ETV Bharat / bharat

తొమ్మిదోసారి సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణం- డిప్యూటీలుగా సామ్రాట్, విజయ్ - bihar politics news live

CM Nitish Kumar Swearing Ceremony : నాటకీయ పరిణామాల మధ్య బిహార్‌ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆర్​జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

CM Nitish Kumar Swearing Ceremony
CM Nitish Kumar Swearing Ceremony
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 5:06 PM IST

Updated : Jan 28, 2024, 6:58 PM IST

CM Nitish Kumar Swearing Ceremony : జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ మరోసారి బిహార్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నీతీశ్​తోపాటు బీజేపీ నాయకులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాను డిప్యూటీ ముఖ్యమంత్రులుగా రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర ప్రమాణం చేయించారు. మరో ఎనిమిది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో జరిగిన నీతీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలు హాజరయ్యారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్​జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

నీతీశ్‌కు ప్రధాని మోదీ అభినందనలు
బిహార్‌లో ఎన్డీయే సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేదిశగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నీతీశ్ కుమార్‌, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేసిన సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ సిన్హాకు అభినందనలు తెలిపారు. ఈ కొత్త బృందం రాష్ట్రంలోని ప్రజలందరికీ నిబద్ధతతో సేవలందిస్తుందన్న నమ్మకం ఉందని ట్వీట్‌ చేశారు.

ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి, డిప్యూటీలు సీఎంలు మీడియాతో మాట్లాడారు. "మేం కలిసి ఉంటాం. 8మంది నాయకులు నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వారు త్వరలో చేస్తారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు" అని నీతీశ్ తెలిపారు. బిహార్​లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామమని డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి చెప్పారు. "ప్రధాని మోదీతోపాటు బీజేపీ అధిష్ఠానం నాపై విశ్వాసం చూపింది. నేను వారి నమ్మకాన్ని నిలబెడతాను" అని విజయ్ సిన్హా తెలిపారు.

  • बिहार में बनी एनडीए सरकार राज्य के विकास और यहां के लोगों की आकांक्षाओं को पूरा करने के लिए कोई कोर-कसर नहीं छोड़ेगी। @NitishKumar जी को मुख्यमंत्री और सम्राट चौधरी जी एवं विजय सिन्हा जी को उप मुख्यमंत्री पद की शपथ लेने पर मेरी बहुत-बहुत बधाई।

    मुझे विश्वास है कि यह टीम पूरे…

    — Narendra Modi (@narendramodi) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతకుముందు బిహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్రను జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేశారు. దీంతో గవర్నర్‌ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వారిని ఆహ్వానించారు. నీతీశ్‌ కుమార్​ వెంట పలువురు బీజేపీ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు.

'ఇండియా కూటమిని హైజాక్‌ చేయడానికి కాంగ్రెస్​ ట్రై'
"డిసెంబర్‌ 19న అశోకా హోటల్‌లో జరిగిన సమావేశంలో కొందరు కాంగ్రెస్‌ నాయకులు ఇండియా కూటమిని హైజాక్‌ చేయడానికి ప్రయత్నించారు. దీనిలో భాగంగానే నాయకత్వ బాధ్యతలను ఖర్గేకు కట్టబెట్టారు. వాస్తవానికి అంతకు ముందు ముంబయిలో జరిగిన సమావేశంలో కూటమి నాయకత్వం ఎవరికీ ఇవ్వకుండానే సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. కానీ, అశోకా హోటల్‌లో టీఎంసీ నేత మమతా బెనర్జీతో కలిసి ఖర్గే పేరును తెరపైకి తెచ్చారు. ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలని ప్రయత్నించారు" ఆ జేడీయూ నేత కేసీ త్యాగి ఆరోపించారు.

ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ
అయితే గతకొద్దిరోజులుగా బిహార్​లో రాజకీయాలు శరవేగంగా మారాయి. జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ తిరిగి ఎన్​డీఏ గూటికి చేరే అవకాశాలున్నట్లు తెగ వార్తలు వచ్చాయి. ఇప్పడదే జరిగింది. నీతీశ్ ఇలా కూటములు మార్చడం ఇది తొలిసారి కాదు. నీతీశ్‌ తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ గూటికి చేరనుండటం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఎన్​డీఏలోకి వెళ్లాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా జేడీయూకు ప్రయోజనకరమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Last Updated : Jan 28, 2024, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.