ETV Bharat / bharat

నటుడు రవి కిషన్‌కు DNA టెస్టు? ఆయనే తండ్రి అంటూ బాంబే హైకోర్టులో జూనియర్ నటి పిటిషన్ - BJP MP Ravi Kishan DNA Test - BJP MP RAVI KISHAN DNA TEST

BJP MP Ravi Kishan DNA Test : రేసు గుర్రం నటుడు, యూపీలోని గోరఖ్‌పుర్ ఎంపీ, బీజేపీ నేత రవికిషన్ శుక్లా ఎన్నికల వేళ ఓ వివాదంలో చిక్కుకున్నారు. రవికిషనే తన తండ్రి అంటున్న 25 ఏళ్ల యువ నటి షినోవా సోనీ మరో అడుగు ముందుకు వేశారు. తన తండ్రో కాదో తేల్చేందుకు రవికిషన్‌కు డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటూ ముంబయి హైకోర్టులో పిటిషన్ వేసింది. వివరాలివీ.

BJP MP Ravi Kishan DNA Test
BJP MP Ravi Kishan DNA Test
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 5:29 PM IST

BJP MP Ravi Kishan DNA Test : రేసు గుర్రం సహా పలు తెలుగు సినిమాల్లో నటించిన యాక్టర్ రవికిషన్ శుక్లా గుర్తున్నారా? మహారాష్ట్రలో పుట్టి, ఉత్తరప్రదేశ్‌లో పెరిగిన రవికిషన్ శుక్లా భోజ్‌పురి, హిందీ సినిమాలతో చాలా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లోనూ రవికిషన్‌కే బీజేపీ గోరఖ్‌పూర్ టికెట్ ఇచ్చింది. అయితే ఓ వైపు రవికిషన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా మరోవైపు ఏప్రిల్ 15న ఆయనకు వ్యతిరేకంగా వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది. అపర్ణా ఠాకూర్ సోనీ అనే మహిళ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎంపీ రవి కిషన్‌ తన భర్త అని చెప్పారు. తన కుమార్తె షినోవా సోనీని విలేకరులకు పరిచయం చేశారు. రవికిషన్ తన తండ్రో కాదో తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలని అప్పట్లో షినోవా సోనీ డిమాండ్ చేయడం సంచలనం క్రియేట్ చేసింది. ఈ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాలని వారు కోరారు. తాజాగా ఇప్పుడు షినోవా సోనీ ఇదే అంశంపై ముంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వల్ల వివాదం మరింత ముదిరింది.

షినోవా ఎవరు ?
ఏదిఏమైనప్పటికీ సరిగ్గా ఎన్నికల సమయంలో అలుముకున్న ఈ వివాదం రవికిషన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇది ఎన్నికల్లో మైనస్ పాయింట్‌గా మారే అవకాశం లేకపోలేదు. రవికిషన్‌‌కు కుమార్తెగా చెప్పుకుంటున్న షినోవా సోనీ తన తల్లి అపర్ణా ఠాకూర్ సోనీతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. 25 ఏళ్ల షినోవా సోనీ మహారాష్ట్రలో పలు చిన్న సినిమాల్లో నటించింది. మోడల్‌గానూ పనిచేస్తోంది. కొన్ని ప్రముఖ యాడ్స్‌లో కూడా ఆమె నటించారు. కునాల్ కోహ్లీ తీసిన వెబ్ సిరీస్ 'హికప్స్ అండ్ హుకప్స్'‌లో మాజీ మిస్ యూనివర్స్, నటి లారా దత్తాతో కలిసి షినోవా నటించారు.

షినోవా పిటిషన్‌లో ఏముంది ?
తాజాగా బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన షినోవా, గోరఖ్‌పుర్ బీజేపీ ఎంపీ రవికిషన్‌ను తన తండ్రిగా పేర్కొన్నారు. ఈవిషయాన్ని తేల్చేందుకు రవికిషన్‌కు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని కోర్టును కోరారు. ఒకవేళ ఈ డీఎన్‌ఏ టెస్టులో ఫలితం అనుకూలంగా వస్తే తనను రవికిషన్ కుమార్తెగా అధికారికంగా గుర్తించాలని పిటిషన్‌లో షినోవా ప్రస్తావించారు. కూతురిగా తన బాధ్యతను స్వీకరించడానికి రవికిషన్ నిరాకరించకూడదని ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఆమె అభ్యర్థించారు.

అపర్ణా ఠాకూర్ ఎవరు ?
షినోవా తల్లి అపర్ణా ఠాకూర్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. అయితే ఉద్యోగ రీత్యా ఆమె ముంబయిలో స్థిరపడ్డారు. అక్కడే అపర్ణ జర్నలిస్టుగా పనిచేశారు. 1995 సంవత్సరంలో విలేకరుల సమావేశం సందర్భంగా రవికిషన్‌తో అపర్ణా ఠాకూర్​కు పరిచయం ఏర్పడింది. అపర్ణ చెబుతున్న దాని ప్రకారం, రెండోసారి వారు కలిసినప్పుడు ఆమెకు రవి లవ్‌ ప్రపోజ్ చేశారి. ఆ తర్వాత వారిద్దరూ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారు. బిగ్ బాస్‌ షోలోకి రవికిషన్ వెళ్లిన టైంలో వారిద్దరి బంధం తెగిపోయింది. రవికిషన్‌తో తన అనుబంధం వల్లే షినోవా జన్మించిందని అపర్ణ అంటున్నారు. అయితే తన కూతురి వల్లే రవికిషన్‌తో బంధం తెగిపోలేదని, ఆయనతో నిత్యం టచ్‌లోనే ఉండేదానినని ఆమె ఏప్రిల్ 15న ప్రెస్ మీట్‌లో మీడియాకు వివరించారు.

అపర్ణపై రవికిషన్ భార్య కేసు, అభియోగాలివే!
రవికిషన్ చుట్టూ వివాదపు ఉచ్చు బిగుస్తుండటం వల్ల ఆయన భార్య ప్రీతి రంగంలోకి దిగారు. అపర్ణతో పాటు లఖ్​నవూకు చెందిన సమాజ్‌వాదీ నేత వివేక్ కుమార్ పాండే, యూట్యూబర్ ఖుర్షీద్ ఖాన్‌ రాజులపై కేసులు పెట్టారు. ఈ అంశంపై ముంబయి పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ''ఏడాది క్రితం కూడా రవికిషన్ నుంచి రూ.20 కోట్లు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించారు'' అని పోలీసులకు ప్రీతి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో అపర్ణా ఠాకూర్, ఆమె మరో భర్త, కుమార్తెలను నిందితులుగా చేర్చారు.

మీ క్షమాపణలు ప్రకటనల సైజులో ఉన్నాయా? రాందేవ్​ బాబాపై సుప్రీం మరోసారి ఆగ్రహం - SC on Patanjali Misleading Ads Case

ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌- బీజేపీ ఇప్పుడేం చెప్తుందని ఆప్‌ కౌంటర్​ - Arvind Kejriwal Health Condition

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.