ETV Bharat / bharat

'ఎన్ని కేసులైనా పెట్టుకోండి- నేను భయపడను- అవినీతిలో హిమంత నం.1'

Bharat Jodo Nyay Yatra Rahul Gandhi : తాను కేసులకు బెదిరిపోనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తనపై మరిన్ని కేసులు నమోదుచేసుకోవాలని అసోం పోలీసులకు సవాల్ చేశారు. అలాగే అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ దేళంలోనే అత్యంత అవినీతి సీఎం అని విమర్శించారు.

Bharat Jodo Nyay Yatra Rahul Gandhi
Bharat Jodo Nyay Yatra Rahul Gandhi
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 11:53 AM IST

Bharat Jodo Nyay Yatra Rahul Gandhi : తాను కేసులకు బెదిరిపోనని, మరిన్ని ఎఫ్ఐఆర్​లు నమోదు చేసుకోవాలని అసోం పోలీసులకు సవాల్ విసిరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తనతో సహా కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా మరికొందరిపై మంగళవారం అసోం పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేయడంపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. బార్​పేటలో భారత్ జోడో న్యాయ్​ యాత్రలో భాగంగా అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై రాహుల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని అత్యంత అవినీతి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అని పేర్కొన్నారు. అసోంలో భయం, ద్వేషాన్ని ఆయన వ్యాపింపజేస్తున్నారని అన్నారు రాహుల్. అంతటితో ఆగకుండా ప్రజల దృష్టి మరల్చి వారి భూములు, డబ్బును దోచుకుంటున్నారని విమర్శించారు.

  • #WATCH बारपेटा में भारत जोड़ो न्याय यात्रा के दौरान कांग्रेस नेता राहुल गांधी ने कहा, "पता नहीं कहां से उसके(हिमंत बिस्वा सरमा) दिमाग में आ गया कि वो राहुल गांधी को डरा सकता है। जितने केस लगाने में लगा दीजिए, मैं नहीं डरता...25 केस लगाए हैं, 25 और लगा दीजिए..." pic.twitter.com/ZOnaQwWiNT

    — ANI_HindiNews (@AHindinews) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Assam: At the 'Bharat Jodo Nyay Yatra' in Barpeta, Congress MP Rahul Gandhi says, "...He (Assam CM Himanta Biswa Sarma) is the most corrupt Chief Minister in the country...Whatever is told to you by the media is exactly what Assam CM has conveyed to them...The control of… pic.twitter.com/6E4HLDsIQS

    — ANI (@ANI) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'కేసులతో నన్ను భయపెట్టగలనన్న ఆలోచన హిమంత బిశ్వశర్మకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. వీలైనన్ని కేసులు పెట్టండి. మరో 25 కేసులు పెట్టండి. బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ నన్ను బెదిరించలేవు. బీజేపీ, ఆస్‌ఎస్ఎస్​ అసోం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారు అసోంను నాగ్‌పుర్(ఆర్ఎస్​ఎస్ ప్రధాన కార్యాలయం) నుంచి నడపాలనుకుంటున్నారు. కానీ మేము దానిని అనుమతించం. అసోంలో అవినీతి పరంపంర కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మల హృదయాలు ద్వేషంతో నిండిపోయాయి. కాజీరంగా నేషనల్ పార్క్​లో కూడా అసోం సీఎం హిమంత బిశ్వశర్మకు భూమి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

అమిత్​ షాకు ఖర్గే లేఖ
భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అసోంలో నిర్వహిస్తున్న రాహుల్‌ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఖర్గే లేఖ రాశారు. న్యాయ్​ యాత్రను గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తత దారితీసింది. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమయ్యారంటూ రాహుల్‌, ఇతర నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ పోస్టర్లను చించివేయడం, బీజేపీ కార్యకర్తలు యాత్రను అడ్డుకోవడం, నేతలపై దాడి చేయడం వంటి అంశాలను లేఖలో ఖర్గే ప్రస్తావించారు. సాక్ష్యాలు ఎదురుగా కనిపిస్తున్నా ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోలేదని అసోం ప్రభుత్వ తీరును ఎండగట్టారు. న్యాయ్‌ యాత్రలో పాల్గొంటున్న వారికి భద్రత కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని అమిత్‌ షాను ఖర్గే కోరారు.

రాహుల్ యాత్రలో ఉద్రిక్తత- గువాహటిలోకి రాకుండా బారికేడ్లు- దూసుకెళ్లిన కార్యకర్తలు

బిహార్ మాజీ సీఎంకు భారతరత్న- శతజయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.