ETV Bharat / bharat

చెరకు గిట్టుబాటు ధర పెంపు- గాడిదల సంరక్షణకు కేంద్రం ప్రోత్సాహకాలు - కేబినెట్ నిర్ణయాలు ఈరోజు

Cabinet Decision Today : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. చెరకు గిట్టుబాటు ధరను రూ.340కి పెంచింది. మహిళల రక్షణ కోసం అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గాడిదలు, ఒంటెలు, గుర్రాల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టింది.

Cabinet Decision Today
Cabinet Decision Today
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 6:33 AM IST

Updated : Feb 22, 2024, 6:53 AM IST

Cabinet Decision Today : ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 సీజనుకు సంబంధించి గతంతో పోలిస్తే చెరకు గిట్టుబాటు ధరను క్వింటాల్‌కు 25 రూపాయలు పెంచి 340 చేసింది. 2023-24తో పోలిస్తే ఇది 8 శాతం అధికం. సవరించిన ధరలు 2024 అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మహిళల రక్షణ కోసం రూ.1,179 కోట్లతో అంబ్రెల్లా పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో రూ.885 కోట్లను కేంద్ర హోంశాఖ బడ్జెట్ నుంచీ, రూ.294 కోట్లను నిర్భయ నిధి ద్వారా సమకూరుస్తుంది. ఈ పథకం కింద 112 అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ 2.0ను కొనసాగిస్తారు.

లైవ్​స్టాక్ మిషన్​లో మార్పులు
దేశంలో గాడిదలు, గుర్రాలు, ఒంటెల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్రం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్‌లో మార్పులు చేసింది. వాటి సంరక్షణకు ఔత్సాహికులను ప్రోత్సహించడానికి 50% మూలధన సబ్సిడీ ఇవ్వనుంది. వీర్య కేంద్రాలు, పునరుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు 10కోట్ల వరకూ ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. పశువుల బీమా కార్యక్రమాన్ని సరళీకరించిన ప్రభుత్వం- లబ్దిదారులు చెల్లించాల్సిన ప్రీమియంను 15శాతానికి తగ్గించింది.

స్పేస్​కు 100 శాతం ఎఫ్​డీఐ
అంతరిక్ష రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిచ్చింది. విదేశీ పెట్టుబడులు, కంపెనీలను ఆకట్టుకునేందుకు శాటిలైట్ల విడిభాగాల తయారీ రంగంలో 100 శాతం ఎఫ్​డీఐలకు అనుమతించింది. ఈ నిర్ణయం ప్రకారం శాటిలైట్ రంగాన్ని మూడు కేటగిరీలుగా విభజిస్తారు. ప్రతి కేటగిరీలో అనుమతించే పెట్టుబడుల గరిష్ఠ పరిమితిని నిర్ణయిస్తారు. ఈ పరిమితికి మించిన పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి అవసరం. ఇప్పటివరకు శాటిలైట్ల ఎస్టాబ్లిష్​మెంట్, ఆపరేషన్ల విభాగంలో ప్రభుత్వ మార్గాల ద్వారానే 100 శాతం పెట్టుబడులకు ఆస్కారం ఉండేది. ఈ విధానాన్ని సవరించి శాటిలైట్ల డేటా ప్రోడక్ట్​లు, యూజర్ సెగ్మెంట్ల రంగంలోనూ వంద శాతం పెట్టుబడులకు అనుమతించనున్నారు.

రైతులతో చర్చలకు రెడీ
తమ డిమాండ్ల సాధనకు దిల్లీ చలో పేరిట దేశ రాజధానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులతో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన- రైతుల ఆదాయం పెరిగేందుకు మోదీ సర్కారు అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. 'గతంలోనూ చర్చలకు మేం సంసిద్ధత వ్యక్తం చేశాం. ఇప్పుడూ అంతే. భవిష్యత్​లో కూడా రైతులతో చర్చలకు సిద్ధమే. మాకు ఏం సమస్య లేదు. వారు మా సహోదరులు, అన్నదాతలు' అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

'దిల్లీ చలో'కు రెండు రోజులు బ్రేక్- బుల్లెట్​ తగిలి ఓ యువరైతు మృతి- యుద్ధ భూమిలా సరిహద్దు!

గాడిదల ఫామ్‌తో లాభాలే లాభాలు - ఈ అమ్మాయి నెల సంపాదనెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Last Updated : Feb 22, 2024, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.