ETV Bharat / bharat

కాంగ్రెస్, ఆప్ మధ్య డీల్​ ఫైనల్- దిల్లీలో ఎవరికెన్ని సీట్లంటే? - 2024 లోక్​సభ ఎన్నికలు దిల్లీ

Congress AAP Seat Sharing Finalised : కాంగ్రెస్, ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయినట్లు సమాచారం. త్వరలో ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారంటే?

Congress AAP Seat Sharing Finalised
Congress AAP Seat Sharing Finalised
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 1:20 PM IST

Updated : Feb 22, 2024, 2:21 PM IST

Congress AAP Seat Sharing Finalised : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దిల్లీలో పోటీ చేసే స్థానాలపై కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కుదిరినట్లు తెలుస్తోంది. ఆప్‌ నాలుగు, కాంగ్రెస్‌ 3స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు ఇరుపార్టీలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీ, దక్షిణ దిల్లీ, పశ్చిమ దిల్లీ, ఉత్తర దిల్లీ లోక్‌సభ స్థానాల్లో ఆప్‌ పోటీ చేయనుండగా చాందినీ చౌక్‌, తూర్పు దిల్లీ, ఈశాన్య దిల్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో హస్తం పోటీ చేసేలా ఇరుపార్టీలు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఇవ్వడానికి ఇండియా కూటమి గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. అయితే ఇటీవల గుజరాత్, గోవా, అసోంలలో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించడం గమనార్హం. ఇటీవలే ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీ(ఎస్​పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్ పార్టీ 17 సీట్లలో పోటీ చేయనుంది. మిగతా స్థానాల్లో ఎస్​పీ, భాగస్వామ్య పక్షాలు బరిలో దిగనున్నాయి. అయితే వరుస షాక్​లు తగులుతున్న ఇండియా కూటమికి ఈ ఒప్పందాల వల్ల కాస్త ఊరట లభించినట్లైంది.

ఈసారి జెండా పాతాల్సిందే!
ఈ లోక్​సభ ఎన్నికలను ఆమ్​ ఆద్మీ పార్టీ చాలా కీలకంగా భావిస్తోంది. ఆప్​ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గతేడాది ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పనితీరు అంత బాగోలేదు. దీంతో ఈ లోక్​సభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్​గా మారాయి. అయితే దిల్లీ, పంజాబ్ గుజరాత్, గోవా, హరియాణాలో తమ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని ఆప్​ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సీట్లు గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

అంతకుముందు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఈ రెండు పర్యాయాలు ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక గత ఎన్నికల్లో దిల్లీలోని మొత్తం ఏడు లోక్​సభ నియోజకవర్గాల్లో ఐదింటిలో ఆప్​ మూడో స్థానంలో నిలిచి 18.2 శాతం ఓట్లు సాధించింది. ఇక కాంగ్రెస్​కు 22.6 శాతం, బీజేపీకి 56.9 శాతం ఓట్లు వచ్చాయి.

ఎస్​పీ, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు- ఆప్​తో మరో 2రోజుల్లో ఫైనల్​! మరిన్ని రాష్ట్రాలపై ఫోకస్

ఇండియా కూటమికి మరో షాక్​! ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన ఆప్

Last Updated : Feb 22, 2024, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.