ETV Bharat / bharat

హరియాణాలో బీజేపీ విజయఢంకా - వరుసగా మూడోసారి అధికారం

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం - పదేళ్ల తర్వాత అధికారం చేపట్టాలన్న కాంగ్రెస్​కు నిరాశే

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Haryana Election Result 2024
Haryana Election Result 2024 (ETV Bharat)

Haryana Election Result 2024 : హరియాణాలో మరోసారి కమలం విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కుంచుకుంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు గానూ 48 స్థానాలు గెలుచుకొని బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 36 సీట్లు కైవసం చేసుకుంది. ఐఎన్​ఎల్​డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతానే తెరవలేదు. కౌంటింగ్ ఆరంభంలో ముందంజలో ఉన్న కాంగ్రెస్, కొద్దిసేపటికే రెండో స్థానానికే పరిమితమైంది.

కాంగ్రెస్​కు కలిసిరాని ప్రజా వ్యతిరేకత
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఫలితాలు మొత్తం తారుమారు అయ్యాయి. పదేళ్ల పాలనలో బీజేపీపై నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, రైతు చట్టాల నిరసనలు, రెజర్ల ఆందోళనలు, జాట్​ల అసంతృప్తి వంటి అంశాలు రాజకీయ అస్త్రాలుగా మారినా- అవి కాంగ్రెస్​ను గెలుపు దిశగా నడిపించలేకపోయాయి. జాట్​లు, ఎస్​సీ ఓటర్లు 40శాతం ఉన్నా, కాంగ్రెస్​కు కలిసిరాలేదు. రైతులకు కనీస మద్దతు ధర వంటి ఏడు గ్యారంటీలతో వరాలు జల్లు కురిపించినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఎలాగైనా అధికారం చేపట్టాలని భావించిన కాంగ్రెస్​కు ఓటమి తప్పలేదు. కానీ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది.

బీజేపీకే ప్రజల మద్దతు
ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించినా ప్రజలు మాత్రం వరుసగా మూడోసారి మోదీ నాయకత్వానికే జై కొట్టారు. జాట్‌ల మద్దతు తగ్గడం వల్ల కలిగే నష్టాన్ని యాదవుల ఓట్లతో భర్తీ చేసుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా దిల్లీ చుట్టుపక్కల ఉన్న అహిర్వార్‌ ప్రాంతంలో యాదవుల ఓట్లను రాబట్టుకునేందుకు తీవర్రంగా ఆ పార్టీ కృషి చేసింది. అంతేకాకుండా మహిళలకు లక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు రూ.2,100, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, హర్​ ఘర్ గృహిణి యోజన కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి హామీలతో ఓటర్లును ఆకట్టుకుంది. యువత, పేదలు, రైతులు, మహిళలను ఆకర్షించే విధంగా మేనిఫెస్టోను విడుదలచేసి ప్రజల మద్దతును సాధించింది.

గెలుపొందిన ప్రముఖులు

  • హరియాణా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ లాడ్వా నియోజకవర్గంలో 16,054 ఓట్ల అధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి మేవా సింగ్‌పై ఘన విజయం సాధించారు.
  • మాజీ రెజ్లర్‌, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్‌ ఫొగట్‌ జులానాలో గెలుపొందారు. ఆమె తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన యోగేశ్ కుమార్‌పై 6,015ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలా కైథాల్‌లో గెలిచారు.
  • హిస్సార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన పారిశ్రామికవేత్త, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్‌ తల్లి సావిత్రి జిందాల్‌ విజయం సాధించారు.
  • అంబాలా కంటోన్మెంట్‌ నుంచి బీజేపీ సీనియర్‌ నేత, మంత్రి అనిల్‌ విజ్‌ విజయం సాధించారు.
  • మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హుడా గర్హి-సంప్లా-కిలోయ్‌ స్థానంలో గెలుపొందారు.
  • ఉచానా కలాన్‌ స్థానంలో హోరాహోరీగా సాగిన పోరులో కేవలం 39 ఓట్ల మోజారిటీతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ యాత్రి విజయం సాధించారు. ఈ స్థానంలో పోటీ చేసిన జేజేపీ అధినేత దుష్యంత్‌ చౌతాలా ఏకంగా నాలుగో స్థానానికి పరిమితయ్యారు.

2014 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన బీజేపీ, 2019 ఎన్నికల్లో 40 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో 48 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్‌ విజయం సాధించడం వల్ల ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హరియాణా సీఎం నాయబ్‌సింగ్‌ సైనీని అభినందించారు. ఈ విజయంతో ఆ పార్టీశ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు మిఠాయిలు పంచారు. బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు. హరియాణా ప్రజలు మరోసారి ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచారని సంతోషం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.