Black Mutton Curry Making Process: ఎప్పుడూ రొటీన్ కాకుండా.. వెరైటీ రెసిపీస్ ఇష్టపడేవాళ్లు తప్పకుండా.. ఈ బ్లాక్ మటన్ కర్రీని ప్రయత్నించి చూడాల్సిందే. ముఖ్యంగా రోటీల్లో ఈ కర్రీ సూపర్ కాంబినేషన్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
బ్లాక్ మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:
- మటన్- 750 గ్రాములు(ముప్పావు కిలో)
- పసుపు - అర టీస్పూన్
- ఉల్లిగడ్డ - 4(మీడియం సైజ్)
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- యాలకులు - 4
- లవంగాలు - 4
- సోంపు గింజలు - 1 టేబుల్‌స్పూన్
- ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
- షాజీరా - 1 టీస్పూన్
- తురిమిన అల్లం- 1 టేబుల్ స్పూన్
- చింతపండు గుజ్జు - 1 టేబుల్‌స్పూన్
- పుదీనా - కొద్దిగా
- గ్రీన్ చట్నీ - అర కప్పు
- పెరుగు - 1 కప్పు
- నూనె - 4 టేబుల్ స్పూన్
- గసగసాలు - 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క - 1 టేబుల్ స్పూన్
- మిరియాలు - 4
- ఎండుమిర్చి - 3
- బిర్యానీ ఆకు - 1
- తురిమిన వెల్లుల్లి - ఒకటిన్నర టేబుల్ స్పూన్
- ఉప్పు - తగినంత
- కసూరీ మేతి - 1 టేబుల్ స్పూన్
బ్లాక్ మటన్ కర్రీ తయారీ విధానం:
- ముందుగా మటన్‌ను గోరువెచ్చని నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మళ్లీ నార్మల్ వాటర్‌తో శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని అందులోకి పసుపు, పెరుగు, గ్రీన్ చట్నీ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అందులోకి మటన్ ముక్కలు వేసి ఆ మిశ్రమం మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోని 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
- ఉల్లిపాయలు వేగిన తర్వాత మారినేట్ చేసిన మటన్ ముక్కలను వేసుకుని కలుపుకోవాలి.
- అందులోకి ఒక కప్పు వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్‌ను హై ఫ్లేమ్‌లో పెట్టి ఓ విజిల్ వచ్చిన తర్వాత మంట తగ్గించి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఇప్పడు మరో స్టవ్ మీద ఓ పాన్ పెట్టి 1 టేబుల్‌స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, షాజీరా మినహా మిగిలిన మసాలాలు(ధనియాలు, యాలకులు, లవంగాలు, సోంపు, గసగసాలు, దాల్చినచెక్క, మిరియాలు, ఎండు మిర్చి) వేసి వేయించుకోవాలి.
- తర్వాత అందులోకి మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
- ఇప్పుడు కొబ్బరి తురుము వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు మళ్లీ స్టవ్ మీద ఓ పాన్ పెట్టి షాజీరా, బిర్యాని ఆకు వేసి వేయించాలి.
- తర్వాత తురిమిన అల్లం, వెల్లుల్లి వేసి.. అవి వేగిన తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
- ఇప్పుడు అందులో మటన్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి. చింతపండు గుజ్జు, కసూరి మేతి కూడా వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు స్టవ్‌ను సిమ్‌లో పెట్టి ముక్క మెత్తగా ఉడికే వరకు(25 నుంచి 30 నిమిషాలు) ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే బ్లాక్ మటన్ కర్రీ రెడీ అవుతుంది.
- పైన పుదీనా ఆకులు చల్లుకుంటే సువాసన మాత్రమే కాదు రుచి అదిరిపోతుంది.
మటన్ కీమా ఇలా ట్రై చేశారంటే - దిల్ ఖుష్ అవ్వాల్సిందే!
సండే స్పెషల్ - మజానిచ్చే మటన్ రుచులతో ప్లేట్లు ఖాళీ!
నోరూరించే పులావ్- ఇలా చేశారంటే వహ్వా అంటూ ప్లేట్లు నాకాల్సిందే!