ETV Bharat / bharat

ఐటీ హబ్​లో నీటి సంక్షోభం- ఎన్నికలపై తీవ్ర ప్రభావం- ఓటర్లకు ముఖం చాటేస్తున్న అభ్యర్థులు - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

Bengaluru Water Crisis : బెంగళూరు నగరంలో ఉన్న నీటి సమస్య లోకసభ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యే ఇప్పుడు అధికార పార్టీకి, విపక్షాలకూ చెమటలు పట్టిస్తున్నాయి. తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే ప్రాంతాల్లో బెంగళూరు ఒకటి. దీనితో పాటు ప్రస్తుతం నీటి సమస్యలు తెరపైకి రావడం వల్ల అభ్యర్థలు హడలెత్తిపోతున్నారు. ఓట్ల అడగటం కోసం స్వేచ్ఛగా అపార్ట్‌మెంట్‌లు, మురికివాడలకు అభ్యర్థులు వెళ్లలేకపోతున్నారు.

Bengaluru Water Crisis
Bengaluru Water Crisis
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 9:42 AM IST

Bengaluru Water Crisis : భారతీయ సిలికాన్‌ వ్యాలీ, ఉద్యాన నగరి బెంగళూరులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు అధికార పార్టీకి, విపక్షాలకూ చెమటలు పట్టిస్తున్నాయి. ఈ నగరం పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు ఈసారి తెరపైకి వచ్చిన నీటి సమస్యలు అభ్యర్థులను హడలెత్తిస్తోంది.

తక్కువ పోలింగ్ శాతం
బెంగళూరు పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజక వర్గాలకు ఏప్రిల్ 26న పోలింగ్‌ జరగనుంది. రాజకీయ, ఆర్థిక శక్తి క్షేత్రమైన ఈ ఐటీ నగరంలో పాగా వేసేందుకు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలు పోరాడుతుంటాయి. ఇక్కడ స్థానికేతరులదే ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందువల్ల ఓటరు నాడిని పట్టుకోవడం కత్తిమీద సామే. స్థానిక రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోని వలస జీవులు ఎన్నికలంటే తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఆ కారణంగానే ప్రతి ఎన్నికల్లోనూ అతి తక్కువ పోలింగ్‌ నమోదయ్యే తొలి ఐదు జిల్లాల్లో బెంగళూరు నగరం ఉంటోంది.

ఎన్నికలపై ప్రభావం
అయితే, పోలింగ్‌పై ఆసక్తి చూపని ఓటర్లనూ నగరంలో నెలకొన్న నీటి సమస్య కదిలించేలా ఉంది. 40 రోజులుగా నగరంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎన్నికల తేదీ నాటికి ఇది మరింత విజృంభించవచ్చని తెలుస్తోంది. బెంగళూరు నగరమంతా కావేరి నీటిపైనే ఆధారపడి ఉండటం వల్ల కేఆర్‌ఎస్‌ జలాశయంలో నీరు లేని కారణంగా వారానికి ఒక్కసారి కూడా నీరు అందని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ట్యాంకరుకు రూ.1,500ల నుంచి రూ.2వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. 50ఏళ్లుగా చూడని నీటి సమస్యను బెంగళూరు నగరం ఎదుర్కోంటోంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు అపార్ట్‌మెంట్‌లు, మురికివాడల్లో ఓట్ల కోసం స్వేచ్ఛగా వెళ్లలేకపోతున్నారు.

ఒకరిపై ఒకరు విమర్శలు
ఓటింగ్‌పై ప్రభావం చూపే నీటి సమస్యపై బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది వర్షాలు పడలేదని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని బీజేపీ ఆరోపిస్తోంది. అనధికారింగా లక్ష బోర్లకు అనుమతి, ట్యాంకర్‌ మాఫియాని అరికట్టలేకపోవటం, కేఆర్‌ఎస్‌ జలాశయంలో నీరు లేకున్నా తమిళనాడుకు నీటిని విడుదల చేసిన సర్కారే, ఈ సమస్యకు బాధ్యత వహించాలని బీజేపీ ప్రచారం చేస్తోంది. మరోవైపు బెంగళూరు నగరానికి తాగునీటిని సమృద్ధిగా అందించే మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది. కరవు పరిహారం సకాలంలో చెల్లించని కారణంగానే తాగునీటి సదుపాయాన్ని అందించలేకపోతున్నట్లు కేంద్రంపై ఆరోపణలు చేస్తోంది.

నీటితో పాటు మరిన్ని సమస్యలు
బెంగళూరు ఉత్తర నియోజకవర్గంలో 31.74 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. బెంగళూరు గ్రామీణంలో 27.63లక్షలు, బెంగళూరు కేంద్రం 23.98 లక్షలు, బెంగళూరు దక్షిణ 23.71 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే నీటి సమస్యతో పాటు వరద నీటి ముంపు, మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలు కూడా ఓటర్లు ప్రభావితం చేసేవి. 60శాతం కన్నడ నామఫలకాల నిబంధన, ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉపాధి, కాంగ్రెస్‌ సర్కారు వచ్చిన తర్వాత పెరిగిన వివిధ పన్నులు కూడా ఉన్నాయి.

నగరంలో బీజేపీ పాగా
ఎప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించినా బెంగళూరు నగరంలో బీజేపీ ఆధిపత్యాన్ని చాటుతూనే ఉంది. 2008కు ముందు బెంగళూరు ఉత్తర, బెంగళూరు దక్షిణలు మాత్రమే బెంగళూరు నగర స్థానాలుగా, రామనగర, చిక్కబళ్లాపురలు గ్రామీణ ప్రాంత స్థానాలుగా పరిగణించేవారు. నాలుగు స్థానాలుగా పునర్విభజన తర్వాత కూడా బీజేపీ మూడింటిని తన ఖాతాలో వేసుకుని నగరంపై పట్టు కొనసాగిస్తోంది. పునర్విభజనకు పూర్వం రెండు స్థానాల్లో ఒకటి తన ఖాతాలో వేసుకునే కాంగ్రెస్‌ ఆపై పట్టు కోల్పోతోంది. 2009లో ఆ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.

తొలి గెలుపు కోసం అలుపెరుగని పోరాటం- 14వసారి బరిలోకి పోపట్​లాల్​- ఆస్తులు అమ్మి మరీ! - lok sabha elections 2024

బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి- పోలింగ్ జరిగిన తర్వాత రోజే- మోదీ సంతాపం - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.