ETV Bharat / bharat

పెన్సిల్​ కొనపై 'బాల రాముడు'- 93 లింకులతో గొలుసు- గిన్నిస్​లోనూ చోటు

Balak Ram Idol On Pencil Lead : అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని పెన్సిల్​ కొనపై చెక్కాడు మహారాష్ట్రకు చెందిన ఓ యువ పెన్సిల్​ ఆర్టిస్ట్​. అంతేకాకుండా పెన్సిల్​పై ఇతడు చెక్కిన మరో కళాఖండానికి గిన్నిస్​ బుక్​లోనూ చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఇతడి పెన్సిల్​ ఆర్ట్​కు సంబంధించిన ప్రత్యేక కథనం మీకోసం.

Balak Ram Idol On Pencil Lead
Balak Ram Idol On Pencil Lead
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 2:06 PM IST

భళా- పెన్సిల్​ కొనపై 'బాల రాముడు'!

Balak Ram Idol On Pencil Lead : పెన్సిల్‌ కొనపై అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని అద్భుతంగా మలిచి భళా అనిపించుకుంటున్నాడు కళాకారుడు జీవన్​ జాదవ్. మైక్రోస్కోప్​ సాయంతో రామయ్య విగ్రహాన్ని పెన్సిల్​ కొనపై తీర్చిదిద్దాడు. 1.5 సెంటిమీటర్ల పరిమాణంలో చెక్కిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిచిన్నదని చెబుతున్నాడు మహారాష్ట్ర నాశిక్​ జిల్లాకు చెందిన జీవన్ జాదవ్​. ఇప్పటికే పెన్సిల్​ కొనలపై ఎన్నో అద్భుతమైన కళాఖండాలను చెక్కి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​తో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్​ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్​ విభాగంలో ప్రాజెక్ట్​ మేనేజర్​గా పనిచేస్తున్నాడు.

Pencil Art By Maharashtra Young Man
పెన్సిల్​ కొనపై అయోధ్య బాలక్​ రామ్​!

"నాకు చిన్నప్పటి నుంచే పెయింటింగ్​పై ఆసక్తి ఉండేది. స్కూల్​లో ఉన్నప్పుడు చాక్​పీస్​లపై చిన్న చిన్న కళాఖండాలను చెక్కేవాడిని. కానీ, ఆ తర్వాత దీనిని సాధన చేయడంలో నిర్లక్ష్యం చేశాను. నేను ఇంజినీరింగ్​ చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఒకరు పెన్సిల్​ కొనపై చెక్కిన బొమ్మలకు సంబంధించిన వీడియోను పంపించాడు. అది చూసిన వెంటనే నాలోని కళాకారుడు మళ్లీ నిద్రలేచాడు. దీంతో ఈ కళలో నేను కూడా ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నాను. అలా పెన్సిల్​ కొనపై చిన్నపాటి విగ్రహాలు చెక్కడం ప్రారంభించాను. నాలాగే ప్రతిఒక్కరూ తమ అభిరుచులకు సానపెట్టాలి. వాటిని కొనసాగించాలి. నా ఈ కళ ప్రపంచానికి తెలిసినందుకు ఆనందంగా ఉంది. దీంతో నా ప్రాంతానికి పేరొచ్చింది"
--జీవన్​ జాదవ్​, పెన్సిల్​ ఆర్టిస్ట్​

వందకుపైగా విగ్రహాలు
జీవన్ జాదవ్ ఇప్పటివరకు క్రీడాకారులు, రాజకీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు సహా భారతీయ సంస్కృతి ప్రతిబింబిచేలా దేవతామూర్తులు బొమ్మలను పెన్సిల్​ కొనలపై చెక్కాడు. ఇతడు ప్రధాని నరేంద్ర మోదీ, ఛత్రపతి శివాజీ మహారాజ్​, మహాత్మా గాంధీ, ఏపీజే అబ్దుల్​ కలాం, లాల్​బాగ్​ కా రాజా (గణేశ్), లక్ష్మీదేవీ, మహేంద్ర సింగ్​ ధోనీ, సర్దార్​ వల్లభాయ్​ పటేల్​, మైకెల్ జాక్సన్​, విఠల్​ మూర్తి, నానా పటేకర్ వంటి వందకు పైగా అద్భుతమైన విగ్రహాలను రూపొందించాడు​.

Pencil Art By Maharashtra Young Man
పెన్సిల్ కొనలపై జీవన్ జాదవ్​ చెక్కిన కళారూపాలు.

2019లో 'గొలుసుకు గిన్నిస్​'
ఇవి కాకుండా ఒకే పెన్సిల్‌పై ఆంగ్ల అక్షరాలు A నుంచి Z వరకు చెక్కాడు జీవన్​. అంతేకాకుండా ఒక్క పెన్సిల్​తో 93 లింక్​లు కలిగిన ఓ గొలుసును కూడా తయారు చేశాడు. ఇందుకుగాను అతడికి 2019లో గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​లో చోటు దక్కింది. ఇక మహారాష్ట్రలోని ప్రసిద్ధ దేవాలయంలోని శ్రీమంత్​ దగ్దుషేత్​ హల్వాయి గణపతి మూర్తిని కూడా పెన్సిల్ కొనపై చెక్కాడు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దగ్దుషేత్ హల్వాయి గణేశ్​ విగ్రహంగా రికార్డులోకెక్కింది.

"పాఠశాల రోజుల్లోనే చాక్​పీస్​పై చిన్నచిన్న బొమ్మలను చెక్కేవాడు. ఈ తర్వాత పెన్సిల్​ కొనలపై సాధన చేసి ఈరోజు గిన్నిస్​ బుక్​ రికార్డుల్లోకి ఎక్కాడు. ఒక తల్లిగా ఇది నాకెంతో గర్వకారణం. ఒకపక్క పనిచేస్తూనే తన కళను కొనసాగించడం అభినందనీయం. పెన్సిల్​ సీసంపై ఏదైనా విగ్రహం చెక్కితే ముందుగా నాకే చూపిస్తాడు"
--సుమన్​ జాదవ్​, జీవన్​ జాదవ్​ తల్లి

ఫేస్​బుక్​ పోటీల్లోనూ బహుమతులు
ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ ఫేస్‌బుక్​ నిర్వహించిన అంతర్జాతీయ శిల్పకళా పోటీల్లోనూ ఎన్నో బహుమతులను గెలుచుకున్నాడు జీవన్​ జాదవ్. తన కళను నాశిక్​ ప్రజలు చూసేలా త్వరలోనే ఓ ఆర్ట్​ ఎగ్జిబిషన్​ను నిర్వహిస్తానని తెలిపాడు.

9,999 వజ్రాలతో అయోధ్య రామమందిర నమూనా- పెన్సిల్ కొనపై రామయ్య చిత్రం

1200 చాక్​పీస్​లతో అయోధ్య రామమందిరం నమూనా- ప్రాణప్రతిష్ఠ రోజే ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.