ETV Bharat / bharat

ఛత్రపతి శివాజీకి మోదీ తలవంచి క్షమాపణలు- విగ్రహానికి అనుమతులే ఇవ్వలేదన్న అధికారులు! - Modi On Shivaji Statue Collapse

Modi On Shivaji Statue Collapse : ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు తెలియజేశారు. మరోవైపు, 35 అడుగుల విగ్రహానికి అనుమతులు ఇవ్వలేదని మహారాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సంస్థ సంచాలకులు రాజీవ్‌ మిశ్రా వెల్లడించారు.

Modi
Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 7:34 PM IST

Modi On Shivaji Statue Collapse : మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ క్షమాపణలు తెలియజేశారు. "నేను ఇక్కడ దిగిన వెంటనే విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను" అని వెల్లడించారు. "ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారు. నా తలవంచి వారికి క్షమాపణలు చెబుతున్నా. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదు" అని మోదీ మాట్లాడారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.

ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కొద్దిరోజుల క్రితం కుప్పకూలిపోయింది. 35 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు. రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు భావిస్తున్నామని, అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. కాగా, తొమ్మిది నెలలు కూడా పూర్తికాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న దృష్టి, నాణ్యత మీద లేదని దుయ్యబట్టాయి.

మరోవైపు, 35 అడుగుల శివాజీ విగ్రహానికి అనుమతులు ఇవ్వలేదని మహారాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సంస్థ సంచాలకులు రాజీవ్‌ మిశ్రా వెల్లడించారు. తమకు కేవలం 6 అడుగుల మట్టి విగ్రహం డిజైన్‌ను చూపించారని పేర్కొన్నారు. అసలు విగ్రహం 35 అడుగుల ఎత్తుంటుందని తమకు వెల్లడించలేదని పేర్కొన్నారు. ఆ విగ్రహంలో స్టీల్‌ ప్లేట్లు వాడుతున్న విషయం కూడా చెప్పలేదన్నారు.

సింధ్‌దుర్గ్‌ జిల్లాలో ఈ విగ్రహం ఏర్పాటునకు రాష్ట్ర పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి భారత నౌకాదళానికి రూ.2.44 కోట్లు నిధులను బదిలీ చేశారు. దీనికోసం నేవీ ఒక శిల్పి, కన్సల్టెంట్‌ను నియమించింది. డిజైన్‌కు తుదిరూపు ఇచ్చాక వారి అనుమతుల కోసం డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌కు పంపించారు. ఆ తర్వాత దాని ఎత్తును చాలా రెట్లు పెంచేశారు. నిర్మాణం కూడా నాసిరకంగా చేపట్టారు. ఇటీవల పీడబ్ల్యూడీ ఈ విగ్రహం నట్లు, బోల్టులకు తుప్పు పట్టిందని నేవీకి లేఖ రాసింది. అసలు తమకు ఈ విగ్రహం నాణ్యత, స్థిరత్వాన్ని తనిఖీ చేసే అవకాశమే లేకపోయిందని పేర్కొంది. ఈ విగ్రహానికి నేవీ, అది నియమించిన శిల్పి, కన్సల్టెంట్‌లదే బాధ్యతని పీడబ్ల్యూడీ అధికారులు తేల్చి చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.