ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉపఎన్నికలు - మెజారిటీ స్థానాల్లో NDA గెలుపు - BYPOLL ELECTION 2024

13 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు - మెజారిటీ స్థానాల్లో ఏన్​డీఏ గెలుపు

Bypoll Election Results 2024
Bypoll Election Results 2024 (ETV Bharat, Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 7:33 PM IST

Bypoll Election Results 2024 : దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీల ఖాతాలోనే పడ్డాయి. అసోం, బిహార్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మెజారిటీ స్థానాలను ఎన్​డీఏ గెలుచుకోగా, బంగాల్​లోని ఆరుకు ఆరు స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. కర్ణాటకలో మూడింటికి మూడు స్థానాలూ కాంగ్రెస్‌ వశమయ్యాయి.

రాష్ట్రాల వారీగా ఉప ఎన్నికలు ఫలితాలు

  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిలో బీజేపీ విజయం సాధించింది. 2 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు వశం చేసుకోగా ఒక చోట బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్‌ సత్తా చాటింది.
  • రాజస్థాన్‌లోని 7 స్థానాల్లో ఐదింటిలో బీజేపీ విజయ దుందుభి మోగించింది. దౌసాలో కాంగ్రెస్‌ గెలుపొందగా, చోరాసిని BADVP చేజిక్కించుకుంది.
  • బంగాల్​లోని ఆరింటికి ఆరు స్థానాలూ మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఖాతాలోనే పడ్డాయి. కోల్‌కతా హత్యాచార ఘటన నేపథ్యంలోనూ టీఎంసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం గమనార్హం.
  • అసోంలోని 5 స్థానాల్లో మూడు చోట్ల బీజేపీ జెండా ఎగరవేసింది. ఏజీపీ, యూపీపీఎల్ చెరో స్థానంలో విజయం సాధించాయి.
  • పంజాబ్​లో 4 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో మూడింటిని ఆప్‌, ఒకదాన్ని కాంగ్రెస్‌ సొంతం చేసుకున్నాయి.
  • బిహార్​లోని 4 శాసనసభ స్థానాల్లో 3 స్థానాలను అధికార ఎన్​డీఏ కైవసం చేసుకుంది. ఒకస్థానంలో హెచ్​ఏఎం పైచేయి సాధించింది.
  • కర్ణాటకలోని మొత్తం 3 స్థానాల్లోనూ అధికార కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది.
  • మధ్యప్రదేశ్​లోని 2 అసెంబ్లీ స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్‌, మరొకదాన్ని బీజేపీ గెలుచుకున్నాయి.
  • కేరళలోని పాలక్కాడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందగా, చెలక్కర వామపక్షం (ఎల్​డీఎఫ్) ఖాతాలో పడిపోయింది.
  • ఉత్తరాఖండ్, ఛత్తీస్​గఢ్​, గుజరాత్‌లోని ఒక్కో స్థానం బీజేపీ సొంతమయ్యాయి.
  • మేఘాలయలోని ఒక స్థానంలో ఎన్‌పీపీ అభ్యర్థి, సీఎం కాన్రాడ్‌ సంగ్మా సతీమణి మెహ్తాబ్‌ సంగ్మా విజయం సాధించారు.
  • సిక్కింలో రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగగా, ఆ రెండింటిని అధికార సిక్కిం క్రాంతికార మోర్చా ఏకగ్రీవంగా గెలుచుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.