Child Fell In Borewell Gujarat : గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రమాదవశాత్తు 15 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడిని సురక్షితంగా కాపాడారు అధికారులు. దాదాపు 6 గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించి బాలుడిని బోరుబావి నుంచి బయటకు తీశాయి. వెంటనే ఘటనాస్థలిలో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో చిన్నారిని జామ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అధికారులు. కాగా, వ్యవసాయ భూమిలో ఆడుకుంటున్న చిన్నారి తెరిచి ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడని జామ్‌నగర్ కలెక్టర్ బీకే పాండ్య తెలిపారు.
అసలేం జరిగిందంటే?
మంగళవారం సాయంత్రం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గోవానా గ్రామానికి చెందిన రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో జిల్లా అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సహాయక చర్యలు ప్రారంభించాయి. దాదాపు 6 గంటలపాటు శ్రమించి బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశాయి.
-
#UPDATE | Gujarat: A child who fell into a borewell in Jamnagar's Govana village, has been rescued safely. https://t.co/xqdtlbseNZ pic.twitter.com/6rZaXcmDMB
— ANI (@ANI) February 7, 2024
'బోరుబావిలో పడిన చిన్నారికి సమయానికి ఆక్సిజన్‌ను సరఫరా చేశాం. లోపల పడ్డ అతడిని చేరుకునేందుకు సమాంతరమైన గొయ్యిని తవ్వించాం. ప్రస్తుతం జామ్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉంది' అని కలెక్టర్ వివరించారు.
రక్షించిన గంటలోపే
Borewell Rescued Girl Died : గతనెల కూడా గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో మూడేళ్ల ఏంజెల్ సఖ్రా అనే బాలిక బోరుబావిలో పడిపోయింది. ఎనిమిది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు ఆ చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు. అయితే చికిత్స నిమిత్తం ఖంభాలియా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న తరుణంలో ఆ బాలిక మృతి చెందింది. రక్షించిన గంటలోపే చిన్నారి మరణించడం బాధిత తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బోరుబావి బాధిత చిన్నారుల కోసం కెమెరా!
Engineer Developed Camera For Borewell Rescue Operations : బోరుబావిలో పడిన వారిని కాపాడేందుకు ఒడిశాకు చెందిన ఓ ఇంజనీర్ ఇటీవలే ఓ కెమెరాను తయారు చేశారు. ఈ కెమెరాకు 50 అడుగుల లోతులో ఉన్న బావిలోకి వెళ్లి ఆడియో, వీడియోలను రికార్డు చేయగలగే సామర్థ్యం ఉంది. అతి తక్కువ ఖర్చుతో దీనిని అభివృద్ధి చేశానని, దీని తయారీకి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే పట్టిందని కెమెరా రూపొందించిన ఇంజనీర్ తెలిపారు. దీనికి రూ.10 వేల ఖర్చయిందని చెప్పారు. మరి దీనికి సంబంధించి ఫీచర్స్‌తో పాటు ఈ కెమెరాను తయారు చేసిన వ్యక్తికి సంబంధించిన ప్రత్యేక కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
'పవర్'ఫుల్ లిఫ్టర్- 80 కేజీలు ఎత్తేస్తున్న బుడతడు- ఆరేళ్లకే 17 మెడల్స్
'భారత్- మయన్మార్ బోర్డర్లో 1643 కిలోమీటర్ల ఫెన్సింగ్- పటిష్ఠమైన గస్తీ'