ETV Bharat / bharat

ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం- కాలేజీ పరిశోధనకు పేటెంట్

CC Road Construction With Waste Plastic : పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలలో సీసీరోడ్లు నిర్మించారు కొందరు పరిశోధకులు. ఈ రోడ్డు సాధారణ తారు రోడ్ల కంటే ఎక్కువ కాలం వరకు ఉంటాయని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని తెలిపారు. మరి ఆ ప్లాస్టిక్ రోడ్డు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

Plastic Road Patent
Plastic Road Patent
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 2:08 PM IST

ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు- పరిశోధనకు పేటెంట్ హక్కులు

CC Road Construction With Waste Plastic : పర్యావరణానికి సవాల్​ విసురుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో సీసీరోడ్లు నిర్మించారు కొందరు పరిశోధకులు. తక్కువ ఖర్చులోనే, ఎక్కువ కాలం మన్నికగా ఉండేటట్లుగా రోడ్డును రూపొందించారు. వారు చేసిన పరిశోధనకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్​ కూడా లభించింది. మరి ఆ పరిశోధకులు ఎవరో? ఆ రోడ్డు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా.

Plastic Road Patent
ప్లాస్టిక్​ వ్యర్థాలతో రోడ్డు ప్రయోగానికి పేటెంట్ హక్కుపత్రం

ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే రోడ్డు నిర్మాణం చేసే విధానాన్ని మహారాష్ట్రలోని అమరావతిలోని రామ్​మేఘ ఇంజినీరింగ్ కళాశాల పరిశోధకులు రూపొందించారు. స్థానిక ఇన్నోవేటివ్ ఎంటర్​ప్రెన్యూర్​ బోర్డ్​ భాగస్వామ్యంతో ఈ పరిశోధనలు చేశారు. అయితే ఈ రకమైన పరిశోధన ఆఫ్రికాలో 2005లోనే జరిగింది. దీని ఆధారంగా ఐఐటీ ఖరగ్​పుర్ 2010-12 మధ్యకాలంలో ఇలాంటి పరిశోధనలు చేపట్టింది. అయితే ఈ పద్ధతినే మరింత అభివృద్ధి చేశారు రామ్​మేఘ ఇంజినీరింగ్ కళాశాల పరిశోధక బృందం.

Plastic Road Patent
ప్లాస్టిక్​ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం

Plastic Cell Filled Concrete Pavement : రామ్​మేఘ ఇంజినీరింగ్ కళాశాల అర్కిటెక్చర్​ ప్రొఫెసర్ డాక్టర్​ శ్రీకాంత్​ హర్లే ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. ప్లాస్టిక్​ వ్యర్థాలను సెల్స్​ ఆకారంలో తయారు చేస్తారు. వాటిని సీసీరోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తారు. 'ప్లాస్టిక్​ సెల్స్​ను కాంక్రీట్ రోడ్డు నిర్మాణంలో ఉపయోగించుకోవచ్చు. తారు రోడ్డుతో పోలిస్తే ప్లాస్టిక్​ సెల్స్​తో రోడ్డును నిర్మించడానికి 20 శాతం ఖర్చు తక్కువ అవుతుంది. అతేకాకుండా దాదాపు 20 సంవత్సరాల వరకు రోడ్డు చెక్కు చెదరకుండా ఉంటుంది. త్వరలోనే మా కళాశాల ప్రతినిధి బృందం కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలవనుంది. ఈ పద్ధతిలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరనున్నాం' అని ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు.

Plastic Road Patent
ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం

సీసీరోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్​ సెల్స్​ను ఉపయోగించడం ద్వారా రోడ్డు మరింత పటిష్టంగా ఉంటుందిని పరిశోధకులు తెలియజేశారు. దేశాభివృద్ధికి ఈ పరిశోధన ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా మనదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ఖర్చుతో రోడ్లు నిర్మించేందుకు అవకాశం ఏర్పడుతుందిని వివరించారు.

కోడి ఈకలతో పర్యావరణ హిత ప్లాస్టిక్- ఎరువుగా కూడా వాడుకోవచ్చట!

రైతుగా తండ్రి కష్టం చూశాడు - సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.