Tips to Avoid Overload Problem in Washing Machine : వాషింగ్ మెషిన్(Washing Machine) ద్వారా బట్టలు ఉతికే బాధ తప్పుతుంది. కానీ.. జాగ్రత్తగా లేకపోతే సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మార్కెట్లో 5 కిలోల నుంచి 12 కిలోల వరకు వివిధ సైజుల్లో వాషింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటి అవసరాలను బట్టి మీరు తీసుకునే వాషింగ్ మెషిన్ కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే.. మెషిన్లో లోడ్ చేసే బట్టల పరిమాణం.. యంత్రం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకారమే దుస్తులు లోడ్ చేయాలి. ఎక్కువగా వేస్తే ఓవర్ లోడ్ ప్రాబ్లమ్ వస్తుంది.
ఉదాహరణకు.. మీది 5 కిలోల యంత్రం అనుకుంటే అందులో దాదాపు 12 టీ-షర్టులు లేదా 6 టవల్స్ లేదా మూడు షర్టులు, ఒక జత ప్యాంటు లోడ్ చేసుకోవచ్చు. అదే 6 కిలోల మెషిన్ అయితే.. దాదాపు 20 టీ-షర్టులు, 10 టవల్స్ లేదా 5 షర్టులు, రెండు జతల జీన్స్ వేయొచ్చు. మీది 8 కిలోల వాషింగ్ మెషిన్ అయితే.. అందులో 32 టీ-షర్టులు, 2 బెడ్‌షీట్‌లు, 4 టవల్స్ లేదా 8 షర్టులు, మూడు జతల జీన్స్ వరకు ఉతకవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
దుస్తుల లైఫ్‌ను పెంచే ట్రిక్- వాషింగ్ మెషీన్లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి!
మీ వద్ద ఉన్న వాషింగ్ మెషిన్ చిన్నదైతే.. ఉతకాల్సిన దుస్తులు ఎక్కువగా ఉంటే.. మెషిన్ కెపాసిటీకి అనుగుణంగా విభజించి వాష్ చేసుకోవాల్సిందే. ఇలా చేయడం ద్వారా.. బట్టలు శుభ్రంగా వాష్ అవడమే కాకుండా.. వాషింగ్ మెషిన్ పైన కూడా ఓవర్‌లోడ్ పడదు. అలాకాకుండా.. వాషింగ్ మెషిన్ కెపాసిటీకి మించి దుస్తులు ఓవర్ లోడ్ చేశారంటే.. పలు సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
వాషింగ్ మెషిన్ కెపాసిటీ కంటే ఎక్కువ బట్టలు అందులో వేస్తే.. మూత సరిగ్గా పట్టదు. ఇది మెషిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. మీది ఫ్రంట్ లోడ్ మెషిన్ అయితే అందులో బట్టలను ఓవర్‌లోడ్ చేస్తే.. డోర్ రబ్బర్‌ల మధ్య బట్టలు చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఓవర్ లోడ్ ప్రాబ్లమ్ కారణంగా యంత్రంపై అధిక ఒత్తిడి కలుగుతుంది. మీ వాషింగ్ టబ్ విరిగిపోవచ్చు. దానివల్ల షార్ట్ సర్క్యూట్‌కూ దారితీయవచ్చు. తద్వారా ప్రాణాపాయం కూడా కలిగే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక లోడ్ కారణంగా.. దుస్తులు ఒకదానికొకటి రాపిడికి గురై, త్వరగా చిరిగిపోయే ఛాన్స్ ఉంటుందంట. ఇంకా.. డిటర్జెంట్ కూడా అన్ని ప్రాంతాలకూ సరిగ్గా చేరదని, దాంతో మీ దుస్తుల్లో మురికి వదలదని సూచిస్తున్నారు. కాబట్టి.. ఓవర్ లోడ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాషింగ్ మెషిన్ యూజ్ చేయడం మంచిది అంటున్నారు నిపుణులు.
వాషింగ్ మెషిన్ ఇలా క్లీన్ చేస్తే - ఎక్కువ కాలం పనిచేస్తుంది!