Bathroom Cleaning Tips : చాలా మంది మహిళలకు బాత్‌రూమ్‌ను శుభ్రం చేయడం పెద్ద టాస్క్. ఎందుకంటే.. ఎంత రుద్దినా బాత్ రూమ్ ఓ పట్టాన శుభ్రం కాదు. దీనివల్ల బాత్‌రూమ్ మొత్తం దుర్వాసన వస్తుంటుంది. ఇంకా బాత్‌రూమ్ క్లీన్‌గా లేకపోవడం వల్ల.. బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి చేరి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయిత.., కొందరు బాత్‌రూమ్ క్లీన్ చేయడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల క్లీనర్స్‌ను వాడుతుంటారు. వీటిలో కొన్ని హానికరమైన కెమికల్స్ ఉండటం వల్ల తరచూ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు! అయితే, ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఈజీగా బాత్‌రూమ్‌ను తళతళ మెరిసేలా చేయొచ్చని అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
షవర్ హెడ్ :
కొన్నిసార్లు షవర్ హెడ్‌లో మురికి పేరుకుపోయి రంధ్రాల్లో నుంచి వాటర్ సరిగ్గా రాదు. అయితే, ఇలాంటప్పుడు ఒక స్క్రబర్ తీసుకుని షవర్ హెడ్‌ను బాగా క్లీన్ చేయాలి. తర్వాత ఒక కవర్‌లో వాటర్‌పోసి టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ వేసి షవర్‌హెడ్‌కు కట్టాలి. ఒక గంట తర్వాత కవర్ తీసేసి శుభ్రం చేస్తే మురికి మొత్తం తొలగిపోతుంది.
How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!
టైల్స్ :
కొంతమంది బాత్‌రూమ్‌ను క్లీన్ చేస్తారు కానీ, టైల్స్‌ను మాత్రం శుభ్రం చేయరు. దీంతో అవి చాలా మురికిగా మారిపోతాయి. అయితే, టైల్స్ మురికిని తొలగించడానికి ఒక మగ్‌లో బేకింగ్ సోడా కొద్దిగా వేసి వాటర్ యాడ్ చేయండి. తర్వాత మురికిగా ఉన్న టైల్స్‌పై బేకింగ్ సోడా మిశ్రమాన్ని పోసి స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే ఎంత మురికిగా ఉన్న టైల్స్ అయినా కూడా తళతళా మెరిసిపోవడం ఖాయం!
అద్దాన్ని ఇలా క్లీన్ చేయండి :
మబ్బుగా కనిపించే అద్దాన్ని మెరిసేలా చేయడానికి.. ఒక కప్పులో కొద్దిగా బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ తీసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని అద్దంపై స్ప్రే చేసి, వస్త్రంతో క్లీన్ చేయండి.
కుళాయిలు :
కుళాయిలు శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ వస్త్రాన్ని వెనిగర్‌లో ముంచి, ఒక గంటపాటు కుళాయి చుట్టూ చుట్టండి. లేదంటే.. నైట్ మొత్తం ఉంచినా సరిపోతుంది. తర్వాత ఉదయాన్నే పొడి వస్త్రంతో కుళాయిలను క్లీన్ చేస్తే మెరిసిపోతాయి. వెనిగర్‌లో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కుళాయిలపై ఉన్న మురికిని మొత్తం తొలగిస్తుంది.
సబ్బు మరకలు :
బాత్ రూమ్‌లో సోప్ పెట్టిన చోట సబ్బు మరకలు అట్టుకట్టిపోతాయి. దీంతో అక్కడ అంతా అపరిశుభ్రంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు దుర్వాసన కూడా వస్తుంది. ఈ మరకలు తొలగించడానికి వెనిగర్, డిష్‌వాషింగ్ లిక్విడ్‌ను సమాన భాగాలుగా తీసుకొని లిక్విడ్ తయారు చేయాలి. తర్వాత ఈ లిక్విడ్‌లో స్పాంజ్ ముంచి ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో.. అక్కడ క్లీన్ చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు అలాగే ఉంచి.. స్మూత్‌గా స్క్రబ్ చేసి, నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఈ క్లీనర్‌తో - మీ బాత్ రూమ్ తళతళా మెరిసిపోద్ది!
బాత్‌రూమ్ టైల్స్ మురికిగా మారాయా ? ఈ నేచురల్ క్లీనర్స్‌తో మెరుపు గ్యారంటీ!