Bus Fire Accident In Haryana : హరియాణాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 9మంది సజీవ దహనం అయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి నుహ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, పంజాబ్ చండీగఢ్‌కు చెందిన 60మంది మధుర, బృందావన్‌ను సందర్శించేందుకు ఓ టూరిస్ట్ బస్సులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నుహ్ జిల్లా తావడు పట్టణ సమీపంలోని కుండలీ మానేసర్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది సజీవ దహనం కాగా, మరో 24 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అయితే ఇంకా మృతులు గుర్తించలేదని పేర్కొన్నారు.
-
#WATCH | Haryana: Several people injured after the bus they were travelling in caught fire in Nuh. The injured have been brought to Nuh Medical College.
— ANI (@ANI) May 18, 2024
More details awaited. pic.twitter.com/hXDw2dl8jF
'డ్రైవర్ పట్టించుకోలేదు'
డ్రైవర్ కూడా మంటలను గమనించలేదని స్థానికులు చెబుతున్నారు. 'అర్థరాత్రి 1:30 గంటల సమయంలో బస్సు వెనుక భాగంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలను చూసిన స్థానికులు బస్సు ఆపాలని కేకలు వేశారు. డ్రైవర్ గమనించుకోకుండా వెళ్తున్నాడు. దీంతో ఓ యువకుడు బైక్‌పై బస్సును వెంబడించి ఆపాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. కానీ కొంతమంది బస్సులో కాలిపోయారు' అని స్థానికులు తెలిపారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు - నలుగురు మృతి
Bus Accident In Karnataka : కర్ణాటకలో ట్రాక్టర్‌ను బస్సు ఢీకొనడం వల్ల నలుగురు మృతి చెందారు. మరో 18మంది గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కొప్పల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బస్సులో సుమారు 30మంది వరకు ఉన్నారు. వారంతా కరముడి గ్రామానికి చెందిన వారు. కొప్పల్‌లో ఉన్న హులిగెమ్మదేవి ఆలయాని వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు హోసలింగాపుర సమీపంలోని 50వ జాతీయ రహదారిపై రాగానే ముందున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, ఒక మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
'48 గంటల్లో పోలింగ్ శాతాలు వెల్లడించాలి!' ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు - Lok Sabha Elections 2024