Minor Strange Revenge On Lover : తాను ప్రేమించిన 22ఏళ్ల ట్యూషన్ టీచర్ తనను దూరం పెట్టందనే అక్కసుతో ఓ మైనర్ ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి అడ్రస్‌కు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్‌లైన్ ఆర్డర్స్, 77 ఓలా, ఉబెర్ రైడ్స్‌ను బుక్ చేసి మరి వేధించాడు. ఆ ఆర్డర్స్‌కు సమాధానం చెప్పలేక విద్యార్థిని కుటుంబం సతమతం అవుతుంటే చూసి రాక్షసానందం పొందాడు. చివరికి ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది
గుర్తు తెలియని ఫోన్ నంబరు నుంచి ఎవరో తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ ఈ నెల 2న చెన్నై శివార్లలోని పెరియామెట్ పట్టణానికి చెందిన 22 ఏళ్ల యువతి తన తండ్రితో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన కుమార్తెకు అనుమానిత ఫోన్ నంబరు ద్వారా అమెజాన్, ఫ్లిప్‌కార్డ్, స్విగ్గీల నుంచి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ ఇంటికి ఏవేవో వస్తువులను పంపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ఈ మెయిల్ ఆధారంగా అతడిని అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 2 సెల్‌ఫోన్లను, వైఫై రూటర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ చేయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు
ఈ కేసులో నిందితుడిగా ఉన్న 17ఏళ్ల అబ్బాయిని విచారించగా యువతి దగ్గరకే ఆ బాలుడు ట్యూషన్‌కు వెళ్లేవాడని చెప్పాడు. 'ఆ సమయంలోనే మేమిద్దరం ప్రేమలో పడ్డాం. ఈ విషయం ఆమె పేరెంట్స్‌కు తెలిశాక, ఆమె నాతో మాట్లాడటం మానేసింది. దూరంగా ఉండటం మొదలుపెట్టింది. అందుకే కోపమొచ్చి వేధించడం మొదలుపెట్టాను. కోపంతోనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీల నుంచి వాళ్ల ఇంటికి వందలాదిగా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టాను. ఆ ఇంటి అడ్రస్, లొకేషన్‌లతో 77 సార్లు ఓలా, ఉబెర్ రైడ్స్‌ను బుక్ చేసి సతాయించాను' అని పోలీసులకు విచారణలో నేరం ఒప్పుకున్నాడు నిందితుడు.
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ - ఉగ్రవాది హతం
'నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు'- సుప్రీంకోర్టు తీర్పు - SC on NEET UG Paper Leak