Chhindwara Murder Case : మధ్యప్రదేశ్ ఛింద్వాడాలో ఓ వ్యక్తి తన కుటుంబంలోని ఎనిమిది మందిని గొడ్డలితో నరికి చంపాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.
ఇది జరిగింది
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, బోదల్ కఛార్ గ్రామానికి చెందిన దినేశ్ సరియం(26) మొదట తన భార్యను గొడ్డలితో నరికి ఆపై తల్లి, సోదరుడు, సోదరిని, వారి పిల్లలను ఒక్కొక్కరిని హత్య చేశాడు. ఆ తర్వాత నిద్రిస్తున్న ఇద్దరు మేనకోడళ్లను గొడ్డలితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం తన మేనమాన కుమారుడి(10)పై దాడి చేస్తుండగా అతడి నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడు. ఆ తర్వాత ఇంటి పక్కన వారికి జరిగినందంతా చెప్పాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కోసం వెతకడానికి ప్రయత్నించారు. అయితే అతడు చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో జరిగిందని ఆ బాలుడు తెలిపాడు. ఇక దినేశ్‌కు మే 21నే వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు దర్యాప్తు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.
భార్యను ముక్కలుగా నరికి చంపిన భర్త
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. కుణిగల్ తాలూకాలోని హులియురుదుర్గ పట్టణానికి చెందిన శివరామ్ తన భార్య పుష్ప(32), 8ఏళ్ల చిన్నారితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి వంటగదిలో ఉన్న పుష్ప తల, శరీర భాగాలను కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని శివరామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
కేరళలో తండ్రి, కొడుకులు ఆత్మహత్య
కేరళలో ఓ వ్యక్తి, తన నాలుగేళ్ల కుమారుడు అనుమానాస్పద రీతిలో ఉరి వేసుకుని మరణించారు. మంగళవారం రాత్రి ఆ వ్యక్తికి ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఇంటి పక్కన వాళ్లు బుధవారం ఉదయం వెళ్లి చూసేసరికి తండ్రీకొడుకులిద్దరూ ఇంట్లో ఉరి వేసుకుని కనిపించారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. హత్య లేక ఆత్మహత్య కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.