CEC On Election Promises : రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు విషయంలో సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసే హక్కు పార్టీలకు ఉందని చెప్పారు. పార్టీల హామీలపై ఎన్నికల సంఘం ఒక నమూనా పత్రాన్ని సిద్ధం చేసిందని, అయితే ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ఎన్నికల్లో నగదు, ఉచితాల పంపిణీని నిరోధించాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించామని చెప్పారు. ఆన్‌లైన్ లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యతలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు(NPCI) అప్పగించామని తెలిపారు. ఈ మేరకు చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల తేదీలపై జరుగుతున్న ఫేక్ న్యూస్‌పై స్పందించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. 'ఎన్నికల తేదీలు ప్రకటించారని ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వార్తకు వివరణ ఇచ్చాం. తమిళనాడులో మెజార్టీ రాజకీయ పార్టీలు ఒకే దశ ఎన్నికలను కోరుతున్నాయి. ఎన్నికల సంఘం బృందం తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలను కలిసింది. ఆయా పార్టీలు తమిళనాడు ఒకే దశలో ఎన్నికలు, నగదు, ఉచితాల పంపిణీని అరికట్టమని కోరాయి. మద్యం పంపిణీ, ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ కాకుండా అరికట్టాలని కోరాయి.' అని రాజీవ్ కుమార్ తెలిపారు.
రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు
ఎన్నికల నిబంధనల్లో భాగంగా చేసిన బదిలీల్లో మభ్యపెట్టే ప్రయత్నాలు చేయొద్దని రాష్ట్రాలను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఉద్దేశపూర్వంగా ఈ తరహా ప్రయత్నాలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. మార్గదర్శకాల్లో భాగంగా 3 ఏళ్లు సర్వీసు దాటిన అధికారుల బదిలీలు ఒకే పార్లమెంటు నియోజకవర్గంలో ఉండకూడదని స్పష్టం చేసింది. కొన్ని చోట్ల జిల్లాలు మార్చినట్టు చూపించి ఒకేపార్లమెంటు నియోజకవర్గంలో బదిలీలు చేసినట్టు వెల్లడించింది. ఇది ఎన్నికల మార్గదర్శకాల స్పూర్తికి విఘాతమని తెలిపింది. ఆ తరహా బదిలీలు చేస్తే తగిన చర్యలు చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. సదరు అధికారులు ఎన్నికల విధులకు ఆటంకం కలిగించకుండా ఈసీఐ పటిష్ఠమైన చర్యలు చేపడుతుందని స్పష్టంచేసింది. ఇప్పటి వరకూ చేసిన అన్నిబదిలీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. ఎన్నికల్లో సమానఅవకాశాలు లేకుండా చేసే వారిపట్ల ఏమాత్రం ఉపేక్షించేదిలేదని తేల్చిచెప్పింది.
జులై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు : కేంద్రం
పరివార్‌వాదం, అవినీతి, బుజ్జగింపులకు మించి కాంగ్రెస్ ఆలోచించదు: మోదీ