంబించిన ఫాసిస్ట్‌ పద్ధతులే కారణమని ఆరోపించింది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం హిందుత్వ నిరంకుశత్వాన్ని వీడి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని హితవు పలికింది. దిల్లీలో సోమవారం జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షించింది.

ఓట్ల శాతం పెరిగినా!
2024 ఎన్నికల్లో వామపక్షాలు స్వల్పంగా తమ ఉనికి మెరుగుపరుచుకున్నాయని వెల్లడించింది. కేరళలో ఎన్నికల పనితీరుపై మాత్రం నిరాశ వ్యక్తం చేసింది. 18వ లోక్‌సభను ఏర్పాటు చేసేందుకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో పేర్కొంది. దేశ ప్రజలు రాజ్యాంగాన్ని, లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించారని, బీజేపీకి మెజార్టీ ఇవ్వకుండా హెచ్చరిక చేశారని తెలిపింది. 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించిన ఎన్డీఏ, ఈ ఎన్నికల్లో మాత్రం సంకీర్ణ ప్రభుత్వానికే పరిమితమైందని గుర్తు చేసింది. చార్‌ సౌ పార్‌ అంటూ నినదించిన కమల దళం కేవలం 240 సీట్లే సాధించిందని, కాషాయ పార్టీకి మెజారిటీ కన్నా 32 సీట్లు తక్కువగా ఉన్నాయని సీపీఎం గుర్తు చేసింది.

తగ్గిన ఓట్ల శాతం
భారత ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, ఎన్డీఏకు 43.31 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇండియా బ్లాక్‌కు 41.69 శాతం ఓట్లు వచ్చాయి. రెండు కూటముల మధ్య ఓట్ల శాతంలో తేడా 2 శాతమేనని సీపీఎం గుర్తు చేసింది. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం, ప్రతిపక్ష పార్టీలపై దాడులు, అర్థ, అంగ బలాల మధ్య సార్వత్రిక ఎన్నికలు జరిగాయని వామపక్ష పార్టీ ఆరోపించింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పౌర హక్కుల రక్షణ, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం వంటి ప్రజల జీవనోపాధికి సంబంధించిన సమస్యలపై ప్రతిపక్ష ఇండియా కూటమి దృష్టి సారించిందని తెలిపింది.

తస్మాత్‌ జాగ్రత్త!
హిందుత్వ నిరంకుశ పోకడలు, హిందుత్వ- కార్పొరేట్ బంధాన్ని బలోపేతం చేసే చర్యలు, మోదీ అప్రజాస్వామ్య విధానాలను ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి పార్టీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. సామాజిక న్యాయం, సమాఖ్యవాద భావాలతో ముందుకు సాగాలని సూచించింది. రాబోయే రోజుల్లో ఫాసిస్టు పద్ధతులను ఉపయోగించే హిందుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు లోపల, వెలుపల పోరాటాన్ని బలోపేతం చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.