ETV Bharat / bharat

బెంగళూరులో నీటి కటకట-కార్ వాషింగ్, వాటర్ ఫౌంటెన్లపై ఆంక్షలు​!- నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5వేలు ఫైన్ - bangalore water crisis 2024

Bangalore Water Crisis 2024 : బెంగళూరును నీటి సంక్షోభం గడగడలాడిస్తోంది. ఎండాకాలం పూర్తిగా రాకముందే ప్రజలు మంచి నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కార్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణ పనుల్లో తాగునీటి వినియోగంపై నిషేధం విధించింది బెంగళూరు నీటి సరఫరా బోర్డు.

Bangalore Water Crisis 2024
Bangalore Water Crisis 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 11:26 AM IST

Bangalore Water Crisis 2024 : కర్ణాటక రాజధాని బెంగళూరులో మంచి నీటి సంక్షోభం తీవ్రంగా మారింది. ఈ క్రమంలో కార్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణ పనులు, వాటర్ ఫౌంటెన్లు, రోడ్డు నిర్మాణం వంటి పనుల కోసం తాగునీటి వినియోగంపై నిషేధం విధించింది బెంగళూరు నీటి సరఫరా బోర్డు(BWSSB). తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5000 జరిమానాను విధిస్తామని తెలిపింది.

తాగునీటి సమస్యల కోసం హెల్ప్​లైన్​
తాగునీటి సమస్యల కోసం బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలికే (బీబీఎంపీ) హెల్ప్​లైన్​ను ప్రారంభించిన కొద్దిసేపటికే వందల కొద్ది ఫోన్లు వచ్చాయి. ప్రధాన లేఅవుట్‌ల నుంచి చాలా మంది నీటి సమస్య గురించి విన్నవిస్తున్నారు. ట్యాంకర్​తో నీటి సరఫరాకు అధిక రుసుము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ట్యాంకర్లతో వచ్చే నీటికి డిమాండ్ విపరీతంగా ఉందని అంటున్నారు. అలాగే 2008లో బీబీఎంపీలో చేరిన బెంగళూరు పరిసర 110 గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నాయి. అక్కడ కూడా ప్రత్యేక హెల్ప్​లైన్​ను ఏర్పాటు చేశారు అధికారులు.

'బెంగళూరు నీటి సరఫరా బోర్డు(BWSSB) మార్చి 6న హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి నీటి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. హెల్ప్​లైన్ ప్రారంభించిన కొన్ని గంటలకే చాలా కాల్స్ వచ్చాయి. అపార్ట్‌మెంట్స్​ నుంచి కూడా నీటి కొరతపై ఫిర్యాదులు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడం వల్ల ప్రైవేట్ ట్యాంకర్లు నీటిని సరఫరా చేయడం లేదు. అందుకే వాటర్‌బోర్డు ద్వారా నీటి సరఫరా చేయాలనే డిమాండ్‌ ఉంది. తీవ్రమైన నీటి కొరత, మురికివాడలు ఉన్న ప్రాంతాలపై బీబీఎంపీ దృష్టి సారించింది.' అని అధికారులు తెలిపారు.

నీటి ట్యాంకర్​ సరఫరాకు రేటు ఖరారు
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ మాఫియాను అరికట్టేందుకు బెంగళూరు అధికారులు రంగంలోకి దిగారు. నీటి ట్యాంకర్ రేటును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంకర్ల యజమానులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. 5 కి.మీ పరిధిలో నీటిని సరఫరా చేసే 6 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.600; 10 కి.మీ పరిధిలో అయితే రూ.750; 5 కి.మీ పరిధిలో 8 వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కు రూ.700; 10 కిలోమీటర్లలోపు 8 వేల లీటర్ల నీటికి రూ.850గా నిర్ణయించారు. అలాగే 5 కి.మీ లోపు 1200 లీటర్ల నీటి ట్యాంకర్‌కు రూ.1000, 10 కి.మీ పరిధిలో నీటిని సరఫరా చేసే ట్యాంకర్​కు రూ.1200గా నిర్ణయించారు. ఒక్కో నీటి ట్యాంకర్‌పై రూ.2500 నుంచి రూ.3000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

'రామేశ్వరం కేఫ్​లో జరిగింది బాంబ్​ బ్లాస్టే'- సీఎం వెల్లడి- రంగంలోకి NIA

బెంగళూరులో నీటి సమస్య తీవ్రం- ఫేస్ వాష్ కోసం వెట్‌ వైప్స్- అలా చేయకపోతే రూ.5వేల ఫైన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.