ETV Bharat / bharat

గంటకు 320కి.మీ స్పీడ్​- రూ.లక్ష కోట్ల బడ్జెట్​​- దేశంలోనే తొలి బుల్లెట్​ ట్రైన్ విశేషాలివే!

Bullet Train Project In India : గంటకు గరిష్ఠంగా 320 కి.మీల మెరుపు వేగంతో నడిచే తొలి బుల్లెట్​ ట్రైన్​ను మోదీ 3.0లో చూడబోతున్నారంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. దీనిని ప్రపంచస్థాయి ఇంజినీరింగ్‌ అద్భుతంగా అభివర్ణించిన ఆయన 'ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు కారిడార్‌' విశేషాలతో కూడిన ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Bullet Train Project In India
Bullet Train Project In India
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 9:31 AM IST

Updated : Feb 13, 2024, 11:35 AM IST

Bullet Train Project In India : గంటకు గరిష్ఠంగా 320 కి.మీల మెరుపు వేగం. రెండు గంటల్లో 508 కిలోమీటర్ల ప్రయాణం. నదులపై 24 వంతెనలు. కాగా, 'ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు కారిడార్‌'కు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ఉన్న ఓ వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. తమ ప్రభుత్వం కలలు కాదు, వాస్తవాలను సృష్టిస్తోందని అన్నారు. 'బుల్లెట్‌ రైలు' కోసం ప్రధాని నరేంద్ర మోదీ మూడో పాలనలో ఎదురుచూడండంటూ రాసుకొచ్చారు. అంతేగాక ఈ ప్రాజెక్టును ప్రపంచస్థాయి ఇంజినీరింగ్‌ అద్భుతంగా అభివర్ణించారు అశ్వినీ వైష్ణవ్‌. దీన్ని భారత భవిష్యత్తుగా వీడియోలో పేర్కొన్నారు.

ఆగస్టు 2026 నాటికి 50కి.మీ సిద్ధం
Mumbai- Ahmedabad Bullet Train Corridor : దేశంలోనే తొలిసారి స్లాబ్‌ ట్రాక్‌ వ్యవస్థ, భూకంపాలను ముందుగానే పసిగట్టే ఏర్పాట్లు, 28 స్టీల్​ బ్రిడ్జీలు, ఏడు సొరంగాలు, సముద్రగర్భంలో ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 12 రైల్వేస్టేషన్లు తదితర విశేషాలను మంత్రి వీడియోలో ప్రస్తావించారు. కాగా, ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.1.08 లక్షల కోట్లు. తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.

3 గంటల్లోపే ముంబయికి
అహ్మదాబాద్‌-ముంబయి మధ్య అందుబాటులోకి రానున్న తొలి బుల్లెట్‌ రైలులో కొంతభాగం ఆగస్టు 2026 నాటికి సిద్ధం కానుందని ఇదివరకే రైల్వే మంత్రి ప్రకటించారు. గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు 50కి.మీ దూరం పూర్తవుతుందన్నారు. 508.17 కిలోమీటర్ల మేర పొడవున్న ఈ రైలు కారిడార్‌లో ఇప్పటికే 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం జరిగిందని మంత్రి వెల్లడించారు. ఇక ఈ బుల్లెట్​ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 3 గంటల్లోపే అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోవచ్చు.

వందేభారత్ స్లీపర్​
Vande Bharat Sleeper Train : వందేభారత్​ స్లీపర్​ రైళ్లను 2024లో మార్చిలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్రం గతేడాది సెప్టెంబరులో తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి'- పోలీసులకు కోర్టు ఆదేశం

కేంద్రంతో చర్చలు విఫలం- 'దిల్లీ చలో'కు రైతులు పిలుపు, ప్రభుత్వం అలర్ట్

Last Updated : Feb 13, 2024, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.